Big Stories

Iran Vs Israel War: ఇజ్రాయెల్ Vs ఇరాన్.. వరల్డ్‌ వార్‌ త్రీ..? గెట్ రెడీ..?

Israel Attack on Iran is Looks Like World War III: ఇజ్రాయెల్.. ఇరాన్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను టెన్షన్‌ పెడుతున్న పేర్లు. చీమ చిటుక్కుమన్నా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాలవైపే చూస్తుంది. ఎప్పుడేం జరుగుతుందో అన్న టేన్షన్.. ఏ మిసైల్ ఎటువైపు నుంచి వచ్చి పడి అది ప్రపంచయుద్ధానికి దారితీస్తుందో అనే భయం. ఇప్పుడు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. అసలింతకి మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుంది? నిజానికి వరల్డ్‌ వార్‌ త్రీ అంటూ చేస్తున్న ప్రచారం ఉట్టిదేనా? ప్రస్తుతం ప్రపంచం యుద్ధం చేసే మూడ్‌లో ఉందా?

- Advertisement -

అసలెందుకు మొదలైంది? ఎలా మొదలైంది? అన్నది ఇప్పుడు గతం. కానీ కాస్త బ్రీఫ్‌గా చెప్పుకుంటే.. ఏప్రిల్ ఒకటిన సిరియా క్యాపిటల్ సిటీలో ఉన్న డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ మీద ఎయిర్‌స్ట్రైక్ జరిగింది. చేసింది ఇజ్రాయెల్.. ఒక దేశానికి కాన్సులేట్‌పై దాడి చేయడం అనేది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే.. సో.. ఇరాన్‌కు మండిపోయింది.. కానీ రియాక్ట్ అవ్వలేదు. 10 రోజులు ఆగింది.. ఆ తర్వాత మేం రివేంజ్ తీర్చుకుంటామని ఒక ప్రకటన చేసింది. అయితే ఈ పది రోజులు ఆగింది.. ప్రకటన చేయడానికి కాదు.. ఏర్పాట్లు చేసుకోవడానికి తర్వాత ప్రపంచానికి అర్థమైంది. అయితే ఇరాన్‌ ఇచ్చిన వార్నింగ్‌పై ఇజ్రాయెల్ సెటైరిక్‌గా రియాక్టైంది. WE ARE WAITING.. WELCOME అంటూ మరింత రెచ్చగొట్టింది. సరిగ్గా మూడు రోజుల తర్వాత అంటే 13వ తేదీన ఇరాన్‌ అన్నంత పని చేసింది..
కామికాజ్ డ్రోన్లు.. బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది.

- Advertisement -

అయితే వీటిని ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఆఫ్‌కోర్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నేవీలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే ఇక్కడ జోర్డాన్‌ కూడా ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేసింది. జోర్డాన్ ఎయిర్‌ఫోర్స్ కూడా కొన్ని బాలిస్టిక్ మిసైల్స్‌ను కూల్చేసింది. దీనికి కౌంటర్‌గా ఇజ్రాయెల్ డ్రోన్లు, మిసైల్స్‌ను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ను ఫైర్ చేసిన మిసైల్స్.. సిరియా ఎయిర్‌స్పేస్‌ మీదుగా ఇరాన్‌, ఇరాన్‌లోని పలు టార్గెట్‌లను ఢీకొన్నాయి. ఇక్కడే కాస్త కన్‌ఫ్యూజ్‌ నెలకొంది. ఇజ్రాయెల్‌ కౌంటర్ అటాక్ చేసేసింది అని అమెరికా ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్‌ సైలెంట్‌గా ఉంది. డ్రోన్లు వచ్చాయి.. కానీ అవి మా పిల్లలు ఆడుకునే బొమ్మల సైజ్‌లో ఉన్నాయి. వాటిని ఎయిర్‌గన్‌లతో పేల్చేశామని ఇరాన్‌ ప్రకటించింది. అసలు దానిని దాడిగానే గుర్తించట్లేదు అని ప్రకటించింది. వీటన్నింటికంటే హైలేట్ ఏంటంటే ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రాయిసీ అసలు ఇజ్రాయెల్ పేరు కూడా ఎత్తలేదు తన ప్రసంగంలో.. ఇది ప్రపంచం మొత్తాన్ని ఓ రకంగా షాక్‌కు గురి చేస్తుంది.

