Tamilnadu Politics: తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఓవైపు స్టాలిన్.. ఇంకోవైపు తలపతి విజయ్, అన్నామలై, పళనిస్వామి.. గ్రౌండ్ కాస్తా ఇప్పటి నుంచే గరంగరం అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉంది. అందుకే సమయం లేదు మాత్రమా అంటున్నాయి పొలిటికల్ పార్టీలు. ప్రజలను ఆకర్షించేలా ఇప్పటి నుంచే గేమ్ నడిపిస్తున్నాయి. అందులో లాంగ్వేజ్ వార్, డీలిమిటేషన్ వార్ తో గేమ్ మరో లెవెల్ కు వెళ్లింది. తాజాగా సీఓవర్ సర్వే సంస్థ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఏంటది?
గరంగరంగా తమిళ రాజకీయం
తమిళ రాజకీయం మెల్లగా వేడెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే సరిగ్గా ఏడాది మాత్రమే. అందుకే పార్టీలన్నీ అడ్వాన్స్ అవుతున్నాయి. జనంలోకి వెళ్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయి. అందుకే కీలక ఇష్యూస్ పై అటు స్టాలిన్, ఇటు విజయ్, ఇంకోవైపు అన్నామలై సై అంటే సై అంటున్నారు. అక్కడ ఇక్కడ కాదు.. అన్నాసలైలోనే తేల్చుకుందామంటున్నారు. ఈసారి TVK పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో పోటీ మరింత రక్తి కట్టబోతోంది.
ఓటర్ మూడ్ పై సీఓటర్ ప్రీపోల్ సర్వే
స్టేట్ లీడింగ్ ఇష్యూస్ లో పొలిటికల్ పార్టీలు కీరోల్ పోషిస్తున్నాయి. ఇప్పటి నుంచే నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. అసలు తమిళనాడు ఓటర్ల మూడ్ ఎలా ఉంది.. నెక్ట్స్ ఎవరు వస్తే బాగుంటుందనుకుంటున్నారు.. ఎవరు సీఎం అయితే బెటర్ అని భావిస్తున్నారు.. ఇలాంటి అంశాలపై ప్రముఖ సర్వే సంస్థ సీ ఓటర్ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అందులో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. తమిళనాడు సీఎం ఎవరైతే బాగుంటుంది అన్న విషయంలో జనం ఎక్కువ మంది స్టాలిన్ కే జై కొట్టినట్లు సీ ఓటర్ సర్వే చెబుతోంది.
సీఎంగా స్టాలిన్ కు 27% మంది మద్దతు
27 శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. ఇక తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ కి షార్ట్ టైమ్ లోనే జనంలో ఫేమ్ బాగా వచ్చింది. టీవీకే అధినేత విజయ్ 18 శాతం ఓట్లతో స్టాలిన్ తర్వాత ఉన్నారు. అటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో ఉండగా, తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలైకి 9 శాతం సపోర్ట్ గా నిలిచారు. సో ఈ సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు ఉండాలన్న విషయంపై జనం చెప్పిన అభిప్రాయాలు.
స్టాలిన్ కు చేరువగా విజయ్ ప్రజాదరణ
సో ఇప్పటికిప్పుడు జనం నాడి స్టాలిన్ లీడర్ షిప్ వైపే ఉన్నాయి. అయితే స్టాలిన్ కు 27 శాతం, విజయ్ కి 18 శాతం పెద్ద గ్యాప్ లేదు. చెప్పాలంటే ఈ సీఎం రేసులో టీవీకే అధినేత తలపతి విజయ్ దూసుకెళ్లడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తమిళనాడు పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నాయా అన్న చర్చకు కారణమవుతోంది. మొన్నటిదాకా సినీ హీరోగా తమిళనాడులో పాపులారిటీ సంపాదించిన విజయ్ పొలిటికల్ గానూ అట్రాక్షన్ పెంచుకున్నారన్నది తాజా సర్వేతో వెల్లడైన విషయం.
ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదన్న వారు 24% మంది
ప్రస్తుత స్టాలిన్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎంత వరకు సంతృప్తిగా ఉన్నారన్న విషయంపైనా సీ ఓటర్ సంస్థ అంచనా వేసింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం 15 శాతం మంది ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నామని చెప్పగా, 36 శాతం మంది కొంతవరకు సంతృప్తి చెందామన్నారు. అయితే ఇంట్రెస్టింగ్ గా 25 శాతం మంది తాము అస్సలు సంతృప్తిగా లేమన్నారు. 24 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని సర్వేలో చెప్పారు. అంటే ఎలక్షన్లకు ఇంకా ఏడాది ఉండడంతో సర్వేలో పాల్గొన్న వారిలో 24 శాతం మంది నిర్ణయం తీసుకోలేదు. అంటే ఈ ఎన్నికల ఏడాది తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోంది. ఎవరు లీడింగ్ క్యాంపెయిన్ చేసి జనాన్ని ఆకర్షించగలుగుతారో తటస్థ ఓటర్లు అటువైపే మళ్లే అవకాశం ఉంది. దీంతో విజయావకాశాలను మెరుగుపరుచుకునే ఛాన్స్ ఉండబోతోంది.
స్టాలిన్ పనితీరుపై ఒక స్టాండ్ తీసుకోని వారు 23 శాతం
ఇక స్టాలిన్ కు సంబంధించి సర్వేలో తేలిన మరో విషయం చూద్దాం. సీఎంగా స్టాలిన్ వ్యక్తిగత పనితీరుపై 22 శాతం మంది పూర్తి సంతృప్తి పొందారు. 33 శాతం మంది కొంతవరకు సంతృప్తి చెందామన్నారు. అదే సమయంలో 22 శాతం మంది తాము అస్సలు సంతృప్తితో లేమని సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. 23 శాతం మంది స్టాలిన్ పనితీరుపై ఇంకా ఒక స్టాండ్ తీసుకోలేదు. సో స్టాలిన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన లీడర్ గా ఉన్నప్పటికీ, ఆయన పాలన పట్ల జనం సాటిస్ ఫాక్షన్ మిక్స్ డ్ గా ఉందని సర్వే చెబుతోంది. దీంతో స్టాలిన్ అలర్ట్ అయ్యేందుకు ఈ సర్వే ఉపయోగపడబోతోంది. ఇంకా తన స్థానాన్ని, సంతృప్తి పెంచే ర్యాంకును మెరుగుపరుచుకునే విషయంలో ఏడాది సమయం ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా డైవర్ట్ చేస్తారన్న కీలకంగా మారుతోంది. ఇప్పటికే లాంగ్వేజ్ వార్, డీలిమిటేషన్ వార్ ను ముందేసుకున్నారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అని సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు.
పళనిస్వామి పనితీరుపై 8 శాతం మంది పూర్తి సంతృప్తి
ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న పళనిస్వామి పనితీరుపై 8 శాతం మంది పూర్తి సంతృప్తి చెందితే, 27 శాతం మంది కొంతవరకు సంతృప్తి చెందామన్నారు. 32 శాతం మంది తాము అస్సలు సంతృప్తిగా లేమన్నారు. మరో 33 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని సర్వే సంస్థకు తమ అభిప్రాయంగా చెప్పారు. అలాగే ఓట్లను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన సమస్యల గురించి సర్వే సంస్థ అడిగినప్పుడు, మహిళల భద్రతపై 15 శాతం మంది, ధరల పెరుగుదలను 12 శాతం, డ్రగ్స్, లిక్కర్ ఎఫెక్ట్ 10 శాతం, నిరుద్యోగాన్ని 8 శాతం మంది ప్రస్తావించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయం అడగగా, 16 శాతం మంది జనం సంతృప్తిగా ఉన్నామనగా, 32 శాతం మంది కొంతవరకు సంతృప్తిగా ఉన్నామన్నారు. 25 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా, 27 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.
టార్గెట్ డీఎంకే, బీజేపీ, ఫైనల్ గా సీఎం పీఠం
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు చెప్పలేం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా తమిళ్ పొలిటికల్ సీన్ మారుతోంది. మెల్లమెల్లగా హీరో విజయ్ స్పీడ్ పెరుగుతోంది. మాటల్లో క్లారిటీ, పార్టీ నడపడంలో స్పష్టత, ప్రత్యర్థులకు కౌంటర్లు.. ఇవన్నీ పకడ్బందీగా మేనేజ్ చేస్తున్నారు. పొలిటికల్ మేనేజ్ మెంట్ విషయంలో అడ్వాన్స్ అవుతున్నారు. ఓ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాతే విజయ్ స్ట్రాటజీలు మారుతున్నాయా? తమిళ రేసు ఎటు దారి తీయబోతోంది??
ముందెన్నడూ చూడని ఎన్నికలను వచ్చే ఏడాది చూస్తారు..
ఇవి కేవలం రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలే..
పోటీ ఉండేది.. టీవీకే, డీఎంకే మధ్యే..
