BigTV English
Advertisement

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

German Scientists:  బహుశా.. ఇప్పటివరకు ఇలాంటి ఘటన ఈ ప్రపంచంలో మరెక్కడా జరగపోయి ఉండొచ్చు. ఫస్ట్ టైమ్.. జర్మనీలో ఓ ఎలుక గబ్బిలాన్ని వేటాడి తినేసింది. దీనికి సాక్ష్యంగా.. ఓ వీడియో కూడా ఉంది. అయినా.. ఎలుకలు గబ్బిలాలను వేటాడి తినడమేంటి? ఈ అసాధారణ ప్రవర్తనకు కారణమేంటి? ఇప్పుడు జర్మనీ శాస్త్రవేత్తల్లో దీని గురించే ఆందోళన మొదలైంది. ఇది.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే దానిపై రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఎలుకలు గబ్బిలాలను తినడం వల్ల.. కోవిడ్ లాంటి మరో మహమ్మారి రావడం ఖాయమేనా?


గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకలు:

భూగోళంపై అప్పుడప్పుడు అరుదైన ఘటనలు జరుగుతుంటాయ్. వాటిలో కొన్ని మన ఊహకు కూడా అందవు. ఇది కూడా అలాంటిదే. లేకపోతే.. ఎలుకలు.. గబ్బిలాలను తినడమేంటి? ఈ ప్రశ్నకు అందుకు.. ఇదే పెద్ద సాక్ష్యం. ఇది.. ఏఐతో క్రియేట్ చేసిన వీడియో కాదు. పక్కా రియల్. ప్రతి ఒక్కరూ కచ్చితంగా నమ్మి తీరాల్సిన వాస్తవం. ఉత్తర జర్మనీలోని గబ్బిలాల సంరక్షణ కేంద్రాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా చిన్న కీటకాలను, ఇతర పదార్థాలను తినే గోధుమ రంగు ఎలుకలు.. గబ్బిలాలను చురుగ్గా వేటాడి తింటున్నాయ్. దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలను.. శాస్త్రవేత్తలు మొదటిసారి గుర్తించారు. వీడియోలో బంధించారు. పట్టణంలో గబ్బిలాలు ఉండే రెండు వేర్వేరు ప్రదేశాల్లో.. ఎలుకలకు సంబంధించిన ఈ అరుదైన ప్రవర్తనను పరిశోధకులు ఇన్‌ఫ్రారెడ్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి రికార్డ్ చేశారు. ఈ వీడియోలో ఓ బ్రౌన్ ర్యాట్ గబ్బిలాలు ఎగురుతున్న సమయంలో ప్లాట్ ఫామ్ దగ్గర వేచి ఉండి, గాల్లో నుంచి వాటిని లాగి పట్టుకుంటోంది. సాధారణంగా ఎలుకలు దాడులు చేసేవిగా మనందరికీ తెలిసినప్పటికీ.. అవి గబ్బిలాలను వేటాడటం, తినడం అనేది శాస్త్రీయంగా నమోదు కావడం ఇదే తొలిసారి. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.

జర్మనీలో శాస్త్రవేత్తలు చేస్తున్న కొత్త రీసెర్చ్:

