BigTV English

Lok Sabha Elections 2024: మరో సారి గెలిచేది మేమే.. ఎందుకంటే?

Lok Sabha Elections 2024: మరో సారి గెలిచేది మేమే.. ఎందుకంటే?

Lok Sabha Elections 2024: ఉత్తరప్రదేశ్ లోని మథురలో బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలిని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హేమమాలినితో పాటు ఎన్నికల ప్రచారంలో ఆమె కుమార్తెలిద్దరూ పాల్గొన్నారు. ఐదేళ్లలో మథుర ఎంతో అభివృద్ధి చెందిదని ఆమె కుమార్తె నటి, ఈషా డియోల్ అన్నారు. పర్యాటక రంగం ఎంతో మెరుగుపడిందని తెలిపారు. మథుర ప్రజలు మరో సారి తన తల్లి గెలుపును కోరుకుంటున్నారని అన్నారు. మథుర యువతను కలిసి ఓటు వేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నట్లు తెలిపారు.


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో హేమమాలిని బిజీగా ఉన్నారు. మథుర లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి హేమమాలిని బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హేమమాలిని పోటీ చేశారు. ఆ సమయంలో ఆమె భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాడు.

ALSO READ: AmitShah assets : కారు లేదు, కాకపోతే ఆ మూడు..


బీజేపీ దేశంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల ఆమె 2019 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఈ సారి హేమమాలిని గెలుపు కోసం ఆమె కూమార్తెలిద్దరూ ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటుకు అధిక సంఖ్యలో 80 మంది ఎంపీలు ఉత్తరప్రదేశ్ నుంచే ఎంపిక కానుండగా..అందుకోసం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మథురలో ఏప్రిల్ 26న రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×