Anantapur District: ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య మరోసారి సవాళ్లు – ప్రతి సవాళ్ల పర్వం మొదలైంది … గతంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధికారంలో ఉంటే .. కాపు రామచంద్రారెడ్డి ప్రతిపక్షంలో ఉంటేవారు. ఈయన అధికార పార్టీలో ఉంటే ఆయన విపక్ష నేతగా పరస్పర విమర్శలు చేసుకుంటూ ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడా ఇద్దరు నేతలు కూటమి పార్టీల్లో కలసిపోయారు అనుకొనే లోపలే మళ్ళీ ఇప్పుడు రా చూసుకుందాం అంటే చూసుకుందాం అంటున్నారు… అసలు వారిద్దరి రాజకీయమేంటి? కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి… తాను ప్రశాంతంగా ఉందామనుకున్నా… తనను గిల్లుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అంటుంటే… గడచిన 15 నెలలు తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నానని… పొత్తు ధర్మం పాటించి సహనంతో ఉన్నానే తప్ప… చేతకాక శక్తి లేక కాదంటున్నారు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు… ఇలా ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మరోసారి మాటలు తూటాల్లా పేలుతున్నాయి … కూటమి భాగస్వామి అయిన బీజేపీలో ఉంటూ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులు దగ్గరకు వెళుతున్నారని… టిడిపి రాయదుర్గం సోషల్ మీడియాలో పెడుతున్నపోస్టులు… కాపు రామచంద్రరెడ్డి ఆగ్రహానికి కారణమవుతున్నాయంట …
వైసీపీ నాయకులు, కార్యకర్తలు బిజెపిలోకి వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని… వైసీపీ కార్యకర్తలు బిజెపిలో జాయిన్ అయితే అది కూటమికి బలమే కదా… అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వాదిస్తున్నారు … అయితే ఆయన ఎప్పటికైనా బీజేపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అందుకే వరుస పెట్టి వైజేపీ నేతలు ఇళ్లకు వెళ్లి పరామర్శల పేరుతో రాజకీయం చేస్తున్నారని కూటమి నాయకులు భగ్గుమంటున్నారు… ఇదంతా రాయదుర్గం టిడిపి నేతలతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనపై దుష్ప్రచారమని… మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కాలవపై విరుచుకుపడుతున్నారు… తాను ప్రశాంతంగా ఉండాలనుకున్న… తనను ప్రశాంతంగా ఉండనీయడం లేదని… తనను అనవసరంగా గెలుకుతున్న వారికి ఒకటే చెబుతున్నాను… ఇక ప్రతిరోజు వైసిపి నాయకుల ఇళ్లకే వెళ్తాను… ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి…
మాజీ ఎమ్మెల్యే కాపు వ్యాఖ్యలపై అటు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూడా ఘాటుగానే స్పందించారు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలు తాను ఎక్కడా కాపు రామచంద్రారెడ్డి పేరు కూడా ఎత్తలేదని… కానీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాత్రం… కూటమిలో శాసన సభ్యునిగా ఉన్న తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదు అంటున్నారు… పొత్తు ధర్మం పాటించి సహనంతో… సంయమనంతో ఉన్న తప్ప… చేతకాక… శక్తి లేక కాదు అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి… రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు… ఇక తన ఓపిక నశించిందని… మరోసారి కాపు రామచంద్రారెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే… తను నుంచి వచ్చే రియాక్షన్ సీరియస్‌గా ఉంటుందని… సమాధానం కఠినంగా ఉంటుందని…. జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా పరిణామాలు ఉంటాయని కాలవ శ్రీనివాసులు డైరెక్ట్‌గా కాపు రామచంద్రారెడ్డిని హెచ్చరిస్తున్నారు..
కూటమికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య రాజుకున్న ఈ అగ్గి రాయదుర్గంలో ప్రతిపక్ష పార్టీ లోటుని తీరుస్తోందట… కూటమి అధికారంలోకి వచ్చాక రాయదుర్గంలో ప్రతిపక్ష వైసిపి నాయకులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు … ఆ క్రమంలో కాలవ, కాపుల మధ్య నడుస్తున్న వాగ్యుద్దం పొలిటికల్ హీట్ పెంచుతోంది. చూడాలి మరి ఇద్దరి మధ్య వైరం ఎక్కడికి దారితీస్తుందో.
Story By Ramireddy, Big Tv