BigTV English

YS Viveka Case: సాక్షులకు స్లో పాయిజన్.. వివేకా కేసులో కుట్ర కోణం!

YS Viveka Case: సాక్షులకు స్లో పాయిజన్.. వివేకా కేసులో కుట్ర కోణం!

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య జరిగి ఆరేళ్లయినా కేసులో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఎటూ తేలడం లేదు. నిందితులు బెయిల్ బై బయట తిరుగుతున్నారు. అప్రూవర్ గా మారినోళ్లు, సాక్ష్యం చెప్పిన వాళ్లే ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. పైగా అందరూ ఒకే తరహాలో అనారోగ్యానికి గురి కావడం.. ఆపై చనిపోవడం.. ఇప్పటిదాకా ఆరుగురు సాక్షులు ఇలాగే చనిపోయారు. స్లో పాయిజన్ చేస్తున్నారా? అందరివీ సహజ మరణాలేనా? వివేకా హత్య కేసు చుట్టూ అసలేం జరుగుతోంది? మిస్టరీ డెత్స్ వెనుకున్న వారెవరో సిట్ ఎంక్వైరీలో దొరుకుతారా?


మార్చి 14, 2019
పులివెందుల
వైఎస్ వివేకా నివాసం..

మార్చి 15వ తేదీ తెల్లారే సరికి వివేకా హత్యకు గురై కనిపించారు. మొదట గుండెపోటు అన్నారు. రక్తపు వాంతులుగా ప్రచారం చేశారు. బెడ్రూం, బాత్ రూమ్ లో రక్తపు ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. అయితే శరీరంపై గాయాలు బయటకు రాగానే హత్య అన్నది వెలుగులోకి వచ్చింది. వివేకా పీఏ వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందులలో క్రైం నెంబర్ 24/2019 గా కేసు నమోదైంది. అంతే అక్కడి నుంచి ఈ వివేకా హత్య కేసు ఎన్ని మలుపులు తిరగాలో అన్ని తిరిగింది. దర్యాప్తులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. సిట్ దర్యాప్తులు చేశాయి. అయినా లాభం లేకుండా పోయింది. వైఎస్ వివేకా హత్యకు గురై ఆరేళ్లు గడిచిపోయింది. అయినా సరే మ్యాటర్ కొలిక్కి రావడం లేదు.


ఒకే తరహాలో సాక్షుల మరణాలు

వివేకా హత్య కేసులో అసలు మ్యాటర్ ఏంటంటే.. అనుమాస్పద వ్యక్తులు, నిందితులు బెయిల్ పై బయట తిరుగుతున్నారు. సీబీఐ ముందు కీలక వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు మాత్రం వరుసగా చనిపోతున్నారు. ఇప్పటిదాకా ఆరుగురు సాక్షులు చనిపోయారు. పైకి అందరివీ అనారోగ్య కారణాలు, సహజ మరణాలే అని ప్రచారం జరుగుతున్నా.. అందరివీ ఒకే తరహాలో డెత్స్ ఉండడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. కీలక సాక్షులు ఇలా వరుసగా చనిపోతుండడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది. అసలు ఈ మిస్టరీ డెత్స్ వెనుకున్నదెవరు.. ఏం జరుగుతోందన్న విషయాలు నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసింది. 16 మందితో సిట్‌ను ఏర్పాటైంది. సీనియర్ డీఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి ఒక్కో కుటుంబం దగ్గరికి వెళ్లి వివరాలు రాబడుతున్నారు.

సూత్రధారులు, కుట్రదారులు ఎవరు?

వివేకా హత్య కేసు తేల్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో మూడు సిట్‌లు ఏర్పాటు చేసినా మ్యాటర్ ముందుకెళ్లలేదు. ఇది నాలుగో సిట్. వివేకా హత్య కేసు తేలకముందే.. అందులో సాక్ష్యం చెప్పిన వారికి మాత్రం నూకలు చెల్లుతున్నాయి. ఇది అన్నిటికంటే పెద్ద సవాల్ గా మారింది. ఇలా సాక్ష్యులందరూ అడ్రస్ లేకుండా పోతుండడం కలవరానికి కారణమవుతోంది. కేసులో సూత్రధారులు, కుట్రదారులను తేల్చకముందే మొత్తంగా భూస్థాపితం చేస్తారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. అసలు అవి సహజ మరణాలా లేక.. స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తున్నారా.. అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీ. దీన్ని తేల్చేందుకే సిట్ రంగంలోకి దిగింది.

