BigTV English

Gurpatwant Pannun Alleges on Kejriwal: కష్టాలు మళ్లీ.. కేజ్రీవాల్‌కు రూ. 133 కోట్ల ఇచ్చాం!

Gurpatwant Pannun Alleges on Kejriwal: కష్టాలు మళ్లీ.. కేజ్రీవాల్‌కు రూ. 133 కోట్ల ఇచ్చాం!
Khalistani separatist Gurpatwant Pannun alleges on Kejriwal of receiving Rs 134 crore
Khalistani separatist Gurpatwant Pannun alleges on Kejriwal of receiving Rs 134 crore

Gurpatwant Pannun alleges on Kejriwal: ఎవరికైనా సమస్యలు అన్నీ ఒక్కసారి చుట్టేస్తాయి. దాన్ని నుంచి బయటపడడం చాలా కష్టం. దాన్ని అధిగమించేలోపు కాలం గడిచిపోతుంది. దాన్ని అధిగమిస్తే.. ఎలాంటి సమస్యలనైనా హ్యాండిల్ చేయవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే.


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖలిస్తాన్ గ్రూప్ నేత గురుపత్వంత్ పన్నూ. ఖలిస్థాన్‌కి చెందిన గ్రూప్‌ల నుంచి దాదాపు రూ. 133.54 కోట్ల రూపాయలను పార్టీ కోసం కేజ్రీవాల్ తీసుకున్నారని ఆరోపించారు. అదీ 2014 నుంచి 2022 మధ్యకాలంలో ఈ తతంగం జరిగిందన్నారు. దీనికి బదులుగా ఢిల్లీ బ్లాస్ట్ కేసులో దోషిగా ఉన్న భుల్లర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని పన్నూ చెప్పుకొచ్చారు. ఇంతకీ భుల్లర్ ఎవరు? 1993లో ఢిల్లీలో భుల్లర్ చేసిన బాంబు దాడిలో 9 మంది చనిపోగా, 31 మంది గాయపడ్డారు.

మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపొందించే క్రమంలో ఆయన ఉపయోగించిన ఫోన్ గురించి ఈడీ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఫోన్ ఎక్కడుందో తనకు తెలీదంటూ రిప్లై ఇచ్చినట్టు సమాచారం. ఫోన్ గురించి దాదాపు నాలుగు గంటలపాటు ఈడీ ప్రశ్నించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కుంభకోణంలో దాదాపు 170 ఫోన్లు మిస్ అయ్యాయని, కేజ్రీవాల్ వినియోగిస్తున్న చరవాణి 171వ ఫోన్ అని ఈడీ వర్గాలు చెబుతున్నమాట. ఈ కేసుకు సంబంధించి 17 ఫోన్లలో డేటాను ట్రేస్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి లిక్కర్ కేసు గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది.


Also Read: Big Breaking : తీహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 9 వరకూ జ్యుడిషియల్ రిమాండ్

మరోవైపు కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని నరేంద్రమోదీ భయపడుతున్నారని శివసేన ఉద్దవ్ వర్గానికి ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. జైలు నుంచే విధులు నిర్వహించడంతో బీజేపీకి ఆయన మరింత ప్రమాదకరంగా మారారని చెప్పారు. ప్రజలకు ఆయన చెప్పేది వినటమేకాదు, మద్దతుగా వస్తారని మనసులోని మాట బయటపెట్టారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ జైలుకు వెళ్లిన నాయకులు తిరిగి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు సంజయ్‌రౌత్.

Tags

Related News

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Nepal Protests: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తతలు! విమాన సర్వీసుల నిలిపివేత..

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Big Stories

×