BigTV English
Advertisement

Digital Gold Scam Alert: డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా? సెబీ అలర్ట్!

Digital Gold Scam Alert: డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా? సెబీ అలర్ట్!

Digital Gold Scam Alert: బంగారం కొనాలంటే.. జ్యువెలరీ షాపుకే వెళ్లాలా ఏంటీ? ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ చేతుల్లోకి వచ్చింది. అందుకే.. క్లారిటీ లేకపోయినా, ప్యూరిటీ చూడకపోయినా.. డిజిటల్‌గా గోల్డ్ కొనేస్తున్నారంతా! కానీ.. డిజిటల్ గోల్డ్ మీరు పెడుతున్న పెట్టుబడి సేఫేనా? ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోళ్లపై సెబీ ఏమంటోంది? డిజీ గోల్డ్‌ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే.. రిటర్న్స్ రివర్స్ అయిపోతాయా?


ఫిన్‌టెక్ యాప్స్‌ నుంచి ఎవరైన బంగారాన్ని కొనేయొచ్చు..
కొత్త తరం ఇన్వెస్టర్లలో ఫిన్ టెక్ వెర్షన్ డిజిటల్ గోల్డ్ సూపర్ సక్సెస్ అయింది. మీ అకౌంట్‌లో ఓ వంద రూపాయలుంటే చాలు.. ఎవరైనా ఫిన్ టెక్ యాప్స్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. వాటి రేటుని.. రియల్ టైమ్‌లో ట్రాక్ చేయొచ్చు. తర్వాత.. వాటిని గోల్డ్ కాయిన్స్‌గానూ, గోల్డ్ బార్స్‌గానూ రీడీమ్ చేసుకోవచ్చు. అయితే.. సెబీ ఈ ట్రెండ్‌కి బ్రేకులు వేయాలని డిసైడ్ అయింది. ఈ విషయం మీదే.. సెబీ కీలక ప్రకటన చేసింది. బంగారంపై పెట్టుబడుల కోసం ఈ మధ్యకాలంలో చాలా మంది.. డిజిటల్ గోల్డ్‌పై ఆధారపడుతున్నారు. ఇంటి నుంచి కాలు కదపకుండా.. మొబైల్‌ స్క్రీన్ మీద చేతి వేళ్లు కదిపితే చాలు.. కూర్చున్న చోటు నుంచే ఈజీగా బంగారం కొనేయొచ్చు. ఇప్పుడు.. ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. భారీ లాభాలు వస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. భౌతికంగా బంగారం కొనుగోలు చేయడానికి బదులుగా..

డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణలోకి రావన్న సెబీ
ఈ మధ్య డిజిటల్ గోల్డ్ ఎక్కువగా కొనేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. కీలక ప్రకటన చేసింది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో లభించే.. గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనివల్ల.. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించింది. అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని సెబీ స్పష్టం చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు.. సెక్యూరిటీలు, కమోడిటీ డెరివేటివ్‌లు కావని చెబుతోంది. కాబట్టి.. వాటికి సెబీ నియంత్రణ వర్తించదని స్పష్టం చేసింది. అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయని తెలిపింది. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారులకు అందించే రక్షణ విధానాలు ఏవీ వర్తించవని వివరించింది. డిజిటల్ గోల్డ్‌లో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్క్‌లు పొంచి ఉంటాయని హెచ్చరించింది. అంటే.. మీరు ఎక్కడైతే గోల్డ్‌పై పెట్టుబడి పెడతారో.. ఆ ప్లాట్ ఫామ్ తిరిగి డబ్బు చెల్లించకపోవడం, నిర్వహణపరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని సెబీ తెపిపింది.


డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు ముందే జాగ్రత్తగా ఉండాలన్న సెబీ
ఆన్‌లైన్ గోల్డ్ ట్రేడింగ్ అనేది.. పూర్తిగా ఆ సంస్థ నిజాయితీ, స్థిరత్వంపై ఆధారపడి ఉంటాయి. డెలివరీ, నిల్వ, మేకింగ్ ఛార్జీల లాంటివి కూడా ఛార్జ్ చేసే అవకాశం ఉండొచ్చు. అందువల్ల.. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే ముందే జాగ్రత్తగా ఉండాలని సెబీ చెబుతోంది. ఫిన్ టెక్ యాప్స్‌లో.. ఈ తరహా పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు.. వాటి నియంత్రణ స్థితిని తప్పకుండా పరిశీలించాలంటోంది. పెట్టుబడి ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలంటున్నారు. డిజిటల్ గోల్డ్ విక్రయించే సంస్థలు, ఆయా ఉత్పత్తులు.. తమ నియంత్రణ పరిధిలో లేవని.. సెబీ క్లియర్‌గా చెప్పేసింది. కాబట్టి.. డిజిటల్ గోల్డ్ కొనుగోలు అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. సెబీ నియంత్రించే గోల్డ్ ఉత్పత్తులతో పోలిస్తే.. ఇవి చాలా భిన్నమైనవి. గోల్డ్ ప్రొడక్టుల్లో.. పెట్టుబడులకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యంత్రాంగపరమైన హామీ ఉండబోదు. ప్రస్తుతం.. బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆన్‌లైన్‌లో అత్యంత తక్కువగా 10 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ కొన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్.. జనాలను ఊరిస్తున్నాయ్. దాంతో.. సెబీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

