Soniya Akula : బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న లిస్ట్ లో సోనియా ఆకుల ఒకటి. ఈమె గురించి ఈ మధ్య ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొని మంచి క్రేజ్ నేను సంపాదించుకుంది. గతంలో ఈమె కొన్ని సినిమాలు చేసినా కూడా ఆమె పేరు చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత ఆమె అందరి నోట్లో నానుతుంది. హౌస్ లో ఆమె ఫైర్ ను చూసి ఖచ్చితంగా విన్నర్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ హౌస్ లో జరుగుతున్న గొడవలు కారణంగా జనాలు భరించలేక ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా పాపులర్ అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవలే సీమంతం కూడా చేసుకుంది. అయితే ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
గుడ్ న్యూస్ చెప్పిన సోనియా..
బిగ్ బాస్ ఫేమ్ సోనియా, యశ్‌వీర్ తో నవంబర్లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత వెంటనే డిసెంబర్లో ఇద్దరూ పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేశారు. అంతేకాదు వెకేషన్ లకు వెళుతూ అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తన సోషల్ మీడియా ద్వారా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది.. తల్లైన విషయాన్ని తెలియజేస్తూ వీడియో వదిలింది సోనియా ఆకుల.. అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా గ్రాండ్ గా సీమంతం చేసుకుంది.
యష్ గురించి బయటపెట్టిన సోనియా..
పెళ్లయిన వ్యక్తితో సోనియా ప్రేమాయణం నడిపిందని ఇప్పటికే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అతని పెళ్లి చేసుకోవడానికి ముందు మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అందుకని తెలిసిందే. పెళ్లి అయిన వ్యక్తిని చేసుకోవాల్సినంత కర్మ సోనియాకు ఏంటి అనే ప్రశ్నలు ఇప్పటికే సోషల్మీడియాలో మేము వినిపిస్తున్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో తన భర్త గురించి కొన్ని విషయాలను చెప్పింది. ఆయనకు ముందే పెళ్లై విడాకులు కూడా అయ్యిందని, ఒక బాబు కూడా ఉన్నాడని వెల్లడించింది. ఇక తన పెళ్లి విషయంలో ఆలస్యమంటూ కొన్ని రూమర్లు వచ్చాయి. దానిపైనా క్లారిటీ ఇచ్చింది. తన భర్త యష్ వాళ్ల చెల్లి, నాన్న ఇలా వరుసగా చనిపోవడం కారణంగా తమ పెళ్లి ఆలస్యం అయ్యిందని చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత అలా కుదిరింది పెళ్లయిందని చెప్పింది.
Also Read: ముందుగానే ఓటీటీలోకి రాబోతున్న హరిహర వీరమల్లు.. ఎప్పుడంటే..?
సోనియా సినిమాల విషయానికొస్తే..
సోనియా ఆకుల నటించిన తొలిచిత్రం జార్జి రెడ్డి. ఈ చిత్రం 2019లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మూవీలో ఆమె జార్జిరెడ్డి చెల్లెలు పాత్రలో నటించింది. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కరోనా వైరస్, ఆశా ఎన్ కౌంటర్ వంటి చిత్రాల్లో లీడ్ రోల్ లో నటించి మెప్పించింది..