Intinti Ramayanam Today Episode March 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని వదిన చెప్పిన నువ్వు ఒప్పించాల్సిన అవసరం లేదు నేను మేజర్ ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకొనే హక్కు నాకుంది. అని ప్రణతి. నన్ను బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం నేను తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని ప్రణతి అంటుంది. నా ఇష్ట ప్రకారం నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇందులో మీరు ఎవరు జోక్యం చేసుకోవాల్సిన విషయం లేదు నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోతుంది బయట అవని చూసి నన్ను క్షమించు వదిన మీ మాట కాదని నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అంటుంటే బాధగా అనిపించింది అందుకే వచ్చానని ప్రణతి అంటుంది. ప్రణతి మాటలు విన్న ఇంట్ల వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్రణతి మాటలు విన్న అవని నువ్వు అనుకున్నది సాధిస్తావు అని అంటుంది..భానుమతిని కమల్ ఓ ఆట ఆడుకుంటాడు. ఆఫీస్ లో తన కూతురు బర్త్డే సందర్భంగా అందరికీ బోనసులు ఇస్తాడు అక్షయ్. అటు అవని కూడా తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా స్వీట్లు పంచుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే..ఇంట్లోనే వాళ్ళందరూ ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేయాలని రకరకాల ప్లాన్లు వేస్తారు. అక్షయ్ ఈ కూడా వృద్ధాశ్రమానికి డబ్బులు ఇవ్వడం అలాగే స్టాఫ్ అందరికీ బోనస్ ఇవ్వడం చూసి అందరూ మెచ్చుకుంటారు. అటు అవని తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా నేను ఎన్నో చేసేదాన్ని అని బాధపడుతూ ఉంటుంది. అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూనే ఉండేది.. నా కూతురు నాకోసం ఎంతగానో బాధపడుతుంది. దానికి స్వరాజ్యం నీ కూతురు దగ్గరికి నువ్వు వెళ్లడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి నీకు తోడుగా నేను వస్తాను నువ్వు వెళ్లి నీ కూతుర్ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి రా అనేసి అంటుంది. ఇక ఇంట్లో అందరూ ఆరాధ్యకి ఒకేసారి విషయాలని బర్త్డే గిఫ్ట్లు అన్ని పట్టుకొని ఆరాధ్య రూమ్ కి వెళ్తారు కానీ అక్కడ ఆరాధ్య లేకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ వెతుకుతారు అవనీనే ఆరాధ్యను తీసుకుపోయి ఉంటుందని పల్లవి అంటుంది. ఇక ఆరాధ్య కోసం అందరూ వెతుకుతుంటారు..
బావగారు అవని అక్కే ఆరాధ్యును ఇంటికి వచ్చి దొంగతనంగా తీసుకెళ్లిపోయిందని పల్లవి అంటుంది మీకు అంతగా డౌట్ ఉంటే అక్క దగ్గరికి వెళ్లి మీరు ఒకసారి చూడండి ఆరాధ్య అక్కడే ఉంటుంది అని పల్లవి అంటుంది పల్లవి మాట విన్న అక్షయ్ అవని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆరాధ్య ఉండటం చూసి షాక్ అవుతాడు.. ఇంటికొచ్చి ఆరాధ్యను ఇలా దొంగతనంగా తీసుకురావడం మంచి పద్ధతేనా నువ్వు ఎందుకు ఇలా చేశావని అరుస్తాడు.
ఆరాధ్యను వదిన ఏమి తీసుకురాలేదు నేనే తీసుకొని వచ్చాను అని కమలంటాడు నువ్వెందుకు తీసుకొచ్చావు రా అని అక్షయ్ అడిగితే మీరిద్దరూ గొడవపడ్డారు ఇంట్లో గొడవలు ఉన్నాయి ఆరాధ్యకు అమ్మని ఎందుకు దూరం చేస్తారు అని అంటాడు. ఇంకా కమల్ ఆరాధ్యకు అమ్మను కూడా మన ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పాలి నాన్న అడిగితే అని అంటాడు. అక్షయ్ ఆరాధ్యను ఇక ఇంటికి వెళ్దాం రా అంటే అమ్మ కూడా ఇంటికి వస్తేనే నేను బర్తడే జరుపుకుంటాను లేకపోతే జరుపుకోనని ఆరాధ్య అంటుంది.
ఇక అక్షయ్ ఛేసేదేమీ లేక అవనీని కూడా ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. అవని ఇంటికి రాగానే అందరు షాక్ అవుతారు పార్వతి మాత్రం నీ భార్యని ఎందుకు తీసుకొచ్చావు రా ఇది చేసిన మోసాల గురించి మీ చెల్లి చేసిన అన్యాయం గురించి నువ్వు మర్చిపోయావా అని అడుగుతుంది ఆరోగ్య బర్త్డే కదమ్మా ఈరోజు ఏం గొడవలు వద్దు తన కోరిక ప్రకారం తీసుకొని వచ్చాను వేరే ఉద్దేశం లేదు అని అంటాడు. అటు పల్లవి అవనిని ఎలాగైనా ఇంట్లోంచి పంపించాలని మాస్టర్ ప్లాన్ వేసి భానుమతి ఇద్దరు కలిసి అవని బ్యాగులో నక్లెస్ పెడతారు. నీ కమ్మలు చూసి భానుమతి కొంగుకు కడతాడు.
నా నెక్లెస్ కనిపించలేదు ఈ బ్యాగ్ లోనే ఉన్నట్టు ఉందని భానుమతి అనగానే కమల్ భానుమతికి బుద్ధి వచ్చేలాగా ఆ నెక్లెస్ ని ఆమె కొంగుకే ఉన్నట్లు చెప్తాడు. మొత్తానికి ఆరాధ్య బర్తడే వేడుకలు గ్రాండ్గా జరుగుతాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రామరాజు వేదవతి భానుమతి గుడికి వస్తారు అదే గుడికి రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ కూడా వస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..