BigTV English
Advertisement

Hyderabad: ప్రభాకర్‌‌రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం, బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్

Hyderabad: ప్రభాకర్‌‌రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం,  బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్

Hyderabad: ఎట్టకేలకు ఏడాది తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు, మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు. ఆదివారం సాయంత్రం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టగానే ఆయన నెట్‌వర్క్ అలర్ట్ అయ్యింది. అంతేకాదు ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు. ఈ విధంగా తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అధికారులు.


మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు గురించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. ఆయన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. అధికారంలో లేకపోయినా ప్రభాకర్‌రావు ఎయిర్‌పోర్టులో దిగగానే ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు.

కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దాడి చేశారు. ఓ రిపోర్టర్‌ని చాతిలో గుద్దాడు బౌన్సర్‌. మరి కొంతమంది మీడియా ప్రతినిధులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయంలో పోలీసులు బౌన్సర్లని హెచ్చరించినా మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కొందరు యూనిఫాంలో కనిపించగా, మరికొందరు సివిల్ డ్రెస్‌లో కనిపించారు బౌన్సర్లు.


దాదాపు 70 మంది ప్రభాకర్‌రావు అనుచరులు ఒక్కసారిగా ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభాకర్ రావు ఇంటివరకు బౌన్సర్లతో భారీ కాన్వాయ్ వచ్చింది. ఆయన్ని ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లిపోయారు బౌన్సర్లు. మీడియాతో మాట్లాడటానికి ముఖం చాటేశారు ప్రభాకర్‌రావు. ప్లాన్ ప్రకారం మీడియాపై దాడికి పాల్పడ్టారు ప్రభాకర్‌రావు బౌన్సర్లు.

ALSO READ: ఎన్నాళ్లకెన్నాళ్లకు అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు

ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వస్తే మాజీ ఐపీఎస్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే ఆయనకు ఓ కస్టమ్స్ అధికారి వెల్ కమ్ చెప్పడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ లెక్కన ఆయన నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ కేసులో నిందితుడికి కస్టమ్స్ అధికారి వెల్కమ్ చెప్పడాన్ని హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా స్వాగతం పలికారు కస్టమ్స్ అధికారి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. అందుకు సంబంధించి ఆధారాలు సేకరించారు పోలీసులు. కస్టమ్స్ అధికారికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.

కేసులో నిందితుడికి విధుల్లో ఉన్న అధికారి స్వాగతం పలకడం చట్ట విరుద్ధం.  ఇమ్మి గ్రేషన్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు కస్టమ్స్ అధికారి స్వాగతం పలికిన ఉదంతం సెన్సేషన్‌గా మారింది.

ఈ లెక్కన ప్రభాకర్‌రావు నెట్‌వర్క్ ఇంకెన్ని విభాగాలకు విస్తరించిందోనని చర్చించుకోవడం కొందరి అధికారుల వంతైంది. ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ప్రభాకర్‌రావును దాదాపు మూడు గంటల పాటు ఉండిపోయారు. ప్రొసీజర్ పూర్తి చేసిన తరువాత ఆయన్ని పంపించారు ఇమిగ్రేషన్ అధికారులు.

 

Related News

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Big Stories

×