SLBC Tunnel Update: SLBC టన్నెల్లో మరో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపట్టాయి. శిథిలాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకు డెడ్‌బాడీని బయటకు తీసే ఛాన్స్ ఉంది.
SLBC సహాయక చర్యలు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సూచించారు. సహాయక చర్యల పురోగతి పై ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. నిపుణుల కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఆదేశానుసారం.. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని అన్నారు మంత్రి పొంగులేటి. మాన్యువల్ గా టన్నెల్‌ని తవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారాయన. వెలిగొండ తరహాలో ఈ తవ్వకాలు సాగిస్తామని చెప్పారు. ప్రమాద స్థలం నుంచి 510 మీటర్ల వరకూ ఎత్తు ఉన్నట్టు చెప్పారు మంత్రి పొంగులేటి. ఇప్పటి వరకూ టన్నెల్ తవ్వకాలు 41. 6 మీటర్లు తవ్వగా.. ఇంకా తొమ్మిదిన్నర మీటర్లు తవ్వాలని అన్నారు మంత్రి పొంగులేటి.
కాగా గత కొద్దిరోజుల క్రితంSLBC టన్నెల్లో మానవ అవశేషాలను గుర్తించాయి. కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్ మనుషుల ఆనవాళ్లు పసిగట్టాయి. డాగ్ స్క్వాడ్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్ మృతదేహం లభ్యమైంది. ఫిబ్రవరి 22 నుండి సాగుతున్న అన్వేషణలో భాగంగా ఇన్ని రోజుల తర్వాత మరో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో టన్నెల్లో మరింత లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌కు టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు అడ్డంకిగా ఉన్నాయి. టీబీఎం మిషన్ భాగాలు కట్ చేసి లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. టన్నెల్ ఎండ్ పాయింట్లు రెండు స్పాట్లు గుర్తించి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు.
Also Read: నేను అంతే.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
అక్కడ టన్నెల్లో మినీ జేసీబీలతో శిథలాలు తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని రెండు స్పాట్స్ కీలకంగా మారాయి. ఈ రెండు ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేస్తుండగా విపరీతమైన దుర్వాసన వస్తున్నట్లు తెలుపుతున్నారు. కేరళ నుంచి వచ్చిన రెండు కేడావర్ డాగ్స్ ఇదే స్పాట్స్‌ను గుర్తించాయి. అయితే ఈ రెండు స్పాట్స్‌లో తవ్వకాలు కఠినంగా మారాయి.
టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో పూర్తిగా బురద నిండిపోయింది. టీబీఎన్ మిషన్ ముందు, వెనుక భాగం శకలల తొలగింపు వేగంగా సాగుతోంది. ఇందుకోసం రెండు మినీ ప్రొక్లేర్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా SLBC టన్నెల్‌లో మరో మృతదేహాన్ని గుర్తించారు. శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపట్టాయి. ఇవాళ మధ్యాహ్నాం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.