BigTV English

AP BJP: విష్ణుకుమార్‌రాజు మౌనం వెనుక కారణం అదేనా

AP BJP: విష్ణుకుమార్‌రాజు మౌనం వెనుక కారణం అదేనా

AP BJP: ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు.. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా పొత్తుల్లో భాగంగా రెండో సారి గెలుపొందారు. మనిషి ఎప్పుడు నెమ్మదిగా సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తారు.. నోరు తెరిస్తే చాలు తనలో ఉన్న ఫైర్ ఒక్కసారిగా బయటికి వచ్చి ఎదుటి వ్యక్తికి మాటలతోనే చమటలు పట్టిస్తారు.. అలాంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.. సీరియస్ గా మాట్లాడటం కంటే సన్యాసం బెటర్ అంటూ వైరాగ్యంగా మాట్లాడుతున్నారంట.. అధికారం చేతిలో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నామని తెగ ఇదై పోతున్నారంట.. ఇంతకీ వెటకారానికి పరాకాష్ట అయిన ఆయన మనసులో ఏముంది? ఎందుకు అధికారం కంటే సన్యాసమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు?


రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న బీజేపీ ఎమ్మె్ల్యే విష్ణుకుమార్‌రాజు

విశాఖపట్నం రాజకీయం రూటే సపరేటు.. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి.. అక్కడ రాజకీయాలు ఎలా ఉంటే నాయకులు ఇంకా ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.. రాజకీయాలకే రాజకీయాన్ని నేర్పే విశాఖ నార్త్ ఎమ్మెల్యే బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటరి అయిపోయినట్లు ఫీల్ అవుతున్నారంట ఇప్పుడు.. విశాఖ నార్త్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గత కొంతకాలంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. వేదిక ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనలో ఉన్న ఫైర్ ని పక్కన పెట్టేసి సైలెంట్‌గా గడిపేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా బ్రహ్మాండమైన ఎమ్మెల్యే పదవి చేతిలో ఉంది.. అధికారం ఉంది కాబట్టి నియోజకవర్గంతో పాటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పొచ్చు.. కానీ విష్ణుకుమార్ రాజు అసలు అధికారమే లేదు అన్నట్లు వైరాగ్యంతో మాట్లాడుతూ కాషాయ పార్టీలోనూ, కూటమి ప్రభుత్వంలో ఉండడం కంటే కాషాయం కట్టేసి సన్యాసిగా మారిపోవడం బెటర్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారంట.


కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వంలో బిజెపి కూడా భాగస్వామి.. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేసినట్లే 2024 ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి పోటీ చేయడంతో ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు బిజెపి ఎమ్మెల్యేలు.. 2014 ఎన్నికల్లో కూటమితో జట్టు కట్టిన సమయంలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలిచారు.. తర్వాత కూటమి నుండి చంద్రబాబు బయటికి వచ్చేయడంతో పదవి ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి .. 2019 ఎన్నికల్లో విష్ణుకుమార్ పొత్తులు లేకుండా బీజేపీ నుంచి పోటీ చేసినా విశాఖ నార్త్ నుంచి టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో పరాజయం పాలయ్యారు..

అధికారం ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి అనే ధోరణి

2024 ఎన్నికల్లో మళ్లీ కూటమితో జతకట్టడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు అధికారాన్ని నిలబెట్టుకున్నారు.. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి అధికారం ఉండి ఏమి లాభం పవర్ చూపించలేనప్పుడు.. అధికారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే ధోరణి విష్ణు కుమార్ రాజులో స్పష్టంగా కనిపిస్తుందంట.. 2019 ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు విశాఖ నార్త్ నియోజకవర్గం వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్న కేకే రాజు మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. నిన్న మొన్నటి వరకు కేకే రాజు విశాఖ నార్త్ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా మాత్రమే కొనసాగారు.. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆ పార్టీలో ప్రమోషన్ పొంది ఇంకో మెట్టు ఎక్కారు..

2019 ఎన్నికల తర్వాత దూకుడు పెంచిన కేకే రాజుని మళ్లీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చేయడంతో కట్టడి చేయాల్సింది పోయి, అధికార కూటమిలోని ఇతర నాయకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపోతున్నట్లు కనిపిస్తుంది.. కేకే రాజును కట్టడి చేయలేని ఈ పదవి అధికారం ఎందుకు? దీనికంటే కాషాయం తీసుకుని రాజకీయ సన్యాసం తీసుకోవడమే బెటర్ అనే ధోరణిలో బహిరంగ వేదికలపైనే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్నారంటే పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు.. వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు విశాఖ నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు తర్వాత భీమిలికి షిఫ్ట్ అయి విశాఖ నార్త్‌ను గాలికొదిలేశారు.. ఎమ్మెల్యేగా గెలవకపోలేయినా విశాఖ నార్త్ నియోజకవర్గం అనధికార ఎమ్మెల్యేగా కేకే రాజు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజా సమస్యలను చూస్తూ నియోజకవర్గంలో తన బలమైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు..

