BigTV English
Advertisement

BJP Target 400 Seats: రికార్డు బ్రేక్ అవుతుందా..? బలాబలాలేంటి..?

BJP Target 400 Seats: రికార్డు బ్రేక్ అవుతుందా..? బలాబలాలేంటి..?

Will Modi win 400 Lok Sabha Seats in Election 2024 India: టార్గెట్ 400 సీట్స్.. ఈ ఎన్నికల్లో NDA కూటమి పెట్టుకున్న టార్గెట్.. మరి ప్రధాని నరేంద్రమోడీ చెప్తున్న ఈ టార్గెట్‌ రీచ్‌ అవ్వడం ఇంత ఈజీనా? ఇంతకీ బీజేపీ వేసుకుంటున్న లెక్కలేంటి? అన్ని సీట్లు గెలవాలంటే ముందు ఏయే రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటాలి? ప్రస్తుతం బీజేపీ బలమెంత? భారతీయ జనతా పార్టీ.. కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే.. ఈ సారి 400కు పైగా సీట్లు సాధిస్తామన్న ధీమాతో ఉంది. బట్.. ఇప్పటివరకు భారత్‌లో ఇలా ఒకపార్టీకి ఇన్ని సీట్లు ఎప్పుడూ రాలేదు. 1969లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ గెలుచుకున్న ఎంపీ సీట్లు 350. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ పార్టీ బ్రేక్ చేయలేకపోయింది.


ల్యాండ్ స్లైడ్ మెజార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా 2019లో సాధించిన సీట్ల సంఖ్య 303 మాత్రమే. 2019 ఎన్నికల్లో బీజేపీ 12 రాష్ట్రాల్లో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. బీహార్, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ. చత్తీస్‌గఢ్‌, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌. ఈ 12 రాష్ట్రాల్లో 320 సీట్లు ఉంటే.. అందులో 278 సీట్లు బీజేపీ హస్తగతం చేసుకుంది. సో బీజేపీకి 303 సీట్లు దక్కాయి. అయితే అప్పుడు పుల్వామా అటాక్, విపక్షాలు వీక్‌గా ఉండటం.. విడివిడిగా పోటీ చేయడంలాంటి పరిణామాల కారణంగా.. ఇది సాధ్యమైంది. కానీ 2024 వచ్చే సరికి సీన్ మారిపోయింది. విపక్షాలన్ని కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. పుల్వామా లాంటి సీన్ ఇప్పుడు మిస్సవ్వుతుంది. కేవలం మోడీ ఫ్యాక్టర్‌ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. సో ఈసారి బీజేపీ గతంలో వచ్చిన సీట్లు సాధించడమే కష్టంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: ఇజ్రాయెల్ Vs ఇరాన్.. వరల్డ్‌ వార్‌ త్రీ? గెట్ రెడీ?


ప్రస్తుతం ఆరు రాష్ట్రాలను తీసుకుందాం ఈ ఆరు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటితే.. బీజేపీ కూటమి ఆశించిన 400 మార్క్‌ను దాటే అవకాశం ఉంది. ఆ సిక్స్ స్టేట్స్ ఏంటంటే.. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బిహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిషా. ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఇప్పుడు బీజేపీకి ఎదురు గాలులు వీస్తున్నాయి. అయితే ఈ ఆరు రాష్ట్రాల్లో 193 సీట్లు ఉన్నాయి. 2019లో ఈ ఆరు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. మిగతా ఐదు రాష్ట్రాల్లో కూడా ఎదురు గాలి వీస్తుంది. ఇక తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలో కలిపి 100 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీ భారీ స్థాయిలో సీట్లు సాధించే సీన్ కనిపించడం లేదు. మహారాష్ట్రలో శివసేన చీలిక, బీహార్‌లో జేడీయూ ఎంత మేర మోడికి ఉపయోగపడతాయనేది ఇప్పుడు డౌట్‌గా ఉంది.
ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బీజేపీ సీట్ల సంఖ్య 272 వద్దే ఆగిపోతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి..

రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది.. రాష్ట్రంలో 28 లోక్ సభ స్థానాలుంటే 25 స్థానాలు బీజేపీ గెల్చుకుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బీజేపీ వీక్ అయింది. ఓటర్లు కాంగ్రెస్ వైపు మల్లే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో మళ్లీకి బీజేపీకి 25 స్థానాలు వస్తాయన్న గ్యారంటీలేదు. తెలంగాణలో ఉన్న 17 స్థానాలలో బీజేపీ గెలిచిన నాలుగు స్థానాలకు అటు ఇటుగా ఉండొచ్చు.. మళ్లీ అదే సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక తమిళనాడులో అన్నామలై కారణంగా బీజేపీ కాస్త బలపడినా.. ఆశించిన మేర సీట్లు వచ్చే అవకాశమైతే లేదు.. దీనికి తోడు తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడీఎంకే కూడా ఇప్పుడు దూరమైంది. కేరళలో అయితే ఏ కోశాన కూడా బీజేపీ మెరగుపడినట్లు సూచనలు లేవు. అయితే ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కారణంగా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా లేదు. అక్కడ బీజేపీ ఎక్కడుంది? అక్కడి బీజేపీకి ఆశాకిరణం టీడీపీతో పొత్తు. బీజేపీ,టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు ఫలిస్తే ఒకటో రెండో సీట్లు రావచ్చు.

Also Read: మరో సారి గెలిచేది మేమే.. ఎందుకంటే?

అంటే ఓవరాల్‌గా దక్షిణాదికి చెందిన 128 స్థానాలలో 30 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక ఉత్తరాదిన ఉన్న 415 స్థానాల్లో మినిమమ్ 370 స్థానాలు గెలవాలి. అప్పుడే బీజేపీ టార్గెట్‌గా పెట్టుకున్న 400 స్థానాల టార్గెట్‌ రీచ్‌ అవుతుంది. కానీ ఆ సీన్ ఉందా? ఎన్డీఏ మిత్ర పక్షాలైన జనతాదళ్‌ యునైటెడ్‌, ఏకనాథ్‌షిండే శివసేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీతో పాటు ఎన్డీఏలోని ఇతర చిన్న, చితక పార్టీలకు కేటాయించిన సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతం లో పోటీ చేసే సీట్ల సంఖ్యనే 350కి మించదు. అంటే పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవాల్సిన పరిస్థితి బీజేపీది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సో లోక్‌సభలోనూ సీట్లు వస్తాయనుకుందాం. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితేంటి? హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ, గుజరాత్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరింది. సో ఈ రాష్ట్రాల్లో బీజేపీ సీట్లకు గండి పడే అవకాశం కనిపిస్తోంది. ఇక కొండంత అండగా ఉండే యూపీలో మాత్రం బీజేపీకి భారీగానే సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇలా ఏ విధంగా చూసుకున్నా పరిస్థితులు మాత్రం బీజేపీ ఆశించినంతగా అయితే లేవు.. ముఖ్యంగా మనం ముందుగా అనుకున్నట్టు బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిషా, బెంగాల్‌లో బీజేపీ.

Tags

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×