వాచ్ మెన్ రంగయ్య మిస్టరీ డెత్

వివేకా హత్యకు గురైనప్పుడు ఆ ఇంట్లో వాచ్ మెన్ గా రంగయ్య పని చేశాడు. నిందుతుల్ని కళ్లారా చూసింది ఆయనే. సాక్షుల లిస్టులో కీలకంగా ఉన్న ఆయన కూడా ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. అయితే తమ తండ్రి మరణంపై డౌట్లు ఉన్నాయని ఆయన కొడుకు కంప్లైంట్ ఇవ్వగా.. దానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో సీబీఐ ఈ కేసులో దర్యాప్తు చేస్తూ.. రంగయ్య వాంగ్మూలాన్ని సేకరించింది. అప్పుడే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి హత్యలో పాల్గొన్నట్లు ప్రాథమికంగా తేల్చింది. వీరందరినీ అరెస్ట్ చేయగా దస్తగిరి నేరాన్ని అంగీకరించి అఫ్రూవర్‌గా మారాడు.

నిందితులు బాగానే ఉన్నా సాక్షుల్లోనే టెన్షన్

ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో అసలు కుట్రధారులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డితోపాటు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో వివేకా హత్య కేసు మరో లెవల్ కు వెళ్లినట్లయింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి చుట్టూ కూడా మ్యాటర్ హీటెక్కినా అరెస్ట్ దాకా వెళ్లలేదు. ప్రస్తుతానికి ఎర్రగంగిరెడ్డి మినహా మిగిలిన నిందితులంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. వాళ్లు బాగానే ఉన్నారు. సీబీఐకి సాక్ష్యం చెప్పిన వారు మాత్రం వరుసగా అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. మరోవైపు కేసు విచారణ సీబీఐ కోర్టులో త్వరగా ప్రారంభించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వివేకా కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టును ఇటీవలే ఆశ్రయించారు. అటు సాక్షుల మరణాలపై ఏర్పాటు చేసిన సిట్ ఎంక్వైరీలో ఏం తేలుతుందన్నది ఉత్కంఠగా మారింది.

వివేకా హత్య కేసు క్లైమాక్స్ కు చేరుతుందా?

వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలపై విస్తుపోయే వాస్తవాలు బయటికొస్తున్నాయా? నిజంగానే అనారోగ్యాలతో చనిపోయారా? ఏం జరిగింది? మృతుల కుటుంబ సభ్యులు సిట్ కు చెబుతున్నదేంటి? వాచ్ మెన్ రంగన్నకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారన్నది నిజమేనా? దర్యాప్తులో ఏం తేలుతోంది? వివేకా హత్య కేసు క్లైమాక్స్ కు చేరుతుందా?

ఎర్రగంగిరెడ్డిపై వాంగ్మూలమిచ్చిన రంగన్న

వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఈ కేసులో అందరికంటే కీలకమైన వ్యక్తి వాచ్ మెన్ రంగన్న. నిందితులను కళ్లారా చూసింది ఈయనే. పేర్లు చెప్పిందీ ఈయనే. వయసు 65. కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు. వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చాడు. అయితే రంగన్న అస్వస్థతకు గురయ్యారంటూ మొదట పులివెందుల హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. రంగన్న కాలికి గతేడాది గాయమైంది. పులివెందుల, కడప, తిరుపతి, హైదరాబాద్‌ దాకా తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇప్పించారు.

ట్రీట్మెంట్ పై డౌట్లు ఉన్నాయన్న రంగన్న కొడుకు

ఆ తర్వాతే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని రంగన్న కొడుకు అంటున్నారు. అప్పట్లో చికిత్స వివరాలు కోరినా పోలీసులు తమకు ఇవ్వలేదని, ఆ ట్రీట్మెంట్ పై అనుమానాలున్నాయంటూ రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపించారు. పోలీసులు కూడా ఇది మిస్టరీ డెత్ గా తేల్చి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రంగన్న మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించి 20 రకాల అవయవ భాగాలను సేకరించి నాలుగు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లకు పంపించారు. నివేదిక వచ్చేలోగా ఆయన మరణంపై ఉన్న అనుమానాలను క్లారిఫై చేసేందుకు టెక్నికల్ ఎంక్వైరీ నడుస్తోంది. స్లో పాయిజన్‌ ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా సిట్‌ దర్యాప్తు చేస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అవయవాల్లో ఏవైనా పాయిజన్ అవశేషాలు ఉన్నాయా అన్నది తేలుతుంది. అదే జరిగితే సాక్షుల వరుస మిస్టరీ డెత్స్ కు సమాధానం రావడం ఖాయమే అంటున్నారు.

