BigTV English
Advertisement

Trump Orders: అణు పరీక్షలకు ట్రంప్ ఆర్డర్.. ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?

Trump Orders: అణు పరీక్షలకు ట్రంప్ ఆర్డర్.. ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?

Trump Orders: ఏదైతే.. ప్రపంచ వినాశనానికి దారితీస్తుందో.. ఏదైతే.. మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందో.. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతోందనే సంకేతాలు ఆందోళన పెంచుతున్నాయ్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతల్ని పెంచింది. 33 ఏళ్ల విరామానికి తెరదించుతూ.. తక్షణమే అణు పరీక్షలకు సిద్ధమవ్వాలంటూ అమెరికా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇది.. రష్యా, చైనాని ఢీకొట్టే వ్యూహమా? ప్రపంచ యుద్ధానికి ఆరంభమా?


మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
టెన్షన్‌నే.. టెన్షన్ పెట్టే ప్రెసిడెంట్.. డొనాల్డ్ ట్రంప్. అతని డెసిషన్ ఏదైనా గ్లోబ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరోసారి.. అలాంటి సంచలన నిర్ణయమే తీసుకున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. 1992 నుంచి కొనసాగుతున్న స్వచ్ఛంద నిషేధాన్ని.. ట్రంప్ నిర్ణయం బ్రేక్ చేసింది. 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. అమెరికాలో మళ్లీ అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌ని ఆదేశించారు. రష్యా, చైనా, తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న క్రమంలో.. ట్రంప్ ఇచ్చిన ఆర్డర్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ నిర్ణయం.. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల మధ్య.. కొత్త దశను సూచిస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని.. ప్రెసిడెంట్‌గా తన తొలి హయాంలోనే దీనిని సాధించామని తెలిపారు ట్రంప్. అణ్వాయుధాలకు విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున.. తాను అణు పరీక్షలు చేసేందుకు ఇష్టపడలేదన్నారు. కానీ.. ఇప్పుడు తనకు వేరే మార్గం లేదని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో.. రష్యా రెండో స్థానంలో ఉందని, చైనా మూడో స్థానంలో ఉందని.. ఐదేళ్లలోపు అవి సమానంగా ఉంటాయని చెప్పారు ట్రంప్. ఇతర దేశాలు.. తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్నందున.. అమెరికా కూడా న్యూక్లియర్ టెస్టులను తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు.

1992లో నెవాడా టెస్ట్ సైట్‌లో అమెరికా ఆఖరి న్యూక్లియర్ టెస్ట్..
అమెరికా చివరిగా.. 1992 సెప్టెంబర్‌లో యూఎస్‌లోని నెవాడా టెస్ట్ సైట్‌లో న్యూక్లియర్ టెస్ట్ చేసింది. అప్పటి నుంచి.. అగ్రరాజ్యం తన ఆయుధ నిల్వ విశ్వసనీయతని నిర్ధారించేందుకు.. అధునాతన కంప్యూటర్ మోడలింగ్, సబ్‌క్రిటికల్ టెస్టులపైనే ఆధారపడింది. ట్రంప్ ఆదేశాల ప్రకారం.. మళ్లీ అమెరికాలో అణ్వాయుధ పరీక్షలు గనక జరిగితే.. ప్రపంచంలో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా.. ప్రపంచ ఆయుధ నియంత్రణ ప్రయత్నాలను అస్థిరపరచడంతో పాటు అమెరికా అణ్వాయుధ ప్రత్యర్థులతో ఉన్న సంబంధాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. న్యూక్లియర్ టెస్టులను తిరిగి ప్రారంభించడం వల్ల.. దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్జాతీయ అణ్వస్త్ర నియంత్రణకు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇది.. కొత్త ఆయుధ పోటీకి దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇది.. సమగ్ర అణ్వాయుధ పరీక్ష నిషేధ ఒప్పందం ద్వారా నిర్దేశించబడిన.. ప్రపంచ అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధక.. నిబంధనలను కూడా సవాల్ చేస్తుంది. భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలను కూడా పెంచే అవకాశం ఉంది.


