Pak vs SA: పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( Pakistan vs South Africa, 2nd T20I) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే లాహోర్ లోని గడాఫీ వేదికగా ( Gaddafi Stadium, Lahore) ఈ రెండు జట్ల మధ్య నిన్న రెండో టి20 జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. ఇక ఈ మ్యాచ్ లో చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేసిన బాబర్ ఆజం ( Babar Azam) 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ రికార్డు సృష్టించాడు బాబర్ ఆజం. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేస్తూ టి20 హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ టి20 క్రికెట్లో 4231 పరుగులు చేశాడు.
అయితే ఆ పరుగులను తాజాగా బీట్ చేశాడు బాబర్ ఆజం. 4232 పరుగులతో టి20 క్రికెట్ లో ఇప్పుడు రారాజుగా నిలిచాడు బాబర్ ఆజం. అటు 3వ స్థానంలో విరాట్ కోహ్లీ 4,188 పరుగులతో ఉన్నాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాబర్ ఆజం ఇంకా టి20 లో ఆడుతున్నాడు. అంటే ఇకపై టి20లో రారాజు బాబర్ ఆజం కాబోతున్నాడు. అతడు ఇంకా టి20 లో ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి, మరిన్ని పరుగులు చేసుకొని తన స్థానాన్ని పదిలంగా ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి.
అంతర్జాతీయ టి20 క్రికెట్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. 123 ఇన్నింగ్స్ లలోనే 4232 పరుగులు సాధించాడు. ఇందులో 128.95 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక 151 ఇన్నింగ్స్ లలో 4232 పరుగులు చేసి రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. అయితే రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 140.89 ఉంది. మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 117 మ్యాచ్‌ల్లోనే 4188 పరుగులు సాధించాడు. నాలుగో స్థానంలో జోష్ బట్లర్ ఉన్నాడు. అతను 132 మ్యాచ్ ల్లో 3869 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో పాల స్టిర్లింగ్ ఉన్నాడు. అతను 150 మ్యాచ్ లలో 3710 పరుగులు సాధించాడు.
పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్న లాహోర్ లోని గడాఫీ వేదికగా టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో తొమ్మిది వికెట్ల తేడాతో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే, నిన్న పాకిస్తాన్ విజయం సాధించింది. 110 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆల్ అవుట్ అయింది. ఆ లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి పాకిస్తాన్ ఛేదించింది.
Also Read: Womens World Cup 2025: 1973 నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన జట్లు ఇవే..టీమిండియా ఒక్కటి కూడా లేదా ?
Most runs in T20I history:
🇵🇰 𝟰𝟮𝟯𝟮* - 𝗕𝗮𝗯𝗮𝗿 𝗔𝘇𝗮𝗺
🇮🇳 4231 - Rohit Sharma
🇮🇳 4188 - Virat KohliHE SITS ALONE ON THE THRONE OF T20I BATTING ROYALTY 👑 #BabarAzam | #BabarAzam𓃵 pic.twitter.com/EJseJh7dBf
— Team Babar Azam (@Team_BabarAzam) October 31, 2025