పెట్టుబడిదారుల భద్రత కింద చట్టపరమైన రక్షణ ఉండదు
ఏదైనా ఒక డిజిటల్ గోల్డ్ ప్లాట్ ఫామ్ గనక నష్టాలు వచ్చి కూలిపోతే.. అందులో పెట్టుబడి పెట్టిన వారి డబ్బు కూడా పోతుంది. సెబీకి సంబంధించిన పెట్టుబడిదారుల భద్రత కింద ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. ఇలాంటి.. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రిత బంగారు ఉత్పత్తులకు భిన్నంగా ఉంటాయ్. ఎందుకంటే.. అవి సెక్యూరిటీలుగా చెప్పరు. పైగా.. ఈ యాప్స్ రెగ్యులేటరీ వాక్యూమ్‌లో పనిచేస్తున్నాయ్. ఇవి డిఫాల్ట్ అయి రిడెంప్షన్‌ని ఆలస్యం చేసినా, భౌతిక బంగారాన్ని డెలివరీ చేయడంలో విఫలమైనా.. సెబీ అస్సలు సాయం చేయదు. ముఖ్యంగా.. డిజిటల్ గోల్డ్ యాప్ కస్టమర్లకు.. సెబీ చెప్పాలనుకుంటున్నదేమిటంటే.. సంబంధితి ప్లాట్ ఫామ్స్ తమ నియంత్రణలో లేవని హెచ్చరిస్తోంది. ఏదైనా తేడా కొడితే.. వినియోగదారులకు సెబీ కింద పెట్టుబడిదారుల రక్షణ ఉండదు. డిజిటల్ గోల్డ్ ప్లాట్ ఫామ్స్.. రెగ్యులేటరీ మానిటరింగ్ లేకుండా పనిచేస్తాయ్. దీనివల్ల.. పెట్టుబడితారులు తమ విశ్వసనీయతని అంచనా వేయడం కష్టమవుతుంది. అందువల్ల.. ఈ ఫిన్ టెక్ యాప్స్‌లో ఏవీ సురక్షితమో, ఏవీ కావో గుర్తించడం కష్టమవుతుంది. వీటన్నింటికి మించి.. మనం కొనుగోలు చేసిన బంగారం.. వాస్తవానికి ఉందా? లేదా? సురక్షితంగా నిల్వ చేశారా? లేదా? అన్నది కూడా అనుమానమే.

ఖజానాలో సమానమైన బంగారాన్ని నిల్వ చేస్తామనే కస్టోడియన్
డిజిటల్ గోల్డ్ యాప్స్ ఎలా పనిచేస్తాయంటే.. ఎవరైనా ఒక యాప్ ద్వారా వెయ్యి రూపాయల బంగారాన్ని కొనుగోలు చేశారనుకోండి. కంపెనీకి చెందిన కస్టోడియన్.. ఖజానాలో సమానమైన బంగారాన్ని నిల్వ చేస్తామని చెబుతారు. కొన్ని ప్లాట్ ఫామ్స్.. మీ హోల్డింగ్‌ని కొన్నాళ్ల తర్వాత భౌతిక బంగారంగా మార్చడానికి కూడా మీకు అనుమతి ఇస్తాయి. అయితే.. ఇక్కడ సమస్య ఏమిటంటే.. ఖజానాలో బంగారం ఉందా? లేదా? అని ఎవరు తనిఖీ చేస్తారు? ఎవరు ఆడిట్ చేస్తారు? బంగారం నిల్వపై హామీ ఎవరు ఇస్తారనే దానికి సంబంధించి పక్కా రూల్స్ లేవు. ఈ ప్లాట్ ఫామ్ గనక దివాలా తీస్తే.. ఏం జరుగుతుందని చెప్పేందుకు స్పష్టమైన, చట్టపరమైన విధానం కూడా లేదు. అందువల్ల.. సెబీకి చెందిన కఠిన నియమాలను పాటించాల్సిన అవసరం వాటికి లేదు. అందుకే.. సెబీ స్పందించింది. ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్‌లో బంగారంపై పెట్టుబడులు పెట్టేవారిని హెచ్చరించింది.

