BigTV English

PM Modi Speech: ఆనాడు బేగంపేట సభలో ఫుల్ ఫైర్.. ఇప్పుడూ అదే జోష్.. మోదీ తగ్గేదేలే..

PM Modi Speech: ఆనాడు బేగంపేట సభలో ఫుల్ ఫైర్.. ఇప్పుడూ అదే జోష్.. మోదీ తగ్గేదేలే..
pm modi speech

PM Modi Speech: ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారంటే ఫుల్ ఫైర్ మీదుంటారు. మోదీ రాక తెలంగాణలో కాక రేపుతుంటుంది. ఆయన ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ ఏదో ఒకలా నిరసన సెగ రగిలిస్తూనే ఉంటుంది. గతంలో రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేసేందుకు వచ్చినప్పుడూ సింగరేణి ప్రైవేటీకరణపై లొల్లిలొల్లి చేసింది. ఆ అంశంపై ప్రధాని బహిరంగ సభ వేదికగా క్లారిటీ ఇచ్చాక కూడా.. మళ్లీ ఇప్పుడు అదే ఇష్యూపై ఆందోళనలు చేపట్టింది బీఆర్ఎస్.


ఇక మోదీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టినప్పుడల్లా.. కేసీఆర్ పాలనపై వీరలెవెల్‌లో రెచ్చిపోతున్నారు. గత ఏడాది మేలో నగరానికి వచ్చిన మోదీ.. బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. తెలంగాణలో ఇకముందు రాజకీయ యుద్ధమే అంటూ.. పిడికిలి బిగించి.. బల్ల గుద్ది మరీ.. గట్టిగా చెప్పారు మోదీ. ఆనాటి మోదీ స్పీచ్ కమలనాథులకు పూనకాలు తెప్పించింది. నేరుగా కేసీఆర్‌ పేరెత్తి మరీ ఆయన్ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతి పాలనపై విరుచుకుపడ్డారు. బీజేపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను తీవ్ర పదజాలంతో ఖండించారు.

ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వచ్చారు ప్రధాని మోదీ. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంతో పాటు 11,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే, ఈసారి చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా సభ నిర్వహించారు. అక్కడి నుంచే పలు ప్రాజెక్టులను రిమోట్ కంట్రోల్‌తో ఓపెన్ చేశారు. ప్రధాని హోదాలో చేపట్టిన కార్యక్రమం కాబట్టి.. బీజేపీ మీటింగ్ కాదు కాబట్టి.. డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా కేసీఆర్ పాలనపై అటాక్ చేశారు మోదీ. ఎక్కడా కేసీఆర్ పేరు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం నేరుగా టార్గెట్ చేశారు.


కుటుంబ పాలన, అవినీతి పాలన అంటూ పరోక్షంగా నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందని.. ప్రతీ ప్రాజెక్ట్, ప్రతీ పెట్టుబడిలో స్వలాభం చూసుకుంటున్నారని గట్టిగానే విమర్శించారు. అలాంటి, అవినీతిపరులపై చర్యలు తప్పవని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మోదీ. అవినీతిపై చర్యల నుంచి తప్పించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత టాపిక్‌నూ ప్రస్తావించారు. తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని.. అవినీతిపై పోరాటానికి తనకు ప్రజల మద్దతు కావాలంటూ కదం తొక్కారు ప్రధాని మోదీ. అప్పుడూ, ఇప్పుడూ.. ప్రధాని మోదీ ప్రసంగంలో పదును అసలేమాత్రం తగ్గలేదంటున్నారు. కాకపోతే స్టైల్ మారిందంటే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×