BigTV English
Advertisement

IMD : IMD ఏంటిది! ముంచేసిన మెుంథా

IMD : IMD ఏంటిది!  ముంచేసిన మెుంథా

ఐఎండీ IMD (Indian Meteorological Department)అనగానే.. మనమంతా హై రేంజ్‌లో ఊహించుకుంటాం. అక్కడున్న వ్యవస్థకు, శాటిలైట్ల సపోర్ట్‌కు.. కచ్చితమైన డేటా రిలీజ్ చేస్తారని అనుకుంటాం. కానీ.. మొంథా తుఫాన్ విషయంలో.. ఐఎండీ తేలిపోయింది. మనవన్నీ భ్రమలేనని మరోసారి రుజువైంది. మొంథా సైక్లోన్‌పై ఐఎండీ ఇచ్చిన ప్రతి రిపోర్ట్ తప్పే! తుపానుపై పంచుకున్న ప్రతి సమాచారం ఉత్తదే! తుఫాన్ తీరుని అంచనా వేయడంలోనూ, దానిని కరెక్టుగా ట్రాక్ చేయడంలోనూ.. ఐఎండీ మరోసారి సక్సెస్‌ఫుల్‌గా ఫెయిలైంది.


తుఫాన్లు వస్తే సరైన ట్రాకింగ్ ఉండదు:

వస్తుంది.. వస్తుంది అంటే రాదు! రాదు.. రాదు.. అంటే వస్తుంది! ఎందుకంటే.. సీతమ్మ వాకిట్లో సినిమాలో సీతలా.. ఐఎండీకి అన్నీ అలా తెలిసిపోవు. కొన్నే తెలుస్తాయ్.. మిగతావి మనమే వేరే సంస్థ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలు ఫాలో అయి.. కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి. మొంథా తుఫాను విషయంలో.. ఐఎండీ ఫెయిల్యూర్ చూశాక.. ఇలాంటి జోకులు, సెటైర్లు.. ఇంటర్నెట్‌లో చాలా పేలుతున్నాయ్. మొంథా తుఫాన్‌పై సరైన ట్రాకింగ్ లేదు.. ఎక్కడ తీరం దాటుతుందో అంచనా లేదు.. సైక్లోన్‌కి సంబంధించి రియల్ టైమ్ డేటా లేదు.. మిగతా సంస్థలు చెప్పినా ఐఎండీ అధికారులు నమ్మలేదు.. మొత్తంగా.. మొంథా విషయంలో.. ఐఎండీ లేటైంది.. అలాగే ఫెయిలైంది. తుఫాను గమనాన్ని సరిగ్గా పసిగట్టలేక.. వాతావరణశాఖ అధికారులు వైఫల్యం చెందారు.

తమ రిపోర్ట్ కరెక్ట్ అంటున్న ఐఎండీ:

మొంథా తుఫాన్.. కాకినాడ-యానాం మధ్యలో తీరం దాటుతుందని ఊదరగొట్టింది. కానీ.. అంతర్జాతీయ సంస్థలు తుఫాన్ దిశ మార్చుకుందని సూచించాయ్. బిగ్ టీవీ కూడా.. తుఫాన్ కోనసీమ వైపు కదులుతోందని ముందే చెప్పింది. ఇదే విషయాన్ని.. విశాఖలోని వాతావరణ శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే.. తమ రిపోర్ట్ మాత్రమే కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు ఐఎండీ అధికారులు. చివరకు.. నరసాపురం దగ్గర్లో తీరం దాటింది మొంథా తుఫాన్. అక్కడెక్కడో సముద్రం మధ్యలో మొదలైన దగ్గరి నుంచి.. తుఫాను తీరం దాటే దాకా ఐఎండీ తప్పుడు రిపోర్టులే ఇచ్చింది. నిజానికి.. ఒంగోలు సమీపంలోనే మేఘాలు నిలిచిపోయాయ్. దాంతో.. ప్రకాశం జిల్లా, నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయ్. వాస్తవానికి.. ఒంగోలు, నల్లమల వర్షాలపైనా ఐఎండీ సరైన అలర్ట్ ఇవ్వలేదు. పైగా.. తుఫాన్ కోనసీమ వైపు కదులుతోందని బిగ్ టీవీ చెప్పినా.. ఐఎండీ అధికారులు ఏం చెప్పారో చూడండి.


IMD రియల్ టైమ్ డేటా ఎందుకు ఇవ్వలేకపోతోంది?

