BigTV English
Advertisement

Bhairav Battalion: భారత్ ఆర్మీలోకి భైరవ్ బెటాలియన్.. పాక్, చైనాకు చుక్కలే!

Bhairav Battalion: భారత్ ఆర్మీలోకి భైరవ్ బెటాలియన్.. పాక్, చైనాకు చుక్కలే!

Bhairav Battalion: భారత సరిహద్దుల్లో సరికొత్త కమాండోలు దిగారు. పశ్చిమాన ఉన్న పాకిస్థాన్ అయినా.. తూర్పున ఉన్న చైనా అయినా.. ఇండియా బోర్డర్‌లో తోక జాడిస్తే.. ఊహించని మెరుపు దాడుల్ని చవిచూడాల్సి ఉంటుంది. వాళ్లకు బుద్ధి చెప్పేందుకు.. మన ఆర్మీ బలగాలకు మరింత బలమై నిలిచేందుకు వచ్చేశాయ్ భైరవ్ బెటాలియన్స్. అసలేంటీ.. ఈ సరికొత్త కమాండో యూనిట్స్? ఇండియన్ ఆర్మీ వీటిని ఎందుకు తయారుచేసింది?


మెరుపు దాడులకు హై ఇంపాక్ట్ ఆపరేషన్లు భైరవ్ టీమ్స్..
దేశ సరిహద్దుల్లో వేగంగా దాడులు చేసేందుకు ఇండియన్ ఆర్మీ తయారుచేసిన సరికొత్త లైట్ కమాండో యూనిట్లే.. ఈ భైరవ్ బెటాలియన్స్. సరిహద్దుల వెంబడి మెరుపు దాడులకు, హై ఇంపాక్ట్ ఆపరేషన్ల కోసం.. వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఐదు భైరవ్ బెటాలియన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ఆర్మీ వీటిని ఉత్తర, పశ్చిమ, తూర్పు కమాండ్లలో మోహరించింది. మరో నాలుగు బెటాలియన్లకు వేగంగా శిక్షణ కొనసాగుతోంది. త్వరలోనే.. ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రతి బెటాలియన్‌లో 250 మంది సిబ్బంది ఉంటారు. రాబోయే ఆరు నెలల్లో.. మరో 20కి పైగా భైరవ్ బెటాలియన్లను పెంచే యోచనలో ఇండియన్ ఆర్మీ ఉన్నట్లు సమాచారం. ఆర్మీలోని స్పెషల్ ఫోర్సెస్, సాధారణ పదాతి దళాలకు మధ్య వారధిగా ఈ భైరవ్ బెటాలియన్లు పనిచేయనున్నాయి.

వేగవంతమైన ఆపరేషన్ల కోసం స్పెషలైజ్ స్టైకింగ్ యూనిట్స్..
సరిహద్దుల్లో చురుగ్గా కదిలేందుకు, ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉండేందుకు.. ఓ దళాన్ని సృష్టించే ఆలోచనతో.. భారత సైన్యం ఈ భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లను పెంచడం ప్రారంభించింది. ఇవి.. భారతదేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వెంట వేగవంతమైన, అధిక ప్రభావవంతమైన ఆపరేషన్లని నిర్వహించేందుకు సిద్ధం చేసిన స్పెషలైజ్డ్ స్ట్రైకింగ్ యూనిట్స్. ఇండియన్ ఆర్మీలోని.. రుద్ర ఆల్ -ఆర్మ్స్ బ్రిగేడ్ ఫ్రేమ్ వర్క్ కింద.. భైరవ్ యూనిట్లు సిద్ధమవుతున్నాయి. ఎత్తైన, సంక్లిష్టమైన భూభాగాల్లో మెరుపు దాడులు చేసేందుకు, కూల్చివేత మిషన్లు, మల్టీ డొమైన్ ఆపరేషన్లతో పాటు వ్యూహాత్మక షాకింగ్ దళాలుగా పనిచేసేందుకు.. వీటిని తీసుకొచ్చారు. రాబోయే కొన్ని నెలల్లో.. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్లకు సంబంధించిన అవసరాలను తీర్చేందుకు.. రాబోయే కొన్ని నెలల్లో ఇంకొన్ని భైరవ్ బెటాలియన్లను.. ఆర్మీకి అటాచ్ చేయనున్నారు. 2016లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత.. భైరవ్ బెటాలియన్లని తయారు చేయడం మొదలుపెట్టారు. 2020లో చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తర్వాత.. ఈ బెటాలియన్లు పూర్తి స్థాయిలో ఓ కమాండో యూనిట్‌గా మారాయి. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కింద జరిగిన చర్చలు, సమాలోచనల్లో.. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ నిర్మాణంలో.. తేలికైన, వేగవంతమైన కమాండో స్టైల్ ఫోర్స్ అవసరాన్ని గుర్తించారు. అప్పుడే.. వీటిని తయారుచేశారు.