జర్మనీలో శాస్త్రవేత్తలు చేస్తున్న కొత్త రీసెర్చ్ సమయంలో అనుకోకుండా ఇది బయటకొచ్చింది. గబ్బిలాలు సమూహంగా ఉన్నప్పుడు అవి ఎలా సంభాషిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వాటికి సంబంధించిన చర్యలను కెమెరాలతో రికార్డ్ చేస్తున్నారు. అలా లైవ్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వారిని షాక్‌కి గురిచేసే ఈ దృశ్యం కనిపించింది. మొదటగా చూసినప్పుడు ఇదేదో అనుకోకుండా జరిగిన పరిణామం అయి ఉంటుందనుకున్నారు. కానీ తర్వాత ఇదే రిపీటెడ్‌గా జరుగుతుండటం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. జర్మనీలోని బాడ్ సెగెబర్గ్, లూనెబర్గ్ లాంటి పట్టణాల్లో.. గబ్బిలాల ఆవాసాల్లో ఈ దృశ్యాలను గమనించారు. బాడ్ సెగెబర్గ్ పట్టణంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ సమీపంలోని గుప ప్రవేశ ద్వారాల దగ్గర, లూనెబర్గ్‌లోని ఓ పబ్లిక్ పార్కులో.. పరిశోధకులు నైట్ విజన్ కెమెరాలు అమర్చారు. వాటిలో.. ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక్కడ.. శీతాకాలంలో వేలాది గబ్బిలాలు నివసించేందుకు వస్తుంటాయి. వాటిని.. ఎలుకలు వేటాడే దృశ్యాలు.. ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బాడ్ సెగెబర్గ్‌లోని గుహలో బ్రౌన్ ర్యాట్స్.. గబ్బిలాలు గుహలోకి ప్రవేశిస్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు.. కనీసం 30 సార్లు గబ్బిలాలను వేటాడేందుకు ప్రయత్నించగా.. అందులో 13 సార్లు విజయవంతం అయినట్లు కనుగొన్నారు. అక్కడే.. 50కి పైగా గబ్బిలా అవశేషాలను కూడా గుర్తించారు. వాటిలో కొన్నింటిని పూర్తిగా తినకుండా ఉంచేశాయ్. అంటే.. ఎలుకలు వాటిని తరచుగా పట్టుకొని నిల్వ చేసుకుంటున్నాయని అర్థమవుతోంది. ఓ రీసెర్చ్ ప్రకారం.. చిన్న ఎలుకల సమూహం.. ఒక శీతాకాలంలో సుమారు 2 వేలకు పైగా గబ్బిలాలను వేటాడే అవకాశం ఉందని అంచనా వేశారు.


ఎలుకలు గబ్బిలాలను ఎలా వేటాడుతున్నాయంటే:

గోధుమ రంగు ఎలుకలు తమ వెనుక కాళ్లపై నిలబడి, తోకని బ్యాలెన్స్ చేస్తూ.. ఎగిరే గబ్బిలాలను పట్టుకుంటున్నాయి. ఒకవేళ మనుషులు గనక గాల్లో ఉన్న గబ్బిలాలను అందుకుంటే ఎలా ఉంటుందో.. ఈ దృశ్యాలు అలాగే ఉన్నాయి. గబ్బిలం చేతికి అందగానే.. వాటిని వెంటనే కొరికి చంపేస్తున్నాయి. ఎలుకలు వేటలో ఎంత చురుగ్గా ఉన్నాయో తెలియజేస్తున్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాత్రి వేళల్లో ఎలుకలు ఈ వేట కొనసాగిస్తున్నాయి. రాత్రిపూట వాటికి కంటి చూపు తక్కువగా ఉన్నప్పటికీ.. అవి తమ మీసాల ద్వారా వచ్చే గాలి అలలు, శబ్దాల ద్వారా గబ్బిలాలను గుర్తించి వేటాడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గబ్బిలం దాని చేతికి అందగానే.. దాని దంతాలను దానిలోకి గుచ్చి.. తినేందుకు తీసుకెళ్తోంది. ఈ రకమైన ఎలుకల ప్రవర్తన.. ఇంతకు ముందెప్పుడూ శాస్త్రీయంగా నమోదు చేయలేదు. ఇప్పటికే అనేక కారణాలతో ప్రమాదంలో పడిన గబ్బిలాల జనాభా.. ఎలుకల రూపంలో మొదలైన ఈ కొత్త తరహా వేట మరింత ముప్పుగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గబ్బిలాలను తిన్న ఎలుకలు సేఫ్‌గానే ఉన్నాయి. ఇప్పుడు ఆందోళన ఎలుకల గురించో.. గబ్బిలాల గురించో కాదు. ఈ పరిణామం.. మరో మహమ్మారి భయాలను రేకెత్తిస్తోంది. మరో చికిత్స లేని వ్యాధి వ్యాప్తి చెందితే.. మానవాళి పరిస్థితేంటన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంతకుముందెప్పుడూ చూడని ఓ దృశ్యం.. శాస్త్రవేత్తలతో పాటు సాధారణ జనాన్ని కూడా టెన్షన్ పెడుతోంది. ఈ ఒక్క అసాధారణ ఘటన.. కొత్త రకాల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం గురించి.. శాస్త్రవేత్తల్లోనూ కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

