Big Stories

TDP Delay On Darsi Candidate: దర్శి టికెట్‌.. దర్శించేది ఎవరినో..?

TDP Confusion on Darsi Candidate
TDP Confusion on Darsi Candidate

TDP Confusion on Darsi Candidate: పొత్తుల లెక్కల్లో దర్శి నియోజకవర్గంపై ఇంకా పీటమూడి వీడలేదు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినా అక్కడ అభ్యర్ధి ఎవరు? ఏ పార్టీ నుంచి పోటీ చెస్తారు? అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. దాంతో దర్శి టీడీపీ శ్రేణులు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. క్యాండెంట్ విషయంలో ఈ రోజు రేపు అంటూ టైం వెస్ట్ చెస్తున్నరని ఫైర్ అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా స్థానికంగా టీడీపీ పట్టు కోల్పేదని చాటుకున్నామని, అయినా పొత్తుల లెక్కలతో కేండెట్‌పై ఈ జాప్యం ఏంటని మండిపడుతున్నాయి.

- Advertisement -

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం.. కుప్పం లాంటి మున్సిపాలిటిలో టీడీపీ ఓడిపోయినా దర్శి మున్సిపాల్టీలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా దర్శిలో పార్టీ పట్టుకోల్పేదని నిరూపించారు అక్కడి తెలుగుతమ్ముళ్లు అలాంటి నియోజకవర్గంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడి రోజులు గడిచిపోతున్న టీడీపీ ఇప్పటి వరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో అభ్యర్ధులను ప్రకటించిన చంద్రబాబు, అయిదు సీట్లను మాత్రం పెండింగ్లో పెట్టారు. వాటిలో దర్శి ఒకటి

- Advertisement -

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 నియెజకవర్గలలో 11 స్థానాలలో టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. టీడీపీకి పటిష్టమైన క్యాడర్ ఉన్న దర్శిలో ఇప్పుడు క్యాండెంట్‌ను వెతుకుతున్నామంటోంది అధిష్టానం. కూటమి లో భాగంగా ఇప్పుడు దర్శి టికేట్ ఏ పార్టీకి కేటాయస్తారన్న కన్‌ఫ్యూజన్ కూడా కనిపిస్తోంది. ఇటీవలి వరకూ దర్శి సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా అక్కడ బలమైన కేండెట్ కోసం వెతుకుతున్నట్లు టీడీపీ సంకేతాలు ఇచ్చిందంట.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి గాడిలోకి వచ్చిన నియోజకవర్గాల్లో దర్శి ఒకటి. గత రెండు ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కదిరి బాబురావు, శిద్దా రాఘవరావులు పార్టీని వీడినా కేడర్ మాత్రం చెక్కుచెదరలేదు. దర్శి టీడీపీకి ఇంచార్జ్‌గా వచ్చిన పమిడి రమేష్ నియోజకవర్గంలో భాద్యతలు స్వీకరించిన అనంతరం పార్టీకి ఊపు పెరిగింది. రాష్ట్రంలో దాదాపు అన్నీ మున్సిపాలిటీల్లో టీడీపీ దారుణంగా ఓడినా దర్శి మునిసిపాలిటీని మాత్రం గెలిచింది.

ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపధ్యంలో ఇంచార్జ్ పదవికి పమిడి రమేష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ దర్శికి ఇన్చార్జిని నియమించలేదు. దర్శి టికెట్ కోసం ఎంతమంది నేతలు సంప్రదించినా ఆ సీటును జనసేన కోసం రిజర్వ్ చేశాం, వాళ్లకు కాని పక్షంలో అప్పటి పరిణామాలను బట్టి డిసైడ్ చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.