తేలికైన, వేగవంతమైన కమాండో స్టైల్ ఫోర్స్ భైరవ్
సంప్రదాయ ఇండియన్ ఆర్మీ పదాతి దళం, సాయుధ బ్రిగేడ్‌ల మాదిరిగా కాకుండా.. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్.. మాడ్యులర్, టాస్క్ ఆధారితంగా పనిచేస్తుంటాయ్. ఇవి.. అన్ని పోరాట ఆయుధాలు, పదాతి దళం, కవచం, ఫిరంగి దళం, ఇంజనీర్లు, ఆర్మీ సంకేతాలన్ని కలిపి.. వేగంగా బరిలో దిగి పోరాడేందుకు.. ఒకే ఒక్క ఆదేశానికి దూరంగా ఉంటాయి. ఈ భైరవ్ బెటాలియన్లు.. ఐబీడీ కమాండోలో భాగంగా పనిచేస్తాయి. రుద్ర బ్రిగేడ్‌లు, పారా-స్పెషల్ దళాల మద్దతు లేకుండా.. ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయ్. ఇండియన్ ఆర్మీ.. స్టాటిక్ డిఫెన్సివ్ మోడల్ నుంచి చురుకైన, టెక్నాలజీ ఆధారిత వార్‌ఫేర్‌కి మారుతోంది. ఈ యూనిట్లు.. వ్యూహాత్మకంగా, వేగంగా, కఠినంగా వ్యవహరించే సామర్థ్యంతో పనిచేస్తాయి. ప్రతి భైరవ్ బెటాలియన్‌లో 600 నుంచి 650 మంది సిబ్బంది ఉంటారు. ఒక్కొక్కటి.. దాదాపు 120 మంది సైనికులతో కూడిన నాలుగు బృందాలుగా విభజించారు. ఈ యూనిట్లు.. కమ్యూనికేషన్, నిఘా, మందుగుండు సామాగ్రిలో స్వయం సమృద్ధిగా ఉండేలా రూపొందించారు. ఈ బెటాలియన్లు వేగంగా బరిలోకి దిగేందుకు.. హై-మొబైలిటీ వాహనాలు కలిగి ఉంటాయి. నీటిలో పోరాడాల్సి వస్తే.. వాటి కోసం చిన్న పడవలు, లక్ష్యాలను కచ్చితంగా గుర్తించేందుకు డ్రోన్లు, లాయిటరింగ్-మునిషన్ సిస్టమ్స్, నేరుగా కాల్పులు జరిపేందుకు మెషీన్ గన్స్, మోర్టార్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అన్నీ.. భైరవ్ బెటాలియన్లకు అందించారు. యుద్ధభూమిలో అవగాహన కోసం.. ఎలక్ట్రానిక్ వార్ ఫేర్, ఇంటలిజైన్స్, సర్వైలెన్స్, నిఘా సాధనాలు కూడా సమకూర్చారు. పారా స్పెషల్ ఫోర్సెస్ లాగా.. భైరవ్ యూనిట్లు వైమానిక చొరబాట్లపై ఫోకస్ పెట్టవు. వీరు.. పర్వతాలు, భూభాగాల్లో విధ్వంసక ఆపరేషన్లతో విరుచుకుపడతారు.