గబ్బిలాల ద్వారా ఏర్పడే వైరస్‌లు ఇవే:

గబ్బిలాలు గాల్లో ఉంటాయి.. ఎలుకలు భూమి లోపల కలుగుల్లో ఉంటాయి. అలాంటి ఎలుకలు.. జర్మనీలో గబ్బిలాలు నిద్రపోయే స్థావరం దగ్గరికొచ్చే.. గాల్లో వెళ్లే వాటిని వేటాడి చంపి తినేస్తోంది. ఈ అసాధారణ పరస్పర చర్య కారణంగా.. కొత్త రకం వైరస్‌లు పుట్టుకొచ్చి, మరో మహమ్మారి వ్యాప్తికి దారితీస్తుందా? అనే ఆందోళనే.. ఇప్పుడు అందరి మెదళ్లని తొలిచేస్తోంది. ఈ కొత్త రకం ఆహార గొలుసులో ఆందోళన రేకెత్తించే అంశాలెన్నో ఉన్నాయి. దీనివల్ల.. అనేక వైరస్‌లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే.. గబ్బిలాలు అనేక వైరస్‌లకు సహజ నిలయాలుగా ఉన్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్ కూడా దాని నుంచే వచ్చింది. నిఫా, ఎబోలా లాంటి అనేక వైరస్‌లకు, ప్రాణంతాక వ్యాధులకు గబ్బిలాలు వాహకాలుగా ఉన్నాయి. వీటితో పాటు పారామిక్సో వైరస్‌ లాంటి అనేక వ్యాధికారక క్రిములకు గబ్బిలాలు ఆక్రమిస్తాయి. మరోవైపు.. ఎలుకలు కూడా అనేక రకాల వైరస్‌లను మోసుకెళ్లగలవు. అందులో.. హంటా వైరస్‌తో పాటు ఎలుకల ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు ఉన్నాయి. అంతేకాక.. పట్టణ ప్రాంతాల్లో ఎలుకలు మానవులకు చాలా దగ్గరగా జీవిస్తాయి. ఇప్పుడు.. ఎలుకలు గబ్బిలాలను తినడం వల్ల.. ఆ వైరస్‌లు ఒక జాతి నుంచి మరో జాతికి మారే అవకాశం ఉంటుంది. దీనినే.. స్పిల్ ఓవర్ అంటారు.

అనేక వైరస్‌లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు:

గోధుమ రంగు ఎలుకలు.. ప్రపంచవ్యాప్తంగా మనుషులతో పాటు పెంపుడు జంతువులతో అత్యంత దగ్గరగా జీవిస్తాయి. ఇప్పుడవి గబ్బిలాలను తినడం ద్వారా.. వాటి నుంచి ఎలుకలకు ఏదైనా వైరస్ సంక్రమిస్తే.. అది మ్యుటేషన్ చెందే అవకాశం ఉంది. వాటి జన్యు నిర్మాణం మారి, కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ కొత్త వైరస్‌లు ఎలుకల ద్వారా సులభంగా మనుషులకు వ్యాపించి.. ఊహించిన వ్యాధికి దారితీయొచ్చనే భయాలున్నాయి. ఎలుకల ద్వారా ఆ వైరస్‌లు.. మనుషులకు, ఇతర జంతువులకు వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనిని.. జూనోటిక్ రిస్క్‌గా చెబుతున్నారు. ఈ రీసెర్చ్‌కి సంబంధించిన ఫలితాలు.. గ్లోబల్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్ అనే జర్నల్‌లోనూ పబ్లిష్ చేశారు. దాంతో.. జర్మనీ అధికారులు గబ్బిలాల ఆవాసాల చుట్టూ.. ఎలుకల సంఖ్యని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు కోరుతున్నారు.