బ్యూర్ వెస్ట్నిక్ న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ చేసిన రష్యా
అమెరికా మిసైళ్లని సవాల్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు.. బ్యూర్‌వెస్ట్నిక్ న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్, పొసిడాన్ న్యూక్లియర్ టార్పెడోలని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా ప్రకటించిన తర్వాత.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. చైనా కూడా గడిచిన ఐదేళ్లలో.. తన అణ్వాయుధ ఆయుధశాల పరిమాణాన్ని రెట్టింపు కంటే ఎక్కువ పెంచింది. 2020లో దాదాపు 300 వార్‌హెడ్‌ల నుంచి 600కి పెరిగిందని.. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తెలిపింది. 2030 నాటికి.. చైనా వెయ్యి అణ్వాయుధాలను అధిగమించే అవకాశముందే అంచనాలు కూడా ఉన్నాయి. చైనా సైనిక ఆధునీకరణ వేగవంతం అవుతుందనడానికి సంకేతంగా.. బీజింగ్‌లో సెప్టెంబర్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో.. అమెరికాని చేరుకోగల ఐదు కొత్త న్యూక్లియర్ సిస్టమ్స్‌ని ప్రదర్శించారు. అటు పుతిన్ కూడా.. రష్యా న్యూక్లియర్ సంసిద్ధతని నొక్కిచెప్పారు. అక్టోబర్‌లో వరుసగా.. ఆయుధ ప్రదర్శనలు, వ్యూహాత్మక ప్రయోగ విన్యాసాలను చేపట్టారు. రష్యా ఇటీవలే.. తన ఆయుధ ఉత్పత్తిని విస్తరించడమే కాకుండా, కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగింది. పుతిన్ మిసైల్స్‌ని టెస్ట్ చేసే బదులు.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడంపై ఫోకస్ పెట్టాలని.. ట్రంప్ అన్నారు. ఇప్పుడు.. రష్యా, చైనా దూకుడుగా చేపడుతున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లకు.. బలమైన సంకేతాన్ని పంపడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

న్యూక్లియర్ టెస్టులకు సంబంధించి.. ట్రంప్‌కు ఉన్న లెక్కేంటి? అగ్రరాజ్యం ట్యాగ్‌ని కోల్పోకుండా ఉండేందుకే.. మళ్లీ టెస్టులు మొదలుపెట్టమని ఆదేశించారా? అణ్వాయుధాల్లో.. రష్యా, చైనాని అధిగమించడమే.. అమెరికా లక్ష్యమా? 3 దేశాల తర్వాత.. న్యూక్లియర్ టెస్టుల గురించి మిగతా దేశాలు కూడా ఆలోచిస్తే పరిస్థితేంటి? ట్రంప్ నిర్ణయంతో.. అణుయుద్ధం రాబోతోందా?

తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే సంకేతం
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల మధ్య.. రష్యా, చైనా తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న క్రమంలో.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. యూఎస్ కూడా ఇప్పుడు తన సైనిక శక్తిని, నిరోధక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక వ్యూహాత్మక సంకేతంగా.. నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా.. అమెరికా తన అగ్రరాజ్య హోదాని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్లలో.. చైనా అణ్వాయుధాల సంఖ్యలో.. అమెరికా, రష్యాకు సమానం అవుతుందని ట్రంప్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో.. చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్‌తో భేటీకి కొన్ని గంటల ముందు.. ట్రంప్‌ అణు పరీక్షల గురించి ప్రకటన చేయడం వ్యూహాత్మక ప్రాముఖ్యతని పెంచింది.

అణుశక్తితో పనిచేసే బురెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష
మరోవైపు.. రష్యా కూడా వరుసగా శక్తిమంతమైన అస్త్రాలను బయటకు తీస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవలే. అణుశక్తితో పనిచేసే బురెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన మాస్కో.. తాజాగా మరో శక్తిమంతమైన ఆయుధాన్ని సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేసింది. అణు ఇంధనంతో పనిచేసే మానవరహిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ పోసిడాన్‌ని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. వ్యూహాత్మక జలాంతర్గామిలో ఉండే రియాక్టర్ కన్నా 100 రెట్లు చిన్నదైన అణు విద్యుత్ ప్లాంట్‌ను ఇందులో అమర్చినట్లు తెలిపారు. ఇది.. రష్యా అమ్ములపొదిలోని అత్యాధునిక సర్మత్ బాలిస్టిక్ క్షిపణి కన్నా ఎంతో శక్తిమంతమైందన్నారు. ఇదే సమయంలో.. సర్మత్ మిసైల్‌ని కూడా త్వరలోనే సైనిక మోహరింపులకు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అయితే.. పొసిడాన్ పరీక్షతో రష్యా తన అణు సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఇలా.. చైనా, రష్యా వరుసగా న్యూక్లియర్ ఆయుధాల పరీక్షల్లో ముందుండటంతో.. ట్రంప్ కూడా అలర్ట్ అయ్యారు. ఈ విషయంలో.. అమెరికా కూడా తక్కువేం కాదని చెప్పేందుకే.. అణ్వాయుధ పరీక్షలకు ఆదేశించారు. అందుకోసమే.. దశాబ్దాలుగా అమల్లో ఉన్న న్యూక్లియర్ టెస్ట్‌లపై నిషేధాన్ని రద్దు చేశారు. అమెరికా.. తన అణ్వాయుధాల విశ్వసనీయతను, కొత్త ఆయుధాల టెక్నాలజీని ప్రపంచానికి చూపేందుకు ప్రయత్నిస్తోందని.. రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

