Kama Reddy News: అయ్యో పాపం.. ఎక్కడైన అత్త, మామల వేధింపులు భరించలేక కోడల్లు ఆత్మహత్య చేసుకోవడం విన్నాం.. చూశాము కూడా.. కానీ, ఇక్కడ ఒక అల్లుడు ఇల్లరికం వెళ్ళి అక్కడ అంత బాగా ఉంది అనుకున్న సమయంలో అత్తమామలు అల్లుడిని వేధించడం మొదలు పెట్టారు.. దీని తట్టుకోలేక ఇల్లరికం అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన అన్వేష్ రెడ్డి(30), ఐదేళ్ల క్రితం మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్లాడు. అక్కడ తన అత్త, మామలు రోజు తనని వేధించారు. అయితే ఆ వేధింపులు, అవమానాలు భరించలేకపోయి, ఉగ్రవాయి కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఉన్న షెడ్‌లో తాడు కట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. వీడియో వైరల్
అయితే తను చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలంలోనే కనిపించిన ఈ సూసైడ్ నోట్‌లో అన్వేష్ స్పష్టంగా అత్తమామలు నన్ను వేధిస్తున్నారు. ఇలా భరించలేక ఆత్మహత్య చేస్తున్నాను అని రాసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కామారెడ్డి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. తర్వాత పోస్ట్‌మార్టం కోసం అక్కడి సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అత్త, మామలపై వేధింపుల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.