జర్మనీ శాస్త్రవేత్తల్లో మెుదలైన ఆందోళనేంటి?

కరోనా వైరస్‌ లాంటి గబ్బిలాల వైరస్‌లు.. ప్రజలకు వ్యాప్తి చెందేందుకు, తరచుగా ఓ బ్రిడ్జ్ హోస్ట్ అనేది ఉంటుంది. ఇది గబ్బిలాలు, మనుషులతో క్రమం తప్పకుండా సంబంధంలోకి వచ్చే జంతువు. ఇప్పుడు.. ఎలుకలు ఆ బ్రిడ్జ్ హోస్ట్‌గా ఉండొచ్చనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. ఎలుకలు మాన వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. అవి ఎక్కువగా మనుషుల ఆవాసాల చుట్టే నివాసం ఉంటాయి. అందువల్ల.. తర్వాత రాబోయే మహమ్మారి వ్యాధికారకానికి గురయేందుకు ఎలుకలు కారణం కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి వైరస్.. గబ్బిలాల నుంచి వచ్చిందే. ఇప్పుడు.. ఎలుకలు గనుక గబ్బిలాలను తినడం అలవాటుపడ్డాయంటే.. అంతే సంగతి అంటున్నారు. ఎలుకల్లో ఈ తరహా ప్రవర్తన అరుదైన సంఘటనగా భావిస్తున్నప్పటికీ.. భయం మాత్రం తొలగడం లేదు. ఎలుకలు సాధారణంగానే సర్వభక్షకాలు. అయినప్పటికీ.. చురుకైన, ఎగిరే జంతువులను వేటాడటం అసాధారణం. కానీ.. జర్మనీలో అలాంటి వింతే జరిగింది. అంటువ్యాధుల వ్యాప్తిలో ఇప్పటికే కీలకపాత్ర పోషిస్తున్న రెండు జాతుల మధ్య.. వ్యాధికారక సంఘటనలు పరిశోధకుల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ దృశ్యాలు.. రాబోయే మహమ్మారి విపత్తుకు సంబంధించిన తొలి సన్నివేశంతో పోలుస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన పరిణామం శాస్త్రవేత్తలతో పాటు ప్రజలను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

జర్మనీలో గబ్బిలాలను చంపడం నిషేధం:

జర్మనీలో గబ్బిలాలను చంపడం నిషేధించారు. వాటి సంఖ్య తగ్గిపోతున్న క్రమంలో.. గబ్బిలాలను రక్షించడం తప్పనిసరి అంటున్నారు. అందువల్ల.. జర్మనీలో వాటిని చంపడం నిషేధించబడింది. అన్ని రకాల గబ్బిలాలకు జాతీయ, అంతర్జాతీయ రక్షణ ఉంది. నగరాలు కూడా గబ్బిలాల ఆవాసాలను రక్షించేందుకు బాధ్యత వహిస్తాయి. అక్కడ పరిస్థితులు, నిబంధనలు ఎలా ఉన్నా.. ఈ అసాధారణ పరిణామంపై.. నిశితంగా పరిశీలన చేయాలని.. మానవులు, జంతువులు, పర్యావరణ ఆరోగ్యాన్ని కలిపి చూపే.. వన్ హెల్త్ విధానాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఎలుకలు, గబ్బిలాల ఆహార గొలుసు.. కొత్త వైరస్‌ల ఆవిర్భావానికి దారితీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంఘటన.. ప్రపంచ దేశాలు వైరస్‌ల ఆవిర్భావంపై నిరంతర నిఘా, సన్నద్ధత అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

Story by Anup, Big Tv

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Big Stories

×