Food Poisoning in School at Nandyal(Local news andhra Pradesh): నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దీంతో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆహారం తిన్న విద్యార్థులకు వాంతులు చేసుకుని ఇబ్బంది పడ్డారు.
విషయం బయటకు రాకుండా విద్యాసంస్థ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. వైద్యులను ఘటన జరిగిన చోటకు తీసుకొచ్చి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్ అయిన విషయం కనీసం విద్యార్ధుల తల్లి దండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందించలేదు. ఎవరికి తెలియకుండ సీక్రెట్ గా పిల్లలకు ట్రీట్మెంట్ అందించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న విద్యార్ధులు తల్లి దండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇంత జరిగిన మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని స్కూల్ యాజమాన్యంపై తల్లి దండ్రులు మండి పడ్డారు. ఈ విద్యా సంస్థ వైసీపీకి చెందిన నాయకులదిగా గుర్తించారు.
Also Read: ఎస్సీ వర్గీకరణ వెనుక మాజీ సీఎంల కుట్ర ?
విద్యార్థులకు అస్వస్థత విషయం తెలుసుకున్న మంత్రి ఫరూక్ సీరియస్ అయిన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో, డిప్యూట డీఈఓ పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. వాంతులపై విచారణ చేపట్టిన్నట్లు డీఈవో చెప్పారు.