ఇదీ వరస.. ఐఎండీ చెప్పిందే అధికారిక సమాచారం అంటున్నారు. వాళ్లు ఇచ్చిన రిపోర్టే కరెక్ట్ అంటున్నారు. కానీ.. ఐఎండీ ఇచ్చిన రిపోర్టుకు.. ఏపీలో కనిపించిన రిజల్ట్‌కు లింకే లేదు. అసలు.. తుఫాన్లు వచ్చినప్పుడు ఐఎండీ ఇచ్చే రిపోర్టులు ఎలా ఉంటాయి? ఎంత వేగంగా వాటిని రిలీజ్ చేస్తారో.. డీటైల్డ్‌గా చూద్దాం. ఈ మ్యాప్.. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో.. తుఫాను ఏ దిశగా ప్రయాణిస్తోంది? ఎక్కడ తీరం దాటుతుంది? అనే దానికి సంబంధించి.. ఐఎండీ రిలీజ్ చేసింది. ఇందులో.. కాకినాడ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా చూపించారు. ఇది సాయంత్రం ఐదున్నరకు ఉన్న పరిస్థితి. ఈ డేటాని.. రాత్రి ఎనిమిదిన్నరకు రిలీజ్ చేసినట్లుగా చూపించారు. కానీ.. ఇది ఐఎండీ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ అయిన టైమ్.. దాదాపు రాత్రి తొమ్మిదిన్నర. అంటే.. 4 గంటలు ఆలస్యంగా.. ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ లోపు.. తుఫాను కదలికలు, దాని దిశ, గాలి వేగం, తీవ్రత.. ఇలా అన్నీ మారిపోయాయ్. ఐఎండీ ముందు చెప్పినట్లుగా.. తుఫాన్ కాకినాడ సమీపంలో కాకుండా.. మచిలీపట్నం దగ్గరలో తీరం దాటింది. పోనీ.. తుఫాన్ తీరం దాటిన సమాచారాన్నైనా.. ఐఎండీ వేగంగా రిలీజ్ చేసిందా? అంటే.. అదీ లేదు. రాత్రి పదకొండున్నరకు తీరం దాటితే.. అర్ధరాత్రి రెండు గంటల 10 నిమిషాలకు.. రిపోర్ట్ ఇష్యూ చేస్తే.. రెండున్నర గంటల తర్వాత.. అది అందుబాటులోకి వచ్చింది. మొత్తానికి.. ఐఎండీ చూపించిన మార్గానికి.. తుఫాన్ వెళ్లిన మార్గానికి అస్సలు సంబంధం లేదు. పైగా.. వాతావరణశాఖ చెప్పిన దానితో పోలిస్తే.. తుఫాను తీవ్రత చాలా తక్కువగా ఉంది. తుఫాను తీవ్రతని అంచనా వేయడంలోనూ ఐఎండీ ఫెయిలైందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయ్.

ఏళ్లు గడుస్తున్నా అప్‌డేట్ అవని ఐఎండీ:

ఐఎండీ దగ్గర తుఫాన్లని ట్రాక్ చేసేందుకు సరైన వ్యవస్థ లేదు.. అప్పుడెప్పుడో ఆకాశంలోకి పంపిన శాటిలైట్లు సరిగా పనిచేయడం లేదు అంటే ఓ అర్థముంది. కానీ.. టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక, అడ్వాన్స్‌డ్ శాటిలైట్ల సపోర్ట్ ఉన్నాక కూడా.. తుఫాన్‌ని సరిగ్గా ట్రాక్ చేయకపోవడం కచ్చితంగా వైఫల్యమే అంటున్నారు. పైగా.. సముద్రం పక్కనే ఉన్న విశాఖలో ఐఎండీ రాడార్ సెంటర్ ఉంది. అమరావతిలోనూ ఐఎండీ కేంద్రం. హైదరాబాద్‌లోనూ ఐఎండీ సెంటర్ ఉంది. కోస్టల్ లైన్‌లో.. చెన్నైలోనూ ఓ సెంటర్ ఉంది. ఇంత వ్యవస్థ ఉన్నా.. వాతావరణ శాఖ తుఫాను కదలికల్ని సరిగా ట్రాక్ చేయలేకపోయిందనే చర్చ జరుగుతోంది. ఇండియాలో.. తుఫాన్ల ట్రాకింగ్ కోసం నాలుగు శాటిలైట్లు ఉన్నాయి. ఇన్ శాట్-త్రీడీ, ఇన్ శాట్-త్రీడీఆర్, ఓషియన్ శాట్-3, స్కాట్ శాట్-1 లాంటి ఉపగ్రహ వ్యవస్థలున్నా.. ఐఎండీ ఇంకా అప్‌డేటెడ్‌గా లేకపోవడమేంటి? ఇంత బ్లండర్‌గా.. రిపోర్టులివ్వడమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.