ఆర్మీలో వ్యూహాత్మరమైన రహస్య ఆపరేషన్ల కోసం భైరవ్..
భైరవ్ బెటాలియన్.. తొలి బ్యాచ్ ట్రైనింగ్.. దాదాపు రెండున్నర నెలలు కొనసాగింది. ఇండియన్ ఆర్మీలో వ్యూహాత్మకమైన పాత్ర కోసం, రహస్య ఆపరేషన్ల కోసం భైరవ్ బెటాలియన్లు.. ఫ్రంట్ లైన్లకు దగ్గరగా పనిచేస్తాయ్. యుద్ధ సమయాల్లో.. భైరవ్ బెటాలియన్లు.. వేగంగా దాడులు చేస్తాయ్. శత్రువుల లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేస్తాయ్. వారికి కేటాయించిన.. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ కోటలను కూడా నాశనం చేస్తారు. భైరవ్ బెటాలియన్లు.. హై-టెంపో వ్యూహాత్మక చర్యల కోసం సిద్ధం చేశారు. ఇవి.. రుద్ర బ్రిగేడ్‌లతో కలిసి పనిచేస్తాయ్. ఇవి.. సరిహద్దుల్లో అన్ని రకాల ఆపరేషన్ల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయ్. ఈ భైరవ్ బెటాలియన్లు.. ప్రతి వ్యూహాత్మక దాడికి.. స్పెషల్ ఫోర్సెస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే కాదు.. సరిహద్దు ఆపరేషన్లలో మిలటరీకి మంచి సపోర్టుగా నిలుస్తాయ్.

డ్రోన్లు, లాంగ్ రేంజ్ ప్రెసిషన్ ఫైర్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్
ఇండియన్ ఆర్మీలో భైరవ్ బెటాలియన్ల రాకతో.. రక్షణ పరంగా భారత బలగాల బలం ఎంత పెరుగుతుంది? ఆర్మీకి.. ఈ సరికొత్త కమాండో బెటాలియన్లు ఎంత సహకారం అందిస్తాయ్? ఇలాంటి బెటాలియన్లతో ఇండియా వార్‌ఫేర్ సిస్టమ్ మారుతుందా? దేశ సరిహద్దుల్లో భూమిపై జరిగే యుద్ధాల్లో.. భైరవ్ బెటాలియన్లు గేమ్ ఛేంజర్ కాబోతున్నాయా?
ఇండియన్ ఆర్మీలో.. భైరవ్ బెటాలియన్ల ఎంట్రీ.. దేశ రక్షణ వ్యవస్థని.. యుద్ధ వ్యూహాన్ని బలోపేతం చేస్తుందని.. రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ సరికొత్త కమాండో యూనిట్లు.. భారత బలాన్ని పెంచడమే కాదు.. వార్ స్ట్రాటజీని కూడా మార్చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఈ ఏడాది మొదట్లో.. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించిన రుద్ర బ్రిగేడ్‌లు.. మన బలగాల ఆధునీకరణలో మరో దశని సూచించింది. సంప్రదాయ పోరాట ఆయుధాలను.. డ్రోన్లు, లాంగ్ రేంజ్ ప్రెసిషన్ ఫైర్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌ లాంటి కొత్త రకం ఆస్తులతో కలుపుతాయి. సరిహద్దుల్లో వేగవంతమైన, నిర్ణయాత్మకమైన పోరాటాల కోసం.. మోడ్రన్, మల్టీ డొమైన్ ల్యాండ్ ఫోర్స్‌గా.. భైరవ్ బెటాలియన్లు, రుద్ర బ్రిగేడ్‌లు నిలవనున్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చర్.. అన్నిరకాల పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటుంది. తక్కువ లాజిస్టిక్స్, ఎక్కువ పోరాట సంసిద్ధతని నిర్ధారించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రిగేడ్‌లకు సంబంధించి.. భైరవ్ బెటాలియన్లు ఓ స్ట్రైక్ బ్లేడ్‌గా పనిచేయనున్నాయి. సరిహద్దుల్లో శత్రువులు దాడి చేసేందుకు సిద్ధపడినప్పుడు.. వాళ్లకు ఫస్ట్ షాక్ ఇచ్చేందుకే.. వీటిని సిద్ధం చేశారు.

