పదేళ్లకు పైగా జనసేన వాయిస్ వినిపిస్తున్న కిరణ్‌రాయల్
తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పరిచయం అవసరం లేని పేరు.. గత పది సంవత్సరాలకు పైగా అంటే జనసేన ఆవిర్భావం నుంచి తన గొంతుకను పార్టీ గొంతుకగా వినిపిస్తూ వస్తున్నారు. అసలు కొంత కాలం పాటు రాష్ట్రంలో జన సేన పేరు వినిపించని పరిస్థితులలో కూడా తన గళం ద్వారా కిరణ్‌రాయల్ పార్టీ ఉనికిని చాటారు. ఆ క్రమంల సోషల్ మీడియాలో అప్పట్లో అధికార వైసీపీ నుంచి దాడులు సైతం జరిగాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. అలా జనసేనాని దగ్గర ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కిరణ్‌రాయల్ పొలిటికల్ కెరీర్ క్రాస్‌రోడ్స్‌లో పడింది. లక్ష్మీరెడ్డి వ్యవహారంలో కిరణ్‌రాయల్‌ది స్వయంకృతాపరాథమా? లేకపోతే రాజకీయ ప్రత్యర్ధుల కుట్ర కోణం ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
కిరణ్‌రాయల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న లక్ష్మిరెడ్డి
లక్ష్మి రెడ్డి తిరుపతి నగరానికి చెందిన మహిళ.. ఆమె భర్త కరోనా సమయంలో మరణించాడు.. అంతకు మునుపే వారి ఇంటి పక్కన ఉన్న కిరణ్ రాయల్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది .. వారి మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటు పలు లావాదేవీలు నడిచినట్లు చెప్తుంటారు. ఆ విషయం లక్ష్మిరెడ్డి తాజాగా మీడియా ముందు కొచ్చి ఒప్పుకుంది.. ముఖ్యంగా అమె బయటపెట్టిన ఫొటోలు, వీడియోలు వారిద్దరి సాన్నిహిత్యానికి అద్దం పట్టాయి..అయితే ఇవన్ని మార్ఫింగ్ అంటున్నారు కిరణ్ రాయల్.. వారం క్రితం కిరణ్ రాయల్‌తో కలిసి లక్ష్మీరెడ్డి దిగిన సెల్ఫీ వీడియో విడుదల తర్వాత మొత్తం వివాదం బయటపడింది. కిరణ్ రాయల్ పై అమె విడుదల చేసిన సెల్ఫీ వీడియోను వైసిపి నేతలతో పాటు కొంతమంది జనసేన నేతలు సైతం ఫార్వర్డ్ చేయడమే కాకుండా ఆయనపై వెంటనే పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
తిరుపతి జనసేనలో కిరణ్‌రాయల్‌పై పలువురి వ్యతిరేకత
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వర్గంతో పాటు జనసేనలో అనేక మంది కిరణ్ రాయల్‌కు వ్యతిరేకంగా ఉన్నారు . దానికి తోడు మీడియాలోని ఒక వర్గం కూడా కిరణ్‌రాయల్ ఎప్పుడు దొరుకుతారా? అని వెయిట్ చేసినట్లు కనిపించింది. లక్ష్మిరెడ్డి వ్యవహరంలో సదరు మీడియా చూపించిన ఫోకస్ అందుకు నిదర్శనంగా నిలిచింది ..కిరణ్ రాయల్‌కు అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు, వ్యతిరేకంగా కొన్ని చానల్స్ ప్రచారం చేసాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన న్యాయవాదులు కూడా లక్ష్మి రెడ్డికి అనుకూలంగా రంగంలోకి దిగారు. లక్ష్మీరెడ్డి పై జైపూర్ లో నమోదైన పాత కేసు తిరగదోడటంలో కిరణ్ రాయల్ మొత్తం వ్యవహారం నడిపించాడని, కిరణ్ అనుచరులు దగ్గరుండి జైపూర్ పోలీసులకు పట్టించారని అరోపణలు చేసింది లక్ష్మిరెడ్డి.. పవన్‌కళ్యాణ్‌ని కూడా బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి కిరణ్‌రాయల్ వెళ్లారని ఆరోపించింది.
పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని కిరణ్‌రాయల్‌కు ఆదేశాలు
మొత్తమ్మీద లక్ష్మిరెడ్డి అరోపణలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని కిరణ్ రాయల్ కు జనసేన పెద్దలు అదేశాలు జారీ చేశారంట. ఆ విషయం తెలిసి కిరణ్ రాయల్ వ్యతిరేక వర్గం ఇక ఆయన పని అయిపోయిందని, పార్టీ నుంచి దూరం అయినట్లేనని ప్రచారం మొదలుపెట్టారు. మరో వైపు కిరణ్ రాయల్ వర్గం మాత్రం లక్ష్మీరెడ్డి వివాదం ముగిసే వరకు కిరణ్ రాయల్‌ను పార్టీ దూరంగా ఉండమని చెప్పారని.. కిరణ్ పై పవన్ కు ప్రత్యేక సానుభూతి ఉందని ఖచ్చితంగా కిరణ్ ను పార్టీలో కొనసాగిస్తారని అంటున్నారు.
నామినేటెడ్ పదవుల్లో కిరణ్‌కు ప్రాధాన్యత దక్కుతుందని ప్రచారం
ఉగాదికి రాష్టంలో ఉన్న అన్నిరకాల నామినేటేడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని, తిరుపతి జిల్లా నుంచి ఖచ్చితంగా కిరణ్ రాయల్ పేరు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత పరిణామాలతో ఆయన్ని పార్టీలో ఉండనిస్తే చాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ కోసం తహతహలాడే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ విషయంలో ఖచ్చితంగా సీరియస్ గానే ఉంటారని అంటున్నారు. మరో వైపు కిరణ్‌ను పూర్తిగా రాజకీయాలకు దూరం చేయడానికి వైసీపీతో పాటు జనసేనలోని ఓ వర్గం సీరియస్ గా ప్రయత్నాలు సాగిస్తుందనే ప్రచారం జరుగుతుంది.
Also Read: జనసేనలోకి దువ్వాడ వాణి? క్లారిటీ ఇచ్చేసిందిగా..
లక్షిరెడ్డి, పసుపులేటి సురేష్ లపై కేసు నమోదు
లక్ష్మి రెడ్డి తన ఫొటోలు , ఆడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను మార్ఫింగ్ చేసిందని తాజాగా కిరణ్‌రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో లక్ష్మిరెడ్డితో పాటు పసుపులేటి సురేశ్ అనే వైసీపీ నాయకుడిని నిందితులుగా చేర్చారు. గతంలో సురేశ్ జనసేనలో యాక్టివ్ లీడర్‌గా ఉండేవాడు ..అయితే కిరణ్ రాయల్ తో పొసగక పార్టీ నుంచి బయటకు వెళ్లి పోయాడు. తాజా పరిణమాల నేపథ్యంలో గతంలో కిరణ్ రాయల్‌తో విభేదించి పార్టీనుంచి బయటకు పోయిన వారంతా ఏకమవుతూ .. ఆయన్ని ఇరికించడంలో కీలక పాత్ర వహిస్తున్నారంట.
కిరణ్‌రాయల్ వ్యతిరేక గ్రూపులన్నీ ఏకమవుతున్నాయా?
మరో వైపు లక్ష్మి రెడ్డి సైతం తన దగ్గర కిరణ్ రాయల్ చాట్ బాక్స్ అంతా ఉందని అతను అమ్మాయిలతో తిరిగిన వ్యవహారాలన్నీ రోజుకోకటి సీరియల్ గా వదులుతానని అంటుంది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లాడి పోతున్నారు. ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసుకు సంబంధించి ఆయనకు హైకోర్టుల ఊరట లభించి.. ఈష్యూ మర్చి పోతున్నారు అనుకునే సమయానికి ప్రత్యర్థులు మరో వీడియో విడుదల చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇలాగే కిరణ్ రాయల్ విషయంలో ముందుకు పోవాలని కూడా కిరణ్ ఆపోజిట్ గ్రూపులు సిద్దమయ్యాయంట. ఏదేమైనా పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పోరాటం చేసి.. తీరా ఇప్పుడు ఫలాలు అందుకునే సమయానికి ఇలా జరిగిందేంటని కిరణ్ వర్గీయులు బాధపడుతున్నారు. చూడాలి మరి రాయల్ విషయంలో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?