వాతావరణ శాఖ వర్షం పడుతుందని చెబితే.. కచ్చితంగా రాదనే నమ్మకం ఉంటుంది జనాల్లో! అదే.. వాతావరణ శాఖ ఎండ కాస్తుందని చెబితే.. కచ్చితంగా ఆరోజు వర్షం పడుతుందంటారు. ఇప్పటివరకు.. జనంలో ఐఎండీ అంటే ఉన్న ఒపీనియన్ ఇదే. దీనిని.. నిజం చేసేలా మొంథా తుఫాన్ రిపోర్టులు ఇచ్చారు అధికారులు. అసలు.. ఐఎండీ రియల్ టైమ్ డేటా ఎందుకివ్వలేకపోతోంది? మొంథాని ఎందుకు సరిగ్గా ట్రాక్ చేయలేకపోయింది? ఐఎండీని ప్రక్షాళన చేసే టైమొచ్చిందా?

ఒంగోలు సమీపంలోనే నిలిచిపోయిన మేఘాలు:

తుఫాను లాంటి విపత్తులు వచ్చినప్పుడు.. కోట్లాది మంది ప్రజలు కచ్చితమైన సమాచారం కోసం ఎదురుచూస్తునప్పుడు, ప్రభుత్వం, అధికార యంత్రాంగమంతా కేవలం ఆ ఒక్క రిపోర్ట్‌నే నమ్ముతున్నప్పుడు.. ఐఎండీ ఎంత పక్కా సమాచారం అందించాలి? కానీ.. వాతావరణ శాఖ అధికారుల్లో.. ఆ సిన్సియారిటీ, సీరియస్‌నెస్ రెండూ కనిపించట్లేదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఐఎండీ రిలీజ్ చేసిన మ్యాప్‌లు, డేటాని ఆధారంగా చేసుకొని.. మిగతా సంస్థలు, కుర్రాళ్లు.. వెదర్ ఇన్ఫర్మేషన్‌ని పక్కాగా అప్‌డేట్ చేస్తున్నారు. తుఫాను కదలికల్ని అంచనా వేయగలుగుతున్నారు. మేఘాలు ఎక్కడ ఆగిపోయాయో.. వర్షాల ఎఫెక్ట్ ఎక్కడ, ఎంత ఉంటుందో.. చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. కానీ.. ఐఎండీ మాత్రం కచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతోంది. మొంథా తుఫాన్ విషయంలో ఇదే జరిగింది. సముద్రంలో మొదలైనప్పుడు.. తుఫానుతో పాటు కదిలిన దట్టమైన మేఘాలు.. ఒంగోలు సమీపంలోనే ఆగిపోయాయ్. ఆ తర్వాత.. గాలి మాత్రమే తీరం దిశగా కదిలింది. అందుకే.. అత్యంత భారీ వర్షాలు కురవలేదు. ఐఎండీ చెప్పినట్లు.. నిజంగానే సివియర్ సైక్లోన్ గనక కాకినాడ దగ్గర తీరాన్ని తాకి ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవి.

1970 మోడల్ లాగే పనిచేస్తున్న ఐఎండీ:

వాస్తవానికి.. తుఫాన్లు, వర్షాల పట్ల.. జనానికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి? అది ఎంత కచ్చితంగా ఉండాలి? ఎంత వేగంగా సమాచారం ఇవ్వాలనే దానిపై.. వాతావరణ శాఖ ఫోకస్ పెట్టట్లేదు. ఇంకా.. 1970 మోడల్ లాగే.. పనిచేస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. ఐఎండీ కేంద్ర సంస్థ కాబట్టి.. తామంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి.. ఇలాగే ఉంటాం.. రిలాక్స్‌ మోడ్‌లోనే పనిచేస్తాం.. మమ్మల్ని అడిగేదెవరు? మా రిపోర్టులని క్వశ్చన్ చేసేదెవరు? అని అనుకున్నంత కాలం.. ఐఎండీ ఇచ్చే రిపోర్టులు, వాటి రిజల్టులు ఇలాగే ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏమిటంటే.. తుఫాన్లకు సంబంధించి.. ఐఎండీ తయారుచేసే రిపోర్ట్.. కేవలం ఏపీ కోసమో, ఇండియా కోసం మాత్రమే కాదు. మరో.. 13 దేశాలకు పంపించాల్సి ఉంటుంది. మిగతా దేశాల వాళ్లకు.. మొంథా తుఫాను ఎటు కదిలినా.. ఏ ప్రాంతంలో తీరం దాటినా ఇబ్బంది లేదు. పట్టింపు ఉండదు. కానీ.. తుఫాను వేగంగా ఆంధ్రా వైపు దూసుకొస్తున్నప్పుడు.. కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందనే విషయం ప్రజలకు, అధికారులకు తెలిసి తీరాలి. అప్పుడే.. అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు, చర్యలు తీసుకోగలుగుతారు.