2019 డిసెంబర్ 6న నారాయణ మృతి

ఇదే కేసులో మిస్టరీగా చనిపోయిన వారెవరో ఇప్పుడు చూద్దాం. ఈయన పేరు నారాయణ యాదవ్. మాజీ సీఎం జగన్ వెహికిల్ డ్రైవర్. వివేకా చనిపోయాడని తెలియగానే.. జగన్, భారతి ఇద్దరూ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలోనే పులివెందులకు వెళ్లారు. అప్పుడు వెహికిల్ డ్రైవ్ చేసింది నారాయణ యాదవే. ఈయన 2019 డిసెంబర్ 6న అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు ప్రచారం జరిగింది. రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అన్నది క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది. ఈయన మృతిపై కేసు నమోదు కాలేదు. అతడి అంత్యక్రియలకు జగన్, భారతి హాజరయ్యారు.

వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో గంగాధర్ రెడ్డి

ఇతని పేరు గంగాధర్ రెడ్డి. వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరు. ఈయన కూడా 2022 జూన్‌ 9న చనిపోయాడు. అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు.సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్‌ కోఆర్డినేట్స్‌ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే.. ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. హత్య కేసు మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని 2021 అక్టోబర్ 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చారు. కుట్రదారుల ఒత్తిడితోనే మాట మార్చారన్న డౌట్లను సీబీఐ వ్యక్తం చేసింది.

2019 సెప్టెంబర్ లో శ్రీనివాసుల రెడ్డి మిస్టరీ డెత్

ఈయన పేరు శ్రీనివాసుల రెడ్డి. 2019 సెప్టెంబరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపుగుళికలు సేవించి, ఆయన సూసైడ్ చేసుకున్నారన్నారు. వివేకా హత్య కేసులో శ్రీనివాసుల రెడ్డి అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి. పరమేశ్వరరెడ్డి నార్కో ఎనాలసిస్‌ టెస్ట్ కు హాజరై తిరిగొచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసులరెడ్డి మరణించారు. ఈయన డెడ్ బాడీలో కాలేయానికి, కిడ్నీ మధ్య భాగం లో రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ రిపోర్ట్ తేల్చింది. పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. ఇది కూడా పెద్ద డౌట్. తాజాగా సిట్ డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి కుటుంబసభ్యుల్ని ప్రశ్నించారు. మరణంపై వివరాలు తెలుసుకున్నారు.

వివేకాది హత్యే అని 2021లో సీబీఐకి అభిషేక్ వాంగ్మూలం

ఈయన పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి. వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర రెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. మృతదేహం చుట్టూ రక్తం, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్నాళ్ల తర్వాత సడెన్ గా అనారోగ్యం బారిన పడ్డారని, ఈ ఏడాది జనవరి 10న చికిత్స పొందుతూ చనిపోవడం కూడా అనేక డౌట్లకు తెరలేపింది. ఈయన వయసు 36. అటు జగన్ మామ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు. వివేకా డెడ్ బాడీకి గంగిరెడ్డి హాస్పిటల్ సిబ్బందే కట్లు కట్టి, బ్యాండేజీలు వేశారన్న వెర్షన్ ఉంది. సో ఈ కేసు మొదటి నుంచీ అంతా టిపికల్ గా మారుతోంది.

వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్ కు ప్రాణహాని

ఇంకోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి లైఫ్ డేంజర్ జోన్ లో ఉందా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. తన ఇంటి వద్ద పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ అంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు.

సెక్యూరిటీ కల్పించాలని ఎస్పీని కోరిన సునీల్ యాదవ్

సో వివేకా హత్య కేసు ఒక్క అడుగు ముందుకు పడకపోయినా… చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఆయన కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. అటు సాక్షులు వరుసగా చనిపోవడం ఇంకెన్నో అనుమానాలను తెరపైకి తెస్తోంది.

 

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×