BigTV English

Most-watched films on OTT : ఓటీటీలో చితగ్గొడుతున్న చిన్న సినిమాలు… జులైలో మోస్ట్ వాచ్డ్ ఫిల్మ్స్ ఇవే

Most-watched films on OTT : ఓటీటీలో చితగ్గొడుతున్న చిన్న సినిమాలు… జులైలో మోస్ట్ వాచ్డ్ ఫిల్మ్స్ ఇవే

Most-watched films on OTT : జులై 2025లో ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు సినిమా ప్రియులకు వినోద భరితమైన సినిమాలను అందించాయి. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా భారీ విజయాలు సాధించి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఓర్మాక్స్ మీడియా డేటా ప్రకారం, 2025 జులై నెలలో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన టాప్ 5 సినిమాలు ఇవే. సర్జమీన్, కుబేరా, రోంత్, ఆప్ జైసా కోయి, డీఎన్ఏ. ఈ సినిమాలు విభిన్న శైలులు, భాషలతో ఓటీటీలో సంచలనం సృష్టించాయి. వీటి వివరాలను తెలుసుకుందాం పదండి.


1. ‘సర్జమీన్’ (Sarzameen)

ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో 2025 జులై 25 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధానపాత్రల్లో నటించారు. కయోజ్ ఇరానీ దీనికి దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ సర్జమీన్ కశ్మీర్ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్, యాక్షన్ డ్రామా. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్ విజయ్ మీనన్‌గా నటించాడు. ఆయన భార్య మెహర్‌గా కాజోల్, వీళ్ల కొడుకు హర్మన్‌గా ఇబ్రహీం అలీ ఖాన్ కనిపిస్తారు. విజయ్ తన డ్యూటీలో ఉగ్రవాదులతో పోరాడుతూ, కొడుకు మిలిటెన్సీతో ముడిపడిన రహస్యమైన గతంతో వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటాడు. ఈ సినిమా డ్యూటీ, కుటుంబ బంధాలను ఎమోషనల్‌గా చూపిస్తుంది. ఈ సినిమా డైరెక్ట్‌గా జియోహాట్‌స్టార్‌లో విడుదలై, 4.5 మిలియన్ వ్యూస్ తో టాప్ స్థానం సాధించింది. పృథ్వీరాజ్, కాజోల్ నటన, కశ్మీర్ బ్యాక్‌డ్రాప్, ఇబ్రహీం డెబ్యూ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.


2. ‘కుబేరా’ (Kuberaa)

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 జులై 18 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ యాక్షన్ డ్రామాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.
ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ స్టోరీ తిరుపతిలో ఒక సామాన్య బిచ్చగాడి (ధనుష్) జీవితం చుట్టూ సాగుతుంది. అతను అనుకోకుండా ఒక భారీ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకుంటాడు. దీని వెనక ఒక మాజీ సీబీఐ ఆఫీసర్ (నాగార్జున), బిజినెస్ టైకూన్ (జిమ్ సర్భ్) ఉంటారు. బంగాళాఖాతంలో రహస్య ఆయిల్ రిజర్వ్‌తో సంబంధం ఉన్న ఈ కుట్రలో ధనుష్ ఎలా బయటపడతాడనేది కథ. రష్మిక మందన్న ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా జులైలో 3.7 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది.

3. ‘రోంత్’ (Ronth)

జియోహాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ పోలీస్ డ్రామా సినిమాకి షాహీ కబీర్ దర్శకత్వం వహించారు. ఇందులో రోషన్ మాథ్యూ, దిలీష్ పోతన్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ కేరళలోని ఒక చిన్న పట్టణంలో నైట్ పెట్రోల్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంది. రోషన్ మాథ్యూ కొత్తగా చేరిన కానిస్టేబుల్‌గా, దిలీష్ పోతన్ సీనియర్ ఆఫీసర్‌గా నటిస్తారు. రాత్రి పెట్రోలింగ్‌లో వీళ్లు కొన్ని ప్రమాదకర సంఘటనలు ఎదుర్కొంటారు. రియలిస్టిక్ పోర్ట్రయల్, బలమైన పెర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా 2.4 వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచింది.

4. ‘ఆప్ జైసా కోయి’ (Aap Jaisa Koi)

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ సినిమాకి కొలిన్ డి’కున్హా దర్శకత్వం వహించారు. ఇందులో ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో ఆర్. మాధవన్ ఒక సంస్కృత ప్రొఫెసర్ శ్రీరేణు త్రిపాఠిగా, ఫాతిమా సనా షేక్ ఒక ఫ్రెంచ్ టీచర్ గా నటించారు. వీళ్ల జీవితాలు అనుకోని రీతిలో కలుస్తాయి. ఆధునిక సమాజంలో ప్రేమ గురించి చర్చించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది 2.0 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ఒరిజినల్ డెబ్యూలలో చోటు సంపాదించింది.

5. ‘డీఎన్ఏ’ (DNA)

టెంట్‌కొట్టలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ థ్రిల్లర్ సినిమాకి నీలకంఠన్ దర్శకత్వం వహించారు. ఇందులో నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా డీఎన్ఏ ఆధారంగా సాగే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. నిమిషా సజయన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, సస్పెన్స్‌తో నిండిన కథాంశం ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా 1.3 మిలియన్ వ్యూస్ తో టాప్ 5లో చోటు సంపాదించింది.

Read Also : జనాలపైకి పిచ్చి కుక్కల్ని వదిలే ఆర్మీ… రెండేళ్ల తరువాత ఓటీటీలోకి కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్… స్పైన్ చిల్లింగ్ సీన్స్

Related News

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

Big Stories

×