BigTV English

Acharya Satyendra Das: అయోధ్య ఆలయం పూజారిని జలసమాధి ఎందుకు చేశారు? అలా చేయొచ్చా?

Acharya Satyendra Das: అయోధ్య ఆలయం పూజారిని జలసమాధి ఎందుకు చేశారు? అలా చేయొచ్చా?

Big Tv Live Original: అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య జత్యేంద్ర దాస్ ను సరయు నదిలో జలసమాధి చేశారు పండితులు.  ఈ నెల 12న దివి నుంచి భువికేగిన ఆయన పార్దివదేహాన్ని గురువారం నాడు శాస్త్రోక్తంగా నీటిలోకి వదిలేశారు. 85 ఏండ్ల వయసున్న ఆయన బ్రెయిన్ స్ట్రోక్ తో ఫిబ్రవరి 3న  లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. కొద్ది రోజలు పాటు చికిత్స తీసుకున్న ఆయన బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. హాస్పిటల్ నుంచి  ఆచార్య జత్యేంద్ర  పార్దివదేహాన్ని గోపాల్ ఆశ్ర‌యానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రథంలో సరయు నది వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపులో సాధువులు, రామ‌భ‌క్తులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. అనంతరం రామానంది సంప్రదాయాయాల ప్రకారం తులసీదాస్ ఘాట్ దగ్గర జత్యేంద్ర దాస్ ను జల సమాధి చేసినట్లు ఆయన వారసుడు ప్రదీప్ దాస్ తెలిపారు. జల సమాధిలో భాగంగా.. ఆయన నదిలో మునిగిపోయేందుకు పార్దివ దేహానికి బరువైన రాళ్లు కట్టినట్లు తెలిపారు. వాటితో పాటు ఆయన భౌతికకాయాన్ని నదిలోకి వదిలినట్లు చెప్పారు.


జలసమాధి వెనుకున్న అసలు కారణం!

హిందూ సంప్రదాయం ప్రకారం జల సమాధి ప్రక్రియను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఋషులు, పండితులు, మునులకు ఈ రకమైన అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయోధ్యలో జల సమాధికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాముడు  భూలోక జీవితం తర్వాత.. తన దైవిక నివాసమైన వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయంలో సరయు నదిలో జల సమాధి తీసుకున్నారని నమ్ముతారు. సరయు ఒడ్డున ఉన్న గుప్తార్ ఘాట్‌ లో రాముడు జల సమాధి అయినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రీ రాముడు చివరిసారి ఇక్కడ ధ్యానం చేసి జల సమాధి అయినట్లు రాసి ఉంది. ఆచార్య జత్యేంద్ర దాస్ సైతం తన ఇష్ట దైవం శ్రీరాముడి మాదిరిగానే జల సమాధి కావాలనేది చివరి కోరికట. ఆయన కోరిక మేరకు సరయు నదిలో జల సమాధి చేశారు. ఈ జల సమాధి ద్వారా ఆధ్యాత్మిక సేవను గౌరవించడమే కాకుండా, రాముడు భూ ప్రపంచం నుంచి వెళ్లి పోయిన అంశానికి ముడిపడి ఉందని పండితులు చెప్తున్నారు.


రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర

ఆచార్య సత్యేంద్ర దాస్ దేశంలో దశాబ్దాల పాటు కొనసాగిన రామ జన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి ఆయన శ్రీరాముడి ఆలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. నిర్వాణి అఖాడాలో గౌరవనీయ సభ్యుడైన ఆచార్య సత్యేంద్ర దాస్ 20 సంవత్సరాల వయస్సులోనే  తన జీవితాన్ని ఆధ్యాత్మిక సేవకు అంకితం చేశారు. ఆయన దగ్గర ఉండి అయోధ్యలో ఆలయ అభివృద్ధి,  మతపరమైన వ్యవహారాలను చూసుకున్నారు.

ఆచార్య సత్యేంద్ర దాస్ మరణం పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

ఆయన నిష్కమణ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆచార్య దాస్ తన జీవితమంతా రాముడి సేవకే అంకితం చేశారని ప్రధాని మోడీ అన్నారు. దేశ ఆధ్యాత్మిక, సామాజిక జీవితానికి దాస్ చేసిన అమూల్యమైన కృషిని ఎల్లప్పుడూ భక్తితో గుర్తుంచుకుంటామన్నారు.

Read Also: చిల్కూరు బాలాజీ టెంపుల్ గురించి మీకు తెలియని విశేషాలు.. ఆ ప్రదక్షిణల వెనుక అంత కథ ఉందా?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×