BSNL Recharge Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను అందిస్తుంటుంది. ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి ప్రైవేటు సంస్థలతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చాలా తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోందని యూజర్లు చెబుతుంటారు. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ మరో అద్భుతమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం రూ.39కే 20GB డేటాను ఆఫర్ చేస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
అత్యవసరంగా ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్ఎల్ ఈ రూ.39 రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అయితే 24 గంటల (ఒక రోజు) వ్యాలిడిటీని మాత్రమే ఇది కలిగి ఉంది. ఈ ప్లాన్ కింద యూజర్లు ఏకంగా 20 GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అయితే ఈ రీచార్జ్‌లో ఎలాంటి కాల్స్, ఎస్ఎంఎస్ (SMS) ప్రయోజనాలు యూజర్లకు లభించవు. కేవలం ఇంటర్నెట్ వినియోగం కోసమే ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు స్పష్టం చేశాయి.
Aaj ka data game: FULL POWER
Scroll karo, stream karo, download karo ya bas online raho jab data unlimited ho, toh rukna kyun?#BSNLIndia #BSNLSelfCareApp #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity @CMDBSNL @robertravi21 pic.twitter.com/40TBHusPvY
— BSNL India (@BSNLCorporate) September 1, 2026
మరోవైపు కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్ఎల్ ‘ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట రూ. 1 ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అర్హత ఉన్న కొత్త కస్టమర్లు రూ.1 చెల్లించి ఉచిత బీఎస్‌ఎన్ఎల్ సిమ్ కార్డ్‌తో పాటు 24 రోజుల వ్యాలిడిటీతో టెలికాలం సేవలు పొందొచ్చు. ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ 1GB డేటా లభిస్తుంది. దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.
The First “Hello” Starts Somewhere.
Why not start yours with ₹1?#BSNLIndia #BSNLSelfCareApp #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #freedom1 @CMDBSNL @robertravi21 pic.twitter.com/Cs47WTG04T— BSNL India (@BSNLCorporate) September 10, 2026
365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే వార్షిక రీచార్జ్ ప్లాన్‌పై కూడా బీఎస్ఎన్ఎల్ భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఫ్రీడమ్ ఆఫర్ ద్వారా కస్టమర్లకు మరో 47 రోజుల వ్యాలిడిటీ ఉచితంగా అందిస్తోంది. అంటే మొత్తం 412 రోజుల పాటు ఈ ప్లాన్ పనిచేస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, ఉచిత రోమింగ్‌తో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ అదనపు వ్యాలిడిటీ సదుపాయం కూడా సెప్టెంబర్ 12 వరకే అందుబాటులో ఉండనుంది.
Bas, ab rakhte hain…
5 minute aur?”For all those conversations that never feel long enough, get 47 extra days of connectivity with the ₹2399 plan.
Now imagine doing it just once.#BReX 👉 https://t.co/SpaVXw85OI#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife… pic.twitter.com/bo1jlPlsPE
— BSNL India (@BSNLCorporate) September 6, 2026
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి బీఎస్‌ఎన్ఎల్ ఇటీవల ‘రూరల్ ఎంట్రీ ప్లాన్’ను ప్రారంభించింది. నెలకు రూ. 259 ధరతో వచ్చే ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా 25 Mbps వరకు వేగంతో ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత ఇన్‌స్టాలేషన్, వేవ్స్ (Waves) ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉచిత యాక్సెస్ కూడా లభిస్తాయి.
Also Read: రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!
ఒకవైపు ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తూనే మరోవైపు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై బీఎస్‌ఎన్ఎల్ దృష్టి పెట్టింది. తమ యూజర్లకు వేగవంతమైన నెట్ వర్క్ కవరేజ్ అందించడానికి ఈ ఏడాదిలో దాదాపు 1,00,000 (లక్ష) కొత్త 4జీ, 5జీ టవర్లను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!