Also Read: చైనాకు షాక్ ఇచ్చిన అమెరికా.. పాక్‌కు సాయం చేసిన కంపెనీలపై నిషేధం

ఇరాన్‌, ఇజ్రాయెల్ ఎందుకు మాట్లాడటం లేదు.. ? అమెరికా ఏకపక్షంగా ఎందుకు ప్రకటనలు చేస్తుంది? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్.. నిజానికి ఇప్పటికే హమాస్‌తో యుద్ధంలో తలమునకలై ఉంది ఇజ్రాయెల్.. ఈ సమయంలో ఇరాన్‌తో కయ్యం అనేది చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకే రెండు దేశాలు సైలెంట్‌ అయిపోయాయా? లేదా ఇదంతా తుఫాన్ ముందు ప్రశాంతతనా? అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. Incase.. Just Incase.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ తీవ్రంగా దాడి చేస్తే అరబ్‌ కంట్రీస్‌ అయితే ఏకమవుతాయి. లేదా.. రెండుగా చీలిపోతాయి.. ఖచ్చితంగా ఒక వర్గానికి రష్యా, చైనా తమ మద్ధతిస్తాయి. ఎట్ ది సేమ్ టైమ్.. ఇజ్రాయెల్‌కు మొత్తం వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి. దీన్నే వరల్డ్ వార్ అంటారు. అయితే ఇది వెంటనే జరగదు.

మొదట ఇరాన్‌ హార్మజ్‌ జలసంధిని మూసేస్తుంది. ఇదే జరిగితే 40 పర్సెంట్ క్రూడాయిల్ సరఫరా ఆగిపోతుంది. అంటే సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ దేశాల ఎకానమీపై ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి. ఇక రెడ్‌ సీలో ఇరాన్‌ సపోర్ట్ చేస్తున్న హౌతీ గ్రూప్‌ మరింత యాక్టివేట్ అవుతుంది. సో కార్గో షిప్‌ల రాకపోకలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అటు చమురు, ఇటు కార్గో రవాణా ఆగిపోతే ప్రపంచ దేశాల పరిస్థితులు తలకిందులవుతాయి. ఇవన్నీ ఆలోచించే ఇజ్రాయెల్ తెలివిగా.. దూకుడుగా కాకుండా తెలివిగా తక్కువ తీవ్రతతో దాడులు చేసినట్టు కనిపిస్తోంది.

నిజానికి ఇరాన్‌ రంగంలోకి దిగాలంటే కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్తితి ఉంది. కేవలం ఒంటరిగా రంగంలోకి దిగితే యుద్ధాన్ని ముగించలేదు. ఎట్ ది సేమ్‌ టైమ్.. చాలా దారుణ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ చాలా పవర్‌ ఫుల్.. ఇరాన్‌తో కంపేర్ చేస్తే.. అయితే జోర్డాన్‌ కూడా ఇజ్రాయెల్‌కే సపోర్ట్ చేస్తుంది.. సో నేరుగా వార్‌ చేస్తే ఇరాన్‌ చాలా నష్టపోవడం ఖాయం. ఇటు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే హమాస్‌ను నెల రోజుల్లో తుదముట్టిస్తామని చెప్పి.. ఆరు నెలలైనా ఎటూ తేల్చలేకపోతుంది ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే చాలా ఆయుధాలను దిగుమతి చేసుకుంది. చాలా మంది సైనికులను కోల్పోయింది. ఇలాంటి సమయంలో మరో యుద్ధమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే.. అందుకే ఇజ్రాయెల్‌ ఎప్పటిలా దూకుడుగా వెళ్లడం లేదు.

Also Read: భారత్ టూర్ వాయిదా, కాకపోతే..

బట్.. ఇరు దేశాల మౌనం కూడా ఇప్పుడు భయాన్ని నిద్రలేపుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌ కోవర్ట్ ఆపరేషన్లకు పెట్టింది పేరు. ఇరాన్‌లో ఎక్కడ ఏముందో? ఏ స్విచ్ నొక్కితే ఏం జరుగుతుందో పూర్తిగా క్లారిటీ ఉంది. ఇప్పటికే ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌లను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో ఏం జరిగినా దానికి కారణం ఇజ్రాయెల్ అని భావిస్తుంది ఇరాన్.. అటు ఇరాన్ కూడా సిరియా బార్డర్‌ నుంచి ఇజ్రాయెల్‌లో అలజడులు సృష్టించే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క నిప్పు రవ్వ చాలు అడవి మొత్తం తగలబడిపోవడానికి అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు.

అందుకే అన్ని దేశాలు ఈ రెండు దేశాల్లో ఏం జరుగుతుందన్నది కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నాయి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌ తీరంలో అమెరికా ఇప్పటికే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను మోహరించింది. అంటే ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్స్.. ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్, సబ్‌ మెరైన్స్‌ను ముందుగానే మోహరించింది. బ్రిటన్, ఫ్రాన్స్ నేవీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇరాన్‌ కూడా అరబ్‌ కంట్రీస్‌లో తనకు మద్ధతిచ్చే వారికి ఇప్పటికే అలర్ట్ చేసింది. హమాస్‌, హౌతీలను హైఅలర్ట్‌లో ఉంచింది. సో ఇప్పుడొక చిన్న నిప్పు రవ్వ చాలు.. అంతర్జాతీయ పరిణామాలు మారిపోవడానికి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News