2009లో ప్రజారాజ్యం పార్టీకి దర్శి నియోజకవర్గంలో 27 వేల ఓట్లు దక్కాయి. దీంతో ఆ ఓటు బ్యాంకు మొత్తం జనసేనకు కన్వర్ట్ అవుతుందన్న ఆశలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఆ లెక్కలతోనే దర్శి నుండి జనసేన, టీడీపీ అలయెన్స్ తరఫున పోటీ చేసేందుకు ఇటీవల జనసేనలో చేరిన ఎన్నారై గరికపాటి వెంకట్ రంగం సిద్దం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన దర్శి సీటుపై కన్నేశారు. గరికపాటి వెంకట్ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరినా, ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంతో ఆయన సలహాతోనే ఇదంతా జరిగిందని ఆయన వర్గీయులే నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్నారు.

అయితే పొత్తులో భాగంగా తమ పార్టీకి ఇచ్చిన 24 సీట్లలో జనసేన మూడు సీట్లను బీజేపీకి కేటాయించటంతో దర్శి సీటును ఆ పార్టీకి దక్కకుండా పోయిందంట. దీంతో జనసేనలో చేరిన ఎన్నారై గరికపాటి వెంకట్ తనకు సీటు ఇస్తే తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేతకు చెప్పటంతో ఆయన పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. అయితే రిపోర్టులు వెంకట్‌కు నెగిటివ్‌గా వచ్చాయంట. ఆయనతో పాటు ఇటీవలే దర్శి టీడీపీ ఇన్చార్జిగా ప్రకటించిన గోర్లంట రవికుమార్ పేరుతో కూడా టీడీపీ ఓ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. ఆయనకు కూడా సరైన మార్కులు పడకపోవడంతో పక్కన పెట్టారంట.

ఈ నేపధ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అద్దంకి వైసీపీ మాజీ ఇన్జార్జ్ బాచిన కృష్ణచైతన్య దర్శి నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారంట. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య గతంలో ప్రకాశం జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆ పరిచాయాలతో కృష్ణచైతన్య ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న పలువురు టీడీపీ నేతలతో ఆయన టచ్‌లోకి వెళ్లి తమ అభ్యర్దిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట..

మరోవైపు దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారంట .. ఆయనకు జనసేన వేరే చోట అవకాశం కల్పిస్తామంటున్నా, దర్శి సీటు కన్ఫామ్ చేస్తే తాము టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని పార్టీ అధినేతకు రాయబారం పంపారని చెప్పుకుంటున్నారు. వీరందరితో పాటు తాజాగా మాజీమంత్రి శిద్దా రాఘవరావు కూడా తిరిగి సొంత గూటికి వచ్చే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం దర్శి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది.

Also Read: AP Elections 2024: ఏపీ అసెంబ్లీ బరిలో 8 మంది మాజీ సీఎంల వారసులు.. ఎవరెవరంటే..?

ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్దిగా బరిలో ఉన్నారు.. మాగుంట ఎలాగైనా శిద్దా రాఘవరావును వైసీపీ నుండి టీడీపీ లోకి తీసుకువచ్చి దర్శి నుంచి పోటీలో ఉంచాలని పట్టుబడుతున్నారట. ఆయనైతే పార్టీకి గట్టి అభ్యర్ది కావటంతో పాటు తమ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో వైశ్య సామాజిక వర్గానికి ఓ సీటు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారట.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీమంత్రి శిద్దారాఘవరావు విషయాన్ని మాగుంటా గట్టిగానే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారే విషయంలో శిద్దా రాఘవరావు కానీ ఆయన కుమారుడు శిద్దా సుధీర్ కానీ నోరెత్తడం లేదు. ఆ క్రమంలో శిద్దారాఘవరావుకు తాడేపల్లి సీఎంఓ ఆఫీసు నుంచి పిలుపు వచ్చినా ఆయన వెళ్లకపోవడంతో ఆయన లాస్ట్ మినిట్‌లో ఏ డెసిషన్ తీసుకుంటారో అన్న టెన్షన్ మిగిలిన ఆశావహుల్లో కనిపిస్తోంది. మొత్తమ్మీద దర్శిపై టీడీపీ అధినేత ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News