Illu Illalu Pillalu Today Episode November 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి మాట వినగానే అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు.. అయితే నువ్వు ఇప్పుడు బయట ఉన్నావ్ మేము లోపల ఉన్నాము నీ ముద్దుల కోడల్ని తాళం పగల కొట్టి బయటికి తీసుకు రమ్మని అడుగు అని వేదవతితో అంటారు. అవును కదా నేను ఆ పని చేయొచ్చు కదా మీ ముద్దులు కూడా నేనే మరి అని శ్రీవల్లి అంటుంది. ఇక శ్రీవల్లి తాళం పగలగొట్టగానే నా ముద్దుల కోడలువి నువ్వే అని వేదవతి శ్రీవల్లిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది.
మీ ముద్దులు ముచ్చట్లు తర్వాత పెట్టుకోవచ్చు ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతుకుదాం పదండి అని అందరూ కలిసి వెతకడానికి వెళ్తారు. ఒకచోట కూర్చుని ఆకలేస్తున్న కాలు నొప్పులు వస్తున్నా వెతుకుతున్నాం కదా ఆయన దొరకట్లేదు ఏంటి అని శ్రీవల్లి అంటుంది.. ప్రేమ ధీరజ్ ఇవాళ అమ్మాయి రాకుండా ఉంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అని ఏడుస్తూ ఉంటుంది.. మొత్తానికి ఆడవాళ్ళందరూ కలిసి ఆ కిడ్నాపర్ని పట్టుకుంటారు.. అమ్మాయిని కాపాడి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… పోలీస్ స్టేషన్ కి వచ్చిన అమ్మాయి ధీరజ్ అన్నయ్య నన్ను కాపాడేడు అని అందరితోనూ చెబుతుంది. నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాడు నన్ను క్షమించు అన్నయ్య అని అంటుంది. ఒంటరిగా వెళ్లొద్దని నేను అందుకే చెప్పాను ఇలాంటి ఎదవలు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నీకు ఎంత చెప్పినా నువ్వు అని కూతురిపై ఆ తండ్రి అరుస్తారు. నేను చెప్పాను కదండీ నా కొడుకులు ఎవరు ఏ తప్పు చేయరు నేను అలా పెంచాను అని.. అమ్మాయి విషయంలో నా కొడుకులు ఎప్పుడూ తప్పు చేయరు అని రామరాజు అంటాడు..
చూడండి ఎస్ఐ గారు నా కొడుకుల్ని నేను అలా పెంచాను ఎంత చెప్పినా మీరు నమ్మలేదు. నా కొడుకుల అలాంటివారు కాదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని ఎస్సై పై సీరియస్ అవుతాడు రామరాజు.. ఒక తండ్రి వచ్చి తన కూతుర్ని కిడ్నాప్ చేశారు అని అంటే మేము కచ్చితంగా ఎవరినైనా అనుమానించాల్సి వస్తుంది సార్.. ఈ క్రమంలో అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది.. సరే ఎస్సై గారు మా అబ్బాయిని రిలీజ్ చేయండి మేము తీసుకొని వెళ్ళిపోతామని రామరాజు అంటాడు. ధీరజ్ నీ రిలీజ్ చేయగానే ప్రేమ వెళ్లి హాగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నా ముగ్గురు కోడలు నా కొడుకుని కాపాడారు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అని రామరాజు అంటాడు. అక్కడున్న కానిస్టేబుల్ మీ కోడలు చేసిన పనికి సత్యభామ లాగా మీ ఇంటి సమస్యను తీర్చేశారు.. ఇది అసలైన దీపావళి మీకు అని అంటాడు.. రామరాజు కుటుంబం అక్కడి నుంచి వచ్చేస్తారు. భద్ర సేన అందరూ కలిసి టపాసులు పేలుస్తూ సంతోషంగా ఉంటారు.. అయితే ఆ రామరాజు వీళ్లు ప్రతి ఏడాది దీపాలతో నిండిపోయి ఉంటుంది.. ఈసారి చీకటి అయిపోయింది ఇదే కదా మనం కోరుకునేది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అని భద్ర అంటుంది.
ఆ మాట వినగానే సేన కూడా అవునక్కా ఎప్పుడు వాడు సంతోషంతో పటాసులు కాలుస్తూ ఉండేవాడు.. కొడుకు జైలుకి వెళ్లడంతో ఆ సంతోషమంతా మాయమైపోయింది ఇప్పుడు మనం పండగ చేసుకుందామని అంటాడు.. బాంబులు వెలుగులో రా బాంబులు వెలుగులో రామరాజు ఫ్యామిలీ కనిపించడంతో వాళ్లంతా షాక్ అవుతారు. వీళ్లు ఎలా వచ్చారురా వీడు జైలు నుంచి ఎలా వచ్చాడు అని భద్ర అనుకుంటూ ఉంటుంది. వాళ్ళందరిని చూసినా వీళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు..
ఏంట్రా దీపావళి పండగ చేసుకుంటున్నారా..? కొడుకును ఎప్పుడు తప్పు చేయరు అని చెప్పాను కదా అయినా కూడా మీరు నీ కొడుకు అలాంటివాడు అమ్మాయిలను తీసుకొని వెళ్లి అమ్మేస్తూ ఉంటాడు.. నమ్మించి మోసం చేస్తాడు అని నానా మాటలు అన్నారు కదా నా కొడుకు ఏ రోజు తప్పు చేయడు నేను అలా పెంచాను అని రామరాజు అంటాడు.. నేనెప్పుడూ పొరపాటు చేయను రా నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు ఆపదలో ఉన్న అమ్మాయిలని ఆదుకొని అన్నలాగా నిలబడతారు అది గుర్తుపెట్టుకోండి అని రామరాజు సేన వాళ్ళ కుటుంబంతో అంటాడు.
Also Read : కూతురు కోసం వచ్చిన మీనాక్షి.. చక్రధర్ ను అవమానించిన పల్లవి.. నిజం బయటపడుతుందా..?
రామరాజు ఇప్పుడు పేల్చండి రా మతాబులు. అవతలి వాళ్ళు చెవులు పగిలిపోయేలా ఆకాశం దద్దరిల్లెల పేల్చండి అని రామరాజు అంటాడు. వాళ్ళ సంతోషాన్ని చూసిన భద్ర విశ్వం నీ పక్కకు తీసుకొని వెళ్లి ఈ సంతోషాన్ని నేను చూడలేకున్నాను రా నాకు చాలా అసూయగా ఉంది అని అంటుంది. రామరాజు ఇంతగా నవ్వుతూ ఉండటం చూసి నాకు కోపం వస్తుంది ఏదో ఒకటి చేయాలి రా అని అంటాడు. అయితే నువ్వు ఆ ఇంటిని విడగొడితేనే ఆ సంతోషం దూరమైపోతుంది.. అమూల్యని తొందరగా నీ ట్రాప్ లోకి తీసుకొచ్చి పెళ్లి చేసుకో.. అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు సంతోషాలు దూరం అవుతాయి అని భద్ర అంటుంది. త్వరలోనే అది జరుగుతుందట రేపే మంచి ప్లాన్ వేస్తున్నానని విశ్వం అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..