అప్పట్లో విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుని అడ్డుకున్న రాజు

కేకే రాజు ప్రస్తుతం అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజు వైసిపి అధికారంలో ఉన్న సమయంలోనే విశాఖ పర్యటనకు వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబును విశాఖ ఎయిర్పోర్టులో అడ్డుకున్నారు… ఆ ఆందోళనకు నాయకత్వం వహించింది విశాఖ నార్త్ వైసీపీ నాయకుడు కేకే రాజు.. అంతేకాదు 2022లో విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ ని సైతం వైసీపీ నాయకులు అడ్డుకున్నారు.. ఆ ఆందోళనకు ముందుండి నాయకత్వం వహించింది మళ్లీ కేకే రాజునే.. ఒక మాజీ ముఖ్యమంత్రిని మరో పార్టీ అధ్యక్షుడిని రెండుసార్లు విశాఖలో అడ్డుకుని అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ప్రమోషన్ తో దూసుకుపోతూ ముందుకు వెళ్తున్న కేకే రాజు మీద ఎందుకు కేసులు పెట్టి అరెస్టు చేయడం లేదని బహిరంగంగానే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.. రెండు పార్టీల అధినేతలను అడ్డుకున్న కేసులు ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెగ ఫీల్ అయిపోతున్నట్లు తెలుస్తుంది

కేకే రాజుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విష్ణుకుమార్

ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వేదికలపైన, పార్టీ వేదికల పైన విష్ణుకుమార్ రాజు ఓపెన్ అయిపోతూ కేకే రాజు మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రస్తుతం కూటమికి చెందిన ఇద్దరు అతిరథులకు గతంలో విశాఖ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టడానికి నాయకత్వం వహించిన కేకే రాజును అలా ఎందుకు వదిలేసారంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెగ మధన పడిపోతున్నట్లు తెలుస్తుంది.. ముఖ్యంగా వైసిపి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు ఇబ్బంది పడిన వారిలో ప్రస్తుత హోంమంత్రి అనిత కూడా ఉన్నారు… ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి ముగ్గురు కూడా అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అనుకుంటూ ఉంటే.. ఇంకా రాజకీయాల్లో అధికారం ఎందుకు అంటూ సన్నిహితులు దగ్గర విష్ణుకుమార్ రాజు వాపోతున్నారంట

విశాఖ నార్త్‌లో తనకు ఇబ్బందులు తప్పవని రాజు ఆందోళన

విశాఖ నార్త్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నప్పుడే అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను అడ్డుకున్న కేకే రాజు 2024 ఎన్నికల తర్వాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో కేకే రాజు పరపతి, దూకుడు పెరిగితే భవిష్యత్తులో విశాఖ నార్త్ నియోజకవర్గ నుండి ఆయనకు ఎదురు లేకుండా పోతుందని, అప్పుడు తనకు ఇబ్బందులు తప్పవని విష్ణుకుమార్ భావిస్తున్నారంట.. అంతుకే కూటమి భాగస్వామ్యపార్టీలు కేకే రాజును టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని డిమాండ్ చేస్తున్నారంట.. ముఖ్యంగా విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి తనకు ఎదురు లేకుండా చూసుకోవాలంటే రాజకీయంగా బలంగా ఉన్న వైసిపి నాయకుడు కేకే రాజుని కట్టడి చేస్తే తప్ప భవిష్యత్తు ఉండదని ఆయన భావిస్తున్నారంట..

కేకే రాజు అరెస్ట్‌ని టార్గెట్‌గా పెట్టుకున్న విష్ణుకుమార్ రాజు

ఇప్పటికే లిక్కర్ కేసు తో పాటు ఇతర కేసుల్లో వైసిపి నాయకులను అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్న కూటమి ప్రభుత్వం ఎందుకు కేకే రాజు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అని సన్నిహితుల దగ్గర విష్ణుకుమార్ రాజు అంటున్నట్లు సమాచారం.. కేకే రాజు మీద ఉన్న అసంతృప్తిని బాహాటంగానే బయటపెడుతున్న విష్ణుకుమార్ రాజు ఆయన్ని అరెస్టు చేసేంతవరకు ఊరుకునేలాగా లేరు అని లోకల్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.. కేకే రాజు విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాని.. అధికారం ఉండి ఏం ప్రయోజనం అధికారం కంటే కాషాయం కట్టి సన్యాసుల్లో కలిసిపోవడం బెటర్ అన్నట్లు విశాఖ నార్త్ బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భావిస్తున్నారంట.. మరి చూడాలి ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?

Story By Rami Reddy, Bigtv

Related News

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

YCP Vs TDP: పులివెందులలో కాక రేపుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు

AP News: జగన్ -పెద్దిరెడ్డి అవినావ బంధం

Big Stories

×