BigTV English

AP Politics: బాబుకు చెక్ .. సొంత పార్టీ నేతలే !

AP Politics: బాబుకు చెక్ .. సొంత పార్టీ నేతలే !

AP Politics: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో గెలవడంతో చాలా పెద్ద చర్చ నడిచింది. రాజధాని సెగ్మెంట్లో ఆ పార్టీ గెలవడం పెద్ద సంచలనమే అయింది . అయితే ఆ నియోజకవర్గంలో గెలుపుని ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. అక్కడ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడం తర్వాత మార్చిన ఇన్చార్జులని సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్కడ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది. దానికి తోడు మూడు రాజధానుల నినాదం ఆ పార్టీని పూర్తిగా ముంచింది. దాంతో 2024 ఎన్నికల్లో నామమాత్రపు పోరే జరిగి టీడీపీ తిరిగి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. పరిస్థితులు అలా తయారైన అక్కడ వైసీపీ పరిస్థితి మాత్రం మారడంలేదు. ప్రస్తుతం జగన్ నియమించిన ఇన్చార్జిని కార్యకర్తలు మాకొద్దు మాకొద్దు అంటున్నారంట. అసలక్కడ ఏం జరుగుతుంది?


రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్న తాడికొండ సెగ్మెంట్

ఏపీ రాజధాని అమరావతిలో అంతర్భాగమైన నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ.. తాడికొండ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఏపీ రాజధానిలో అత్యంత కీలకంగా ఉన్నాయి. ఆ సెగ్మెంట్లోనే అసెంబ్లీ, సచివాలయం తదితర కీలక నిర్మాణాలు జరగడంతో అది అమరావతి రాజధానికి ఆయువు పట్టుగా మారింది.. ఈ నియోజకవర్గంలో వైసీపీ గత ఐదు సంవత్సరాలలో అత్యంత కీలకమైనపరిస్థితులను ఎదుర్కొంది. 2019లో అనూహ్యంగా తాడికొండ నియోజకవర్గం లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి గెలిచారు..


నందిగం సురేష్‌తో ఉండవల్లి శ్రీదేవికి విభేదాలు

ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి వైసీపీలో అనేకసార్లు విభేదాలు చోటు చేసుకున్నాయి.. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌తో ఆధిపత్యపోతరు నడిచింది. ఆ సమయంలో అనేక వివాదాలు రచ్చకెక్కాయి. ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఉండవల్లి శ్రీదేవికి అత్యంత సమీపంగా ఉన్న నేతలే ఆమె పైన విమర్శలు చేయడం పెద్ద చర్చకే దారి తీసింది.

తాడికొండ ఇన్చార్జ్‌గా కత్తెర సురేష్‌ను నియమించిన జగన్

ఆ క్రమంలో ఉండవల్లి శ్రీదేవి పార్టీ దూరమయ్యే పరిస్థితి తలెత్తడంతో.. ఆమె స్థానంలో కత్తెర సురేష్‌కి జగన్ తాడికొండ వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే సురేశ్ నియామకం మున్నాళ్ల మురిపమే అయింది. ఆ తర్వాత అప్పట్లో ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం ఇచ్చారు . అయితే ఆయనకు కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో డొక్కా ఎన్నికల ముందు వైసీపీని వీడారు.

తాడికొండలో ఘోర పరాజయం పాలైన వైసీపీ

తర్వాత మాజీ మంత్రి, అప్పటి ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకతోటి సుచరితని ఇన్చార్జిగా నియమించి ఆమెని ఎన్నికల బరిలో నిలిపారు. ఆ మార్పులు చేర్పులు, మూడు రాజధానుల నినాదం ఇలా అన్నీ కలగలిపి తాడికొండలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఓటమి తర్వాత ఒక సమయంలో అసలు తాడికొండ నియోజకవర్గానికి ఇన్చార్జి ఉన్నారా లేదా అనే పరిస్థితి వైసీపీలో కొనసాగింది.

వజ్రంబాబుని తాడికొండ ఇన్చార్జిగా నియమించిన జగన్

దీంతో వైసిపి కేడర్ అంతా అయోమయంలో పడటంతో అధిష్టానం తాడికొండ నియోజకవర్గంలో మార్పు కోసం నూతనంగా వజ్రం బాబుని తాడికొండ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించింది.. తాడికొండ ఇన్చార్జిగా వజ్రం బాబు మొదటిరోజు వెళ్లిన సమయంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో తాడికొండ నియోజకవర్గంలో మళ్లీ వైసిపి చిగురిస్తుందేమోనని అందరు అనుకున్నారు.. కానీ వజ్రం బాబు తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంభిస్తున్న ఒంటెద్దు పోకడలు ప్రస్తుతం కేడర్ని అయోమయంలో పడేస్తున్నాయంట. దాంతో వజ్రం బాబు తమ వద్దంటే వద్దంటూ వైసీపీకి ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్న నియోజకవర్గం లోని కార్యకర్తలు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి డిమాండ్లు మొదలుపెట్టారు

వజ్రంబాబుకి వ్యతిరేకంగా మీడియా ముందుకొస్తున్న వైసీపీ శ్రేణులు

మొత్తమ్మీద మరోసారి తాడికొండ నియోజకవర్గం వైసీపీలో మరోసారి రచ్చకెక్కింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వటం, వారికి పార్టీ అవకాశాలు ఇవ్వటం తమను నిరాశపరుస్తున్నాయంటున్నారు స్థానిక నాయకులు. వజ్రం బాబు తాడికొండ నియోజకవర్గంలో వైసీసీ క్యాడర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.. వజ్రం బాబు వచ్చి పట్టుమని ఆరు నెలలు కూడా కాకుండానే ఆయనకుపార్టీ నేతలు, కార్యకర్తలే బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రస్తుతం మరోసారి తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడింది అనే విధంగా చర్చ నడుస్తుంది..

Also Read: టీడీపీకి తలనొప్పిగా అన్నమయ్య జిల్లా?

డైమండ్ బాబుకి ఎర్త్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా?

తాడికొండ నియోజకవర్గంలో ఈ విభేదాలు ఈ రోజువి కాదు. ఏళ్ల తరబడి ఈ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఇన్చార్జిగా ఎవరు వచ్చినా ఓ వర్గం నేతలు వ్యతిరేకించడం పరిపాటిగా మారింది. అప్పటి ఎంపీ నందిగామ సురేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీలో నుంచి వెళ్లిపోయేలా చేశారు. ఇప్పుడు డైమండ్ బాబుపై పార్టీలో రాజకీయం మొదలైంది. నిజంగా డైమండ్ బాబు వైఖరితో క్యాడర్‌లో వ్యతిరేకత పెరిగిందా, లేకపోతే మరో వర్గం నేతలే కావాలని డైమండ్ బాబుకి ఎర్త్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×