వేగం, కచ్చితత్వం ఆకస్మిక దాడులు సామర్థ్యం
భైరవ్ బెటాలియన్లతో.. భారత సైన్యంలో వేగం, కచ్చితత్వం, ఆకస్మిక దాడుల సామర్థ్యం పెరగనుంది. ఈ కొత్త రకం కమాండో యూనిట్లు.. సాధారణ పదాతి దళం కంటే వేగంగా, చురుగ్గా ఉంటాయ్. వీటిని.. పారా స్పెషల్ ఫోర్సెస్ కంటే తక్కువ వ్యూహాత్మక మిషన్ల కోసం ఉపయోగిస్తారు. దీనివల్ల.. పారా కమాండోలు మరింత క్లిష్టమైన, రహస్యమైన ఆపరేషన్లపై ఫోకస్ చేసేందుకు వీలుంటుంది. ఒక్కో బెటాలియన్‌లో 250 మందికి కమాండోలు ఉంటారు. సంఖ్య తక్కువే అయినా.. వీరు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, నిఘఆ వ్యవస్థల్లో.. ట్రైనింగ్ పొంది ఉండటం వల్ల.. చాలా కచ్చితత్వంతో దాడులు చేసే కెపాసిటీ కలిగి ఉంటారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దులతో పాటు జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల లాంటి.. సున్నితమైన ప్రాంతాల్లో.. వేగవంతమైన, హై-ఇంపాక్ట్ ఆపరేషన్లను నిర్వహించేదుకు.. భైరవ్ బెటాలియన్‌లోని కమాండోలు.. ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. శత్రువు భూభాగంలోకి చొచ్చుకుపోయి.. ఆకస్మిక దాడులు, ఆపరేషన్లు, విద్రోహ చర్యలను నిర్వహించగలరు. అంతేకాదు.. ఇంటిగ్రేటెడ్ ఐఎస్ఆర్ సిస్టమ్‌తో.. శత్రువుల కదలికలను తెలుసుకునేందుకు కూడా సాయపడతారు. భైరవ్ బెటాలియన్లలో.. పదాతి దళం, ఫిరంగి దళం, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్ లాంటి వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని.. ఈ బెటాలియన్లలో చేర్చడం వల్ల.. యుద్ధ రంగంలో అన్ని రకాల యూనిట్ల మధ్య సమన్వయం మెరుగుపడనుంది.

భైరవ్ బెటాలియన్ల రాకతో సరికొత్త మార్పుకు సూచిక
భారత సైన్యంలో భైరవ్ బెటాలియన్ల రాక.. సరికొత్త మార్పుకు సూచికగా కనిపిస్తోంది. ఇది సంప్రదాయ యుద్ధం నుంచి.. ఆధునిక, సాంకేతికత ఆధారిత యుద్ధానికి మారుతున్న విధానాన్ని చూపుతోంది. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం సంఖ్య, ఇతర బలాలపై కాకుండా.. టెక్నాలజీ, వేగం, గూఢచార సమాచారంపై ఆధారపడతాయ్. భైరవ్ బెటాలియన్లు.. వేగం, గూఢచార వ్యవస్థలు, యూనిట్ల మధ్య సమన్వయాన్ని అందించి.. ఇండియా హైబ్రిడ్ వార్‌ఫేర్ సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తాయి. డ్రోన్లని వాడటం, వివిధ యూనిట్లని లింక్ చేయడం లాంటి పద్ధతులతో.. వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన సమన్వయం ఏర్పడుతుంది. రక్షణ నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. భైరవ్ బెటాలిన్లు.. ఓ గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా.. ప్రాంతీయ ఘర్షణలు, సరిహద్దుల దగ్గర జరిగే వ్యూహాత్మక ఆపరేషన్లలో.. రాబోయే రోజుల్లో ఈ కమాండోలు కీరోల్ ప్లే చేయబోతున్నారు. రాపిడ్ స్ట్రైక్స్, తక్కువ టైమ్‌లో.. ఎక్కువ ప్రభావం చూపగలిగే కెపాసిటీతో.. శత్రువుల వ్యూహాలను దెబ్బతీస్తాయ్. ముఖ్యంగా.. పర్వతాలు, ఎడారులు, కఠినమైన భూభాగాల్లో వేగంగా, టార్గెటెడ్ టాస్క్‌ల కోసమే.. భైరవ్ బెటాలియన్లని సిద్ధం చేశారు. మొత్తంగా.. ఈ ఆధునిక కమాండో యూనిట్స్.. ఇండియన్ ఆర్మీని మరింత చురుగ్గా, రాపిడ్ రియాక్షన్ పవర్‌గా మారుస్తాయ్. ఇది.. భవిష్యత్తులో భూమిపై జరిగే యుద్ధాల్లో.. భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తాయ్.

Story By Anup, Bigtv

Related News

Trump Orders: అణు పరీక్షలకు ట్రంప్ ఆర్డర్.. ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Bihar elections: సీఎం అభ్యర్థి నితేశ్! బీహార్‌లో బీజేపీ ప్లాన్ అదేనా?

IMD : IMD ఏంటిది! ముంచేసిన మెుంథా

DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?

Srikakulam: ధర్మాన, తమ్మినేని స్కెచ్ .. జగన్ ఒప్పుకుంటాడా?

Big Stories

×