BigTV English

Salt Side Effects: ఉప్పు ఎక్కువగా తింటే.. హైబీపీ వస్తుందా ?

Salt Side Effects: ఉప్పు ఎక్కువగా తింటే.. హైబీపీ వస్తుందా ?

Salt Side Effects: ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న తీరును గమనిస్తూ, ఆరోగ్య నిపుణులు ప్రజలందరూ తమ జీవనశైలి, తినే ఆహారం పట్ల కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మన ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించే.. ఉప్పు, చక్కెర అత్యంత హానికరమైన పదార్థాలు. ఎక్కువ చక్కెర తినడం వల్ల మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇదిలా ఉంటే.. అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.


ఆరోగ్య నిపుణులు సోడియం లేదా టేబుల్ సాల్ట్ ఎక్కువగా తింటే.. రక్తపోటు ఖచ్చితంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగని దీనిని పూర్తిగా కూడా కష్టమైన పనే. ఎక్కువగా ఉప్పు తినడం వల్ల హైబీపీ వస్తుంది. ఇది మూత్రపిండాలు, గుండెను దెబ్బతీస్తుంది. అయితే.. మీరు ఉప్పు తినడం పూర్తిగా మానేస్తే.. అది హైపోటెన్షన్ కండరాల బలహీనత, గుండె సమస్యలకు దారితీస్తుంది.

ఎక్కువగా ఉప్పు తింటే కలిగే నష్టాలు:


రక్తపోటు పెరిగే ప్రమాదం:
శరీరానికి ఉప్పు అవసరం. కానీ ఉప్పు అధికంగా తీసుకున్నా లేదా తక్కువగా తీసుకున్నా రెండూ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునేవారికి హైబీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 23% ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

మూత్రపిండాలు ,ఎముకలపై ప్రభావం:
అధిక మొత్తంలో ఉప్పు తినడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణం అవుతుంది. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. ఎక్కువగా ఉప్పు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

ఈ అలవాటు ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా కాల్షియం విసర్జన పెరుగుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

అలసట, బలహీనతకు కారణాలు:
ఉప్పు తినడం మానేయడం కూడా సరికాదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి, కానీ మీరు దాని తీసుకోవడం పూర్తిగా తగ్గిస్తే, అది శరీరంపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మన శరీరానికి ఉప్పు పరిమితంగా మాత్రమే అవసరం. దీని లోపం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది తలతిరగడం, మూర్ఛ, బలహీనంగా అనిపించడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. చాలా తక్కువ ఉప్పును ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల హైపోటెన్షన్, గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది.

Also Read: ఇంట్లోనే పెరుగుతో.. ఫేషియల్ చేసుకోండిలా !

ఉప్పును మితంగా తీసుకోండి:
ఉప్పు లేకపోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు అసమతుల్యమవుతాయి. ఇది గందరగోళం, మెదడు వాపు, కోమా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 5 గ్రాముల (1 టేబుల్ స్పూన్) ఉప్పు తినాలి. పిల్లలకు రెండున్నర గ్రాములు సరపోతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్ లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని నివారించండి. ఉప్పును సమతుల్య పరిమాణంలో తీసుకోవడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×