Tirupati TDP: రాష్టంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి.. అలాంటి చోటా టీడీపీకి దిశా నిర్దేశం చేసే నాయకుడు లేక పోవడంతో.. వైసీపీ వ్యూహాత్మక దాడులు చేస్తూ అధికారం ఎవరిదైనా.. తమనెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో చెలరేగిపోతోంది. దాంతో పాటు క్షేత్ర స్థాయిలోని ఇంటలిజెన్స్, కీలక స్టేషన్లలో ఎస్ఐలతో పాటు పోలీసుల సహాకారం ఉండటంతో యదేచ్చగా వారు దాడులకు సైతం దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తునాయి .. తాజాగా తిరుపతిలో జరిగిన ఘటనలు అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయని.. తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు.
తిరుపతిలో జనసేన బాట పట్టిన వైసీపీ శ్రేణులు
తిరుపతిలో తాజాగా జరిగిన ఘటనలు వైసీపీ దూకుడుకు అద్దం పడుతున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన కావడంతో .. పెద్దఎత్తున వైసీపీ శ్రేణులు ఆ పార్టీ పంచకు చేరి అధికార కూటమి సభ్యులుగా పెత్తనం చెలాయిస్తున్నారంట.. తమకు తిరుగలేదన్నట్లు వ్వవహారిస్తున్నారంట.. తిరుపతికి సంబంధించి వైసీపీ హయాంలోచక్రం తిప్పిన చైతన్యయాదవ్ అతని బ్యాచ్ మూడో తేదీన కారు డెకార్స్ యాజమానిని చితకబాదారు. దానికి సంబంధించిన సిసి పుటేజ్ సోషియల్ మీడియాలో విసృతంగా వైరల్ అవుతుంది.
వైసీపీ దాడులపై స్పందించని టీడీపీ నేతలు
దాంతో పాటు ఎస్‌టివి నగర్‌లో అయితే ఏకంగా టిడిపి దిమ్మెపై ఆ పార్టీ జెండాను తీసివేసి వైసిపి వారు వారి జెండాను ఎగరవేశారు. ఆ రెండు ఘటనలపై టిడిపి నుంచి స్థానిక చోటా మోటా నాయకులు స్పందించారు కాని తిరుపతిలో అగ్ర నాయకులు అని చెప్పుకునే వారెవరూ స్పందించలేదు. అవి పోలీసులు చూసుకోవాల్సిన వ్యవహారాలంటూ సోకాల్డ్ నాయకులు సైడ్ అయిపోతున్నారంట. ఎన్నికలు జరిగి ఏడాదికి పైగా పూర్తైనా తిరుపతిలో టీడీపీకి ఇన్ చార్జ్ నియామకం జరగలేదు.. ఇన్‌చార్జ్‌గా వ్యవహారిస్తున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దాంతో ఆమె పూర్తిగా సైలెంట్ అవ్వడంతో సొంత పార్టీ వారే పట్టించుకోవడం మానేసారంట .
నామినేటెడ్ పదవితో సైలంట్ అయిన నరసింహయాదవ్
తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అయిన నరసింహయాదవ్‌కు నామినేటెడ్ పదవి దక్కించుకుని పార్టీ వ్యవహరాలను పట్టించుకోవడం లేదంట. ఆ క్రమంలో నలుగురు ఔత్సాహికులు పార్టీ ఇన్‌చార్జ్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పదవి కోసం తమ ప్రయత్నాల్లో తాము బీజీగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో క్యాడర్ గురించి ఆలోచించే నాథుడే కరువయ్యాడంట. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మిగతా నియోజకవర్గాలలో పూర్తి అయింది. అయితే తిరుపతిలో మాత్రము పూర్తి కావడం లేదు. పేరుకి పాత కార్యవర్గం కొనసాగుతోంది కాని యాక్టివ్‌గా లేదు. నాయకులమని చెప్పుకునే వారంతా ఎవరి దారి వారిదన్నట్లు వ్యవహరిస్తుండటంతో తెలుగుతమ్ముళ్లకు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా తయారైందంట.
ఏక వ్యక్తి నాయకత్వం కావాలంటున్న తిరుపతి తమ్ముళ్లు
తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి త్రీ మెన్ కమిటి లేదా పైవ్ మెన్ కమిటీని టీడీపీ నియమింస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏక వ్యక్తి నాయకత్వం ఉంటే తప్ప పరిస్థితులు సెట్ కావని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. పార్టీ రూలింగ్‌లో ఉన్న వైసీపీ వారు దాడులు చేస్తున్నారని విమర్శలు చేస్తున్న వారు పార్టీ క్యాడర్ కోసం ఏమి చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం వ్వవహారంలో అధిష్టానం తిరుపతి పట్ల సీరియస్‌గా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేయని టీడీపీ
గత ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే సీటుని జనసేనకు కేటాయించిన టీడీపీ, తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కూడా బీజేపీకి ఇచ్చింది. తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు గెలిచినప్పటికీ, లోక్‌సభ స్థానం మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. అందుకే టీడీపీ అధిష్టానం తిరుపతిపై ఫోకస్ పెట్టడం లేదని క్యాడర్ కూడా నిరాసక్తత కనబరుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలలో ప్రతిపక్షానికి పైచేయి అయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జనసేనలో చేరినా వైసీపీకే స్వామిభక్తి ప్రదర్శిస్తున్న క్యాడర్
కేసుల భయంతో పాటు తమ దందాలకు అడ్డులేకుండా చేసుకోవడానికి పలువురు తిరుపతి వైసీపీ ద్వితేయ శ్రేణి నాయకులు జనసేనలో చేరిపోయారంట. పేరుకి జనసేనలో ఉన్నా వారంతా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికే స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారంట. ఇక క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులు, నిఘా వర్గాలలో ఉన్న పలువురు ఇంకా వైసీపీకి, భూమనకే విధేయత ప్రదర్శిస్తున్నారంట. అలాంటి వారిని తప్పించక పోతే టీడీపీ వారిపై దాడులకు అడ్డూ అదుపూ ఉండదని, భవిష్యత్తులో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారం. మరి చూడాలి టీడీపీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో.
-Story By Apparao, Bigtv Live