కాకినాడ సమీపంలో తీరం దాటుతుందన్న ఐఎండీ:

వాతావరణశాఖ ఎంత సేపూ.. మొంథా తుఫాన్ తీరం దాటేది కాకినాడే అంటూ చెప్పుకుంటూ వచ్చింది. దాంతో.. అందరి ఫోకస్ కాకినాడ తీరం మీదకే మళ్లింది. అక్కడేమైనా విధ్వంసం జరుగుతుందేమో, భారీ నష్టం సంభవిస్తుందేమోనని.. అంతా అటు వైపే దృష్టి పెట్టారు. కానీ.. తుఫాను మాత్రం కాకినాడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసాపురం దగ్గర తీరాన్ని తాకి.. అటు మీదుగా వెళ్లిపోయిుంది. ఏపీ ప్రభుత్వం అలర్ట్‌గా ఉండి.. అన్ని చోట్లా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంది కాబట్టి సరిపోయింది. వీటికి మించి.. మొంథా తుఫాను తీవ్రత కూడా తగ్గిపోయింది కాబట్టి.. భారీ వర్షాలు కురవలేదు. కుండపోత వానలు గనక పడి ఉంటే.. పరిస్థితేంటి? కోనసీమ మొత్తం అల్లకల్లోలమై.. అతలాకుతమైపోయి.. ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఉండేది. ఇప్పటికే.. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రైతులు.. తీవ్రంగా నష్టపోయారు. అదే.. వర్షాలు ఇంకా భారీగా కురిసి ఉంటే.. నష్టం ఊహకు కూడా అందకుండా ఉండేది. అందుకోసమే.. ఇదంతా ఐఎండీ ఫెయిల్యూరేననే చర్చ జరుగుతోంది.

ఇలాంటి విపత్తుల సమయంలో సీరియస్‌గా ఉండాలి:

ఐఎండీ ఇంకా అలాగే పనిచేస్తానంటే కుదరదు. ఎందుకంటే.. అదేమీ ప్రైవేట్ సంస్థ కాదు. మా ఇష్టమొచ్చినప్పుడే రిపోర్ట్ ఇస్తామంటే.. అస్సలు వర్కవుట్ కాదు. వాతావరణశాఖ అధికారులు, సిబ్బంది.. ఇలాంటి విపత్తుల సమయంలో చాలా సీరియస్‌గా పనిచేయాల్సి ఉంటుంది. కచ్చితంగా.. ప్రతి అరగంటకో రిపోర్ట్ రిలీజ్ చేయాలి. అంతగా పాపులర్ కాని వెదర్ వెబ్ సైట్లు, పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్లు కూడా ఆన్‌లైన్‌లో వేగంగా వెదర్ అప్‌డేట్స్ ఇచ్చేస్తున్నారు. అది కూడా.. ఐఎండీ రిలీజ్ చేసిన మ్యాప్స్, డేటా నుంచే. అన్నీ తెలిసిన ఐఎండీ మాత్రం.. ప్రజలకు వేగంగా సమాచారం అందించలేకపోతోంది. దీనికి.. లోపం ఎక్కడుంది? అనే చర్చ మొదలైంది. అందుకోసమే.. ప్రభుత్వం పూర్తిగా ఐఎండీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రజలకు.. చాలా సులభంగా అర్థమయ్యేరీతిలో వెదర్ అప్‌డేట్స్, రిపోర్ట్స్ ఇవ్వాలంటున్నారు. మరీ ముఖ్యంగా.. తుఫాన్ల లాంటి విపత్తులు వచ్చినప్పుడు, రియల్ టైమ్ డేటాని షేర్ చేయగలగాలి. అప్పుడే.. పక్కా సమాచారం వేగంగా తెలుస్తుంది. విపత్తుల సమయంలో ఎంతో కచ్చితత్వంతో పనిచేయాల్సిన ఐఎండీ లాంటి సంస్థలే.. ఇలా పనిచేస్తే అస్సలు కుదరదంటున్నారు. అందువల్ల.. భారత వాతావరణ శాఖ ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా అప్ డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Story by Anup , Big Tv

Related News

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Bihar elections: సీఎం అభ్యర్థి నితేశ్! బీహార్‌లో బీజేపీ ప్లాన్ అదేనా?

DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?

Srikakulam: ధర్మాన, తమ్మినేని స్కెచ్ .. జగన్ ఒప్పుకుంటాడా?

AB Venkateswara Rao: ఏబీవీపై.. చంద్రబాబు ప్లాన్ ఏమిటి?

Jubilee Hills : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా?

Big Stories

×