Rohit Sharma Poster In Pakistan: పాకిస్తాన్ గడ్డపైన.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… బ్యానర్ వెలిసింది. భారీ స్థాయిలో… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… బ్యానర్ ను ఏర్పాటు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… ఈ భారీ కటౌట్… ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్… తెగ సంబర పడిపోతున్నారు. చరిత్రలో రోహిత్ శర్మ మిగిలిపోతాడని కామెంట్స్ పెడుతున్నారు.
శత్రు దేశమైన పాకిస్తాన్ గడ్డపైన రోహిత్ శర్మ ( Rohit Shara ) ఒక వీరుడిలా కనిపిస్తున్నాడని కూడా కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ మెడలు వంచి… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కూడా గెలవాలని అంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అలాగే జట్లను ప్రకటించి… పాకిస్తాన్ కు ( Pakisthan ) కొన్ని దేశాలు అలాగే టీమిండియా దుబాయ్ కి వెళ్లడం జరిగింది.
చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు అంటే దాదాపు 20 రోజులపాటు జరగనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒత్తిడి మేరకు… హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ మెడలు వంచి.. హైబ్రిడ్ మోడల్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒప్పించింది. అంతర్జాతీయ కౌన్సిల్ కు… భారత క్రికెట్ నియంత్రణ మండలి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి టీమిండియా…. కోసం హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో… టీమిండియా ఆడే మ్యాచ్ లు అన్నీ దుబాయిలో దొరుకుతాయి. మిగతా మ్యాచ్ లన్ని పాకిస్తాన్ దేశంలో నిర్వహిస్తారు. అంటే… ఈ టోర్నమెంట్ లో సెమీస్ లేదా ఫైనల్ కు టీమిండియా వెళ్తే.. అప్పుడు ఈ రెండు మ్యాచ్లు కచ్చితంగా దుబాయిలో జరుగుతాయి. ఒకవేళ ఫైనల్ వరకు టీమిండియా వెళ్లకపోతే… పాకిస్తాన్ దేశంలోనే… ఆ మ్యాచులు జరుగుతాయి. ఇక టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య.. ఏ మ్యాచ్ జరిగిన దుబాయ్ లోనే నిర్వహిస్తారు. అయితే టోర్నమెంట్ లో భాగంగా… ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ దుబాయ్ జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్లో రోహిత్ శర్మ బ్యానర్లు కట్టారు. అయితే ఈ బ్యానర్ లో పాకిస్తాన్ కెప్టెన్.. మహమ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నారు. ఇద్దరు కెప్టెన్లను కలిపి.. దాదాపు 50 అడుగుల బ్యానర్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ తరుణంలోనే దీనికి సంబంధించిన ఫోటోలు… అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Sri Lankan Team: శ్రీలంకను ఇక టచ్ చేయలేరు.. అక్కడ బాహుబలి ఉన్నాడు !
Captain Rohit Sharma's Massive poster in Pakistan for the Champions Trophy.
– THE CRAZE OF HITMAN..!!!! 🌟🔥 pic.twitter.com/YdpDDGB67K
— Tanuj Singh (@ImTanujSingh) February 15, 2025