EPAPER

CM Chandrababu Naidu: చంద్రబాబుపై కేసు.. ఆ సీఐకి వైసీపీ ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..

CM Chandrababu Naidu: చంద్రబాబుపై కేసు.. ఆ సీఐకి వైసీపీ ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..

Rayalaseema police officers Corruption: మొన్నటి సార్వత్రిక ఎన్నికలు పోలీసు అధికారులకు పంట పండించాయంట. ఏకంగా స్టేషన్ మామూళ్ల పేరుతో లక్షలాది రూపాయాలు వసూలు చేశారంట. అయితే ఎన్నికల తర్వాత అధికారం మారడంతో బలవంతంగా వసూల్లు చేసిన పోలీసు అధికారులు పోస్టింగుల కోసం ఇప్పుడు నానా పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య దగ్గర సైతం వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. రాయలసీమ వ్యాప్తంగా స్టేషన్‌కు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


ఎన్నికల సమయంలో బలవంతపు వసూళ్లతో రాయలసీమ పోలీసులు అత్యధికంగా లబ్ధి పొందారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అధికారులను జిల్లాలు మార్చారు. ఇందులో డీఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. అయితే చాలామంది వైసీపీ ప్రజా ప్రతినిధులు అప్పట్లో తమకు ఉపయోగ పడతారని కొందరు అధికారులను అడిగి మరి తమ సెగ్మెంట్లలో వేయించుకున్నారు. అది ఇప్పుడు వికటించిందని అంటున్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం బదిలీల సందర్భంగా అధికారుల లీలలు బయటపడుతున్నాయి.  సత్యసాయి జిల్లా అధికారుల లీలలు అయితే అంతా ఇంతా కాదు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురం సెగ్మెంట్ పరిధిలో అన్ని స్టేషన్లకు టీడీపీ నుంచి 10 లక్ష్లలు వైసీపీ నుంచి ఐదు లక్షలు తీసుకున్నారంట. ఓ సిఐ తన కింది స్థాయి సిబ్బందికి ఆ డబ్బుల్లో వాటా పంచకపోవడంతో వారే ఆ వివరాలు బయటపెడుతున్నారు. ఓ సిఐ అయితే ఎన్నికల బదీలీలలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత జూద కేంద్రాలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చారంట. ఏకంగా ఓక్కో క్లబ్ నిర్వాహకుడి నుంచి 10 నుంచి 20 లక్షలు వసూలు చేసి నడుపుకోవడానికి అనుమతులు ఇచ్చారంట. అయితే ప్రస్తుతం అదే అధికారిని అన్నమయ్య జిల్లాకు తీసుకురావడానికి జూద కేంద్రాల నిర్వాహకులు భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారంట.


సత్య సాయి జిల్లాలో ఓ మహిళ పోలీస్ అధికారి అయితే ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థిని 10లక్షలు డిమాండ్ చేసిందంట. ఆ అభ్యర్థి అముందుగా నాలుగు లక్షలు, తర్వాత మరో లక్ష ఇచ్చాడంట. అయితే పలితాల తర్వాత అదే మహిళ అధికారి డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వెళితే అయన తీసుకోకుండా.. అమ్మా దయచేసి మీరు సెలవు పెట్టి వెళ్ళమని చెప్పారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారి వద్ద నుంచి పాతిక లక్షల వరకు స్టేషన్ మాముళ్ల పేరుతో డబ్బులు తీసుకోన్నట్లు ప్రచారం జరుగుతుంది.

అనంతపురం జిల్లాలో సైతం ఇదే విధంగా ప్రతి స్టేషన్ అధికారులు 10-20 లక్షల వరకు తీసుకున్నారంట. ఇక కొంతమంది జిల్లా పోలీస్ బాస్ లు అయితే ఏకంగా పార్టీ పరంగా డబ్బులు పంపమని డిమాండ్ చేశారంట. తిరుపతి జిల్లాలో ఎన్నికల సమయంలో పనిచేసిన తాత్కాలిక బాస్ అయితే పెద్ద మొత్తంలో అదికార ప్రతిపక్ష పార్టీనుంచి వసూలు చేసాడని అంటున్నారు. ఎస్ సి రిజర్వుడు నియోజకవర్గాలలో సైతం ఐదు లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: నంద్యాలలోని ఓ స్కూల్‌లో పుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇదే తతంగం నడిచింది. గతంలో అన్నమయ్య జిల్లాలో పనిచేసిన సీఐ స్థాయి అధికారికి చంద్రబాబు మీద కేసులు పెట్టినందుకు అక్షరాలా కోటి రూపాయలు ముట్టాయని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అంగల్లు, పుంగనూరు, కుప్పం గొడవల కేసుపై సీనియర్ ఇంటలిజెన్స్ అధికారితో దర్యాప్తు జరుగుతుందంట. ఈ దర్యాప్తులో అన్నమయ్య , చిత్తూరు జిల్లా అధికారుల వ్యవహారం బయటకు వస్తుండటంతో అందరు నోరు వెల్లబెడుతున్నారంట. కానిస్టేబుల్ పై దాడి చేసింది కూడా తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలే అని వీడియో పుటేజ్ ద్వారా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.

చిత్తూరు నగరంలో పనిచేస్తున్న ఓ సిఐ వైసీపీకి అనుకూలంగా పనిచేసినప్పటికి టీడీపీ వారి దగ్గర డబ్బులు గుంజాలని చూశాడంట. అయితే ఇచ్చే ప్రసక్తే లేదని టీడీపీ వారు తెగేసి చెప్పారంట. దాంతో పోలింగ్ రోజు తన పరిధిలో టిడిపి వారిపై దాడులు జరిగిన ఆ సిఐ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విషయమై సదరు టీడీపీ ఎమ్మెల్యే సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  పలమనేరు, కుప్పం లో ఇదే పరిస్థితి.. ఇక జిడి నెల్లూరు మాజీ ప్రజా ప్రతినిధి మాముళ్లు ఇవ్వలేదని ఒక ఆట ఆడుకున్నారు. పోలింగ్ రోజు గొడవలు జరుగుతున్నాయని పోన్ చేస్తే నో రెస్పాన్స్ అని అయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారిప్పుడు.

కడప, కర్నూలు జిల్లాలలో అయితే సర్కిల్ స్టేషన్ కు 10లక్షలు, ఇండిపెండెంట్ స్టేషన్ కు ఐదు లక్షలు, డిఎస్పీ స్థాయి అధికారికి 25లక్షలు లెక్కన వసూలు చేసారంట. పులివెందుల పరిధిలో కూడా ఈ వ్యవహారం నడిచిందంట. 2019 లో ఈ ప్రలోభాల పర్వాన్ని వైసీపీనే ప్రారంభించిందని ..అంతకు మునుపు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చే వారని చెప్తున్నారు. అప్పట్లో పోలీసులను మచ్చిక చేసుకోవడానికి రాష్ట వ్యాప్తంగా వైసీపీ మామూళ్ల మొత్తం పెంచి మరీ పంచిందని. దానిని 2024లో సైతం అమలయిందని అంటున్నారు. తాజాగా పోస్టింగుల కోసం గత ఎన్నికలలో భారీగా సంపాదించిన వారంతా ఎమ్మెల్యేలుక వద్దకు పోయి మాకు ఫలానా స్టేషన్ ఇవ్వండి టోకున ఇంత ఇస్తామని ప్రపోజల్స్ పెడుతున్నారంట. అయితే ట్రాన్స్‌ఫర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో ఎమ్మెల్యేలు ఆ తతంగం జోలికి పోవడం లేదంటున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×