ఇదీ టీవీకే అధినేత తలపతి విజయ్ డైలాగ్స్
కీయాలను ఎవరూ ఆపలేరంటూ స్పీచ్ లో వాడి వేడి పెంచారు విజయ్. టార్గెట్ డీఎంకే, బీజేపీ. ఫైనల్ గా సీఎం పీఠం. కంప్లీట్ గా పొలిటికల్ గేర్ మార్చేశారు విజయ్. పార్టీ పెట్టిన ఏడాదిలోనే చాలా ఊపు తీసుకొచ్చారు. పొలిటికల్ పాపులారిటీ పెంచుకున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే పవర్ లోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో అయితే డీఎంకే.. లేదంటే అన్నాడీఎంకేకు పగ్గాలు అన్నట్లుగా సాగింది. ఒక టర్మ్ వాళ్లు, ఒక టర్మ్ వీళ్లు అన్నట్లుగా జనం తీర్పు సాగింది. కానీ ఇప్పుడు విజయ్ ఎంట్రీతో కంప్లీట్ పొలిటికల్ సినారియో మారిపోయింది. ఏదైనా అద్భుతం జరగొచ్చన్న సిగ్నల్నే కనిపిస్తున్నాయి.
కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందంటూ ఫైర్ అయ్యారు.
అంతే కాదు.. కేంద్రం రహస్యంగా డీఎంకేకు సహకరిస్తోందని ఆరోపించడం ద్వారా రెండు పార్టీలను కౌంటర్ చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందంటూ ఫైర్ అయ్యారు. తమిళనాడును ఏ డైరెక్షన్‌లో తీసుకువెళ్లాలనుకుంటున్నారో మోడీ ప్లాన్స్ అన్నీ తమకు తెలుసు అని, అయితే తమిళనాడును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ఘాటుగానే మాట్లాడారు. తమిళనాడు ఎన్నింటినో తట్టుకుని నిలబడిందని, ఆ విషయం మరిచిపోవద్దు… బి కేర్‌ఫుల్ అంటూ మాట్లాడారు విజయ్.
ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు
సో తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే.. టీవీకే అధినేత విజయ్ చాలా స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తున్నారు. ఏడాది టైమ్ ఉన్నా.. ప్లాట్ ఫాం రెడీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే తమిళగ వెట్రి కళగం నేతలు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌తో మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో టీవీకేకు పీకే ప్రత్యేక సలహాదారుగా ఉంటారా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ పార్టీ TVKకి 15 నుంచి 20శాతం ఓటు షేర్ ఉండవచ్చని ప్రశాంత్ కిశోర్ అంచనా వేసినట్లు తెలిసింది. ఆయన అంచనా వేసినట్లుగానే.. ప్రస్తుతం సీఎం రేసులో విజయ్ కి 18 శాతం జనం సర్వేలో సపోర్ట్ చేశారు.
సీఎం రేసులో విజయ్‌కి 18 శాతం జనం సర్వేలో సపోర్ట్
అయితే అధికారం చేపట్టడానికి ఇది సరిపోదు. అందుకే దీన్ని మరింత పెంచేందుకే కొత్త వ్యూహాలు రచిస్తున్నారా అన్నది చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కోసం పనిచేసి ఆ పార్టీ విజయంలో తెరవెనుక కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్.. లేటెస్ట్ గా టీవీకేతో మంతనాలు జరపడం కీలక పరిణామం. ప్రస్తుతం విజయ్ జన నాయగన్ తెలుగులో జన నాయకుడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హీరో విజయ్ పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారు.
విజయ్ కదలికలపై డీఎంకే, బీజేపీ అలర్ట్
టీవీకే అధినేత విజయ్ కదలికలపై డీఎంకే, ఇటు బీజేపీ అలర్ట్ గా ఉంటున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా సీన్ లో ఘాటు పెంచుతున్నారు. మొన్నటికి మొన్న చెన్నైలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా స్టాలిన్ మీటింగ్ పెడితే.. ఎవరొస్తారో చూస్తా అని డైలాగ్ విసిరారు. అంతకు ముందు డీఎంకేతో హాట్ డిబేట్ టైంలో అన్నాసలైలోనే తేల్చుకుందామని సీఎంకు సవాల్ విసిరారు. సో ఏరకంగా చూసినా ఒకవైపు డీఎంకే, ఇంకోవైపు టీవీకే, అటు అన్నాడీఎంకే – బీజేపీ కాంబినేషన్ లో తమిళ రాజకీయం హీటెక్కిపోవడం ఖాయమంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పళనిస్వామి పాత్ర ఏంటన్నది ఇంకా తేలని విషయం.