డిజిటల్ గోల్డ్‌లో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్క్‌లు ఉంటాయని సెబీ హెచ్చరిస్తోంది ఓకే. డిజిటల్ గోల్డ్ వ్యవహారమంతా.. గజిబిజీగా ఉంది సరే! మరి.. గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయాలంటే.. ఎక్కడ చేయాలి? ఈటీఎఫ్‌లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్‌లు సెబీ పరిధిలోకి వస్తాయా? గోల్డ్ ఈటీఎఫ్‌లపై పెట్టుబడి పెట్టాలంటే.. ఏం చేయాలి? బంగారంపై మన పెట్టుబడికి మంచి రాబడి రావాలంటే.. తీసుకోవాల్సిన తెలివైన నిర్ణయమేంటి?

ఈటీఎఫ్‌లు, ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌లు, కమోడిటీ డెరివేటివ్‌లు
స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ చేసే ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్ ఫండ్స్‌.. ఈటీఎఫ్‌లు, ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌లు, కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల లాంటివి సెబీ పరిధిలోకి వస్తాయి. వీటి ద్వారా సెబీ పరిధిలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు.. భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. ప్రతి యూనిట్ ఒక నిర్దిష్ట పరిమాణంలో బంగారాన్ని సూచిస్తుంది. బంగారానికి అధీకృత కస్టోడియన్ కలిగి ఉంటారు. క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తారు. ఈటీఎఫ్‌లు.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ చేస్తాయి కాబట్టి.. పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఎప్పుడైనా యూనిట్లను కొనుగోలు చేయొచ్చు, అమ్మొచ్చు. పైగా.. బంగారానికి ఇప్పుడున్న రేట్లే వర్తిస్తాయి. దీంతో పాటు సెబీ కింద పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ ద్వారా సేఫ్టీ ఉంటుంది. డిజిటల్ గోల్డ్ ప్లాట్ ఫామ్స్ అందించలేని చట్టపరమైన భరోసాని అందిస్తాయి. ఇవి.. దీర్ఘకాలిక గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ల కోసం అనుకూలంగా ఉంటాయి. అయితే.. ప్రతి డిజిటల్ గోల్డ్ ప్రొవైడర్ మోసపూరితమైనదని కాదు. కొన్ని ప్లాట్ ఫామ్స్.. విశ్వసనీయ సంస్థలతో మద్దతు ఉంటుంది. అయితే.. పెట్టుబడిదారులకు ఏవి నిజంగా సురక్షితమైనవో తెలుసుకునేందుకు.. నమ్మదగిన మార్గం లేదు.

ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్స్‌లో పెరిగిన గోల్డ్ కొనుగోలు ట్రెండ్
సాధారణంగానే.. భారతీయులకు బంగారం అంటే అపరితమైన ప్రేమ ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ.. బంగారాన్ని కొనుగోలు చేసే విధానం మారుతోంది. జ్యువెలరీ షాపుల నుంచి యాప్‌ల దాకా వచ్చేసింది. ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్స్.. ఎప్పుడూ జ్యువెలరీ షాపునకు వెళ్లని లక్షలాది మందికి బంగారాన్ని అందుబాటులోకి తెచ్చాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి.. బంగారాన్ని సొంతం చేసుకునే వీలు కల్పిస్తున్నాయ్. అయితే.. సెబీ హెచ్చరిక.. ఈ ట్రెండ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గుర్తుచేస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఈజీఆర్‌లు డిజిటల్ గోల్డ్ లాగా ఇన్‌స్టంట్ అట్రాక్షన్, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సౌలభ్యంగా ఉండకపోవచ్చు. కానీ.. వాటిలో ఉన్నది ఒకటే.. అదే జవాబుదారీతనం. సెబీ చెబుతున్నది కూడా ఇదే. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టే డిజిటల్ మార్గం. ఇవి భౌతిక బంగారాన్ని కొనకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం ధరలపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ అంటే.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్‌ల తరహాలో పనిచేస్తుంది. బంగారం ధరల ఆధారంగా దీని విలువ మారుతూ ఉంటుంది. దీంతో భౌతిక బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.

Also Read: అయ్యయ్యో.. అతి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా..?

ఈటీఎఫ్‌లపై పెట్టుబడి పెట్టడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయ్. భౌతిక బంగారానికి ఉన్న భద్రతా సమస్యలు గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు ఉండవు. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు, అవసరమైనప్పుడు అమ్మేయొచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై తక్కువ మొత్తాలతోనూ పెట్టుబడి పెట్టొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్‌లకు సమానంగా ఉంటుంది. భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరేజ్‌ ఖర్చులు కూడా ఉండవు. అయితే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై పెట్టుబడి పెట్టాలంటే డీమాట్‌ ఖాతా కంపల్సరీ. స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కొనుగోలు చేయవచ్చు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఈ ఫండ్‌లను నిర్వహిస్తాయి. భద్రత కోసం పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఇతర సెబీ నియంత్రిత ఎంపికలకు మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

Story By Anup, Bigtv

Related News

Jubilee Hills By-Election: కౌంట్‌డౌన్ స్టార్ట్.. జూబ్లీ పీఠం ఎవరిది..?

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Big Stories

×