BigTV English
Advertisement

Sukumar : పుష్ప2 తర్వాత… RC17కి ముందు.. సుక్కు ఏం చేస్తున్నాడంటే..?

Sukumar : పుష్ప2 తర్వాత… RC17కి ముందు.. సుక్కు ఏం చేస్తున్నాడంటే..?

Sukumar : సుక్కు… సుకుమార్ గురించి, ఆయన కెపాసిటి గురించి ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచే కాదు… అప్పుడెప్పుడో వచ్చిన ‘రంగస్థలం’ నుంచే అందరికీ తెలుసు. సరిగ్గా లెక్క వేసి.. సినిమా చేస్తే ఈ లెక్కాల మాస్టర్‌కు తిరుగు ఉండదు అని అప్పట్లోనే సినీ క్రిటిక్స్ అంచనా వేశారు.


పుష్ప 2 మూవీతో 1800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి… ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీకి డైరెక్టర్‌గా సుక్కు నిలబడిన తర్వాత… ఆయన చేసే సినిమా గురించి అందరికీ తెలుసు. రామ్ చరణ్‌తో RC 17 చేయబోతున్నాడు. అయితే దీనికి ముందు RC 16 ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దీనికి డైరెక్టర్. ఆ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ ‘పెద్ది’ సినిమా అయ్యేంత వరకు సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పట్టాలెక్కడం కష్టమే. అయితేే ఈ గ్యాప్‌లో సుకుమార్ ఏం చేస్తున్నాడో తెలుసా..?


ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం… ఈ గ్యాప్‌లో యే ఒక్క క్షణాన్ని కూడా వదులుకోవడం లేదట. ప్రతి సెకండ్ ఆయన శిష్యుల కోసం కేటాయిస్తున్నాడట. సుక్కుకు ఆయన శిష్యులు అంటే ఎంత ఇష్టంతో అందరికీ తెలుసు.

ఆయన చేయాల్సిన హీరోను కూడా శిష్యుడి కోసం త్యాగం చేసేంత ఇష్టం. నిజానికి పుష్ప 2 తర్వాత సుక్కు మూవీ రామ్ చరణ్ తో ఉండాల్సింది. RC 16 గా సుకుమార్ – రామ్ చరణ్ మూవీ పట్టాలెక్కాల్సింది. కానీ, ఆయనకు శిష్యులపై ఉన్న మమకారంతో RC 16 కి డైరెక్టర్ శిష్యుడు బుచ్చిబాబు అయ్యాడు.

ఇప్పటి వరకు దాదాపు 6 గురు శిష్యులను డైరెక్టర్లుగా పరిచయం చేశాడు. వారిపై పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ముందుకు రాకపోవడంతో… ఆయనే ‘సుకుమార్ రైటింగ్స్’ అనే సంస్థను స్టార్ట్ చేసి శిష్యుల కోసం నిర్మాతగా కూడా మారాడు.

ఇదంతా పక్కన పెడితే… పుష్ప 2 కి RC 17 మధ్య ఉన్న ఈ టైంని పూర్తిగా శిష్యుల కోసం వినియోగిస్తున్నాడట. తన శిష్యులను మరింత మందిని డైరెక్టర్లుగా మార్చడానికి కష్టపడుతున్నాడట. పుష్ప 2 తర్వాత నుంచి ఇప్పటి వరకు తన శిష్యుల నుంచి దాదాపుగా 100కు పైగా స్టోరీలోను విన్నాడట.

వినడం ఒక్కటే కాదు… సెట్ అయ్యే కథలకు మార్పులు చేర్పులు చేస్తూ ఆయా కథలకు హీరో, హీరోయిన్‌లను సెట్ చేసే పని కూడా సుక్కునే పెట్టుకున్నాడట. ఖాలీ సమయంలో కూడా ఇలా… క్షణం తీరక లేకుండా… శిష్యుల కోసం కష్టపడుతున్న సుక్కును చూసి ఇండస్ట్రీ జనాలు వారెవ్వా అని అంటున్నారు.

అతి త్వరలోనే… ఆయన శిష్యు బృందం నుంచి మరొకరు డైరెక్టర్ గా మారబోతున్నారని సమాచారం. అదే నిజమైతే… ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల నుంచి వచ్చిన డైరెక్టర్ల సంఖ్య పెరుగుతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×