కొత్త అణ్వాయుధ పోటీని ప్రేరేపించే చర్యగా భావన
న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ల విషయంలో రష్యా, చైనా దూకుడుని, ట్రంప్ నిర్ణయాన్ని చూశాక.. చాలా మంది ఇదొక కొత్త అణ్వాయుధ పోటీని ప్రేరేపించే చర్యగా భావిస్తున్నారు. అమెరికా.. తన ఆయుధాల ఆధునికీకరణ వేగాన్ని పెంచడం ద్వారా.. రష్యా, చైనాపై వ్యూహాత్మక ఒత్తిడి పెంచాలని చూస్తోంది. అయితే.. ట్రంప్ నిర్ణయం.. ప్రపంచ అణ్వాయుధ నిరాయుధీకరణ ప్రయత్నాలకు, సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం కట్టుబాట్లకు హాని కలిగిస్తుంది. అమెరికా కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇప్పటివరకు ఆమోదించలేదు. అమెరికా గనక మళ్లీ న్యూక్లియర్ టెస్టులు మొదలుపెడితే.. రష్యా, చైనా కూడా వాటిని కొనసాగించే అవకాశం ఉంది. ఇది.. ఇండియా, పాకిస్థాన్ లాంటి అణ్వాయుధ దేశాలను కూడా.. తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లని తిరిగి ప్రారంభించేలా చేయొచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇది.. మొత్తంగా అణు విస్తరణ ప్రమాదాన్ని పెంచుతుంది. న్యూక్లియర్ ఆయుధాల పరీక్షలను ప్రారంభించడం వల్ల.. ప్రపంచ దేశాల మధ్య వ్యూహాత్మక ఉద్రిక్తతలను పెంచుతుంది. ఒకరి తర్వాత ఒకరు ఆయుధాల అభివృద్ధికి పోటీ పడే అవకాశం ఉంది. దీని వల్ల.. దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయనే వాదనలు వినిపిస్తున్నాయ్.

Also Read: దారుణం.. వాగు దాటుతూ.. నీటిలో కొట్టుకుపోయిన దంపతులు

అణ్వాయుధ పరీక్షలు, న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ల పునరుద్ధరణ.. ఇప్పటికిప్పుడు అణు యుద్ధాలకు దారితీసే పరిస్థితులు లేకపోయినా.. ఇది అణు నియంత్రణకు సంబంధించిన దశాబ్దాల ప్రయత్నాలను కచ్చితంగా దెబ్బతీస్తుంది. ఇది.. మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం నాటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ట్రంప్ కూడా అణు పరీక్షలు చేయడం తమకు ఇష్టం లేకపోయినా.. న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేపట్టడం తప్ప తమకు మరో మార్గం లేదన్నారు. దాంతో.. ప్రస్తుత చర్యలు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి బదులు మరింత పెంచే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Story By Anup, Bigtv

Related News

Bhairav Battalion: భారత్ ఆర్మీలోకి భైరవ్ బెటాలియన్.. పాక్, చైనాకు చుక్కలే!

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Bihar elections: సీఎం అభ్యర్థి నితేశ్! బీహార్‌లో బీజేపీ ప్లాన్ అదేనా?

IMD : IMD ఏంటిది! ముంచేసిన మెుంథా

DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?

Srikakulam: ధర్మాన, తమ్మినేని స్కెచ్ .. జగన్ ఒప్పుకుంటాడా?

Big Stories

×