E-Paper
Advertisement

Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఓకేసారి 120 మంది భక్తులు..!

Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఓకేసారి 120 మంది భక్తులు..!
Advertisement

Puri Rath Yatra: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాల్లో విషాదం జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ రథోత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలు మూడు భారీ రథాలపై ఊరేగుతూ తమ పిన్ని ఇల్లైన శ్రీగుండిచా ఆలయానికి వెళ్లడం సంప్రదాయం. ఆ స్వామివారి రథం తాడును ఒక్కసారైనా తాకితే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ జనసంద్రంగా మారాయి.

120 మందికి పైగా భక్తులు..

రథయాత్ర సాగుతుండగా, శ్రీగుండిచా ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో భారీ తోపులాట, తొక్కిసలాట జరిగాయి. జనం కిక్కిరిసిపోవడంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఇందులో 120 మందికి పైగా భక్తులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ప్రశాంతంగా సాగుతున్న ఉత్సవంలో ఒక్కసారిగా గందరగోళం, భయాందోళనలు రేగాయి.

Advertisement

Also read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!

గ్రీన్ ఛానల్ ద్వారా..

పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే స్పందించి గ్రీన్ ఛానల్ ద్వారా స్పృహ తప్పిన భక్తులందరినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత పూరీలో అధికారులు భద్రతను పెంచారు.

Advertisement

Storey By: Anup Big Tv

Also read: Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!

Related News

Madhapur Murder: మాదాపూర్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. లొకేషన్ పంపి మరీ ప్రియుడిని లేపేసిన..?

Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!

Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!

ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ? చట్టాల కళ్లుగప్పి కాలర్ ఎగరేస్తున్న కామాంధులు

పిఠాపురంలో వరుస హత్యల కలకలం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగింది?

మండే ఎండల్లోనూ కుంకుమ పువ్వు సాగు.. తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం

ఒక షాపుతో మొదలైన కథ.. అబిడ్స్ గా ఎలా మారింది?

Big Stories

Advertisement
×