YCP Leaders: తమకు ఎదురు లేదనుకున్న వైసీపీ నేతలంతా ఊహించని పరాజయంతో నామ్ కే వాస్తేగా మిగిలారు. ఇటీవల వారు ఉనికి కాపాడుకోవాడానికి చేస్తున్న యత్నాలు సెల్ఫ్ గోల్‌లా మారుతుండటంతో మరింత ఢీలా పడిపోతున్నారంట. దాంతో నాయకులు నెక్ట్ స్టెప్ ఏమిటా అరి అలోచనలో పడ్డారంట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ సీనియర్లు చాలా మందే ఉన్నారు. అయితే ఒక్క పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు మినహా ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. ఆ క్రమంలో మిగిలిన సీనియర్లు తమ రాజకీయ మనుగడ కోసం నానాపాట్లు పడుతుంటే.. ఎక్కడికక్కడ సీన్ రివర్స్ అవుతూ తమ పన్నాగాలన్నీ బూమరాంగ్ అవుతుండటంతో వాట్ నెక్ట్స్ అని జుట్లు పీక్కుంటున్నారంట.
ప్రజా సమస్యలపై అందోళనలకు వెనకాడుతున్న వైసీపీ
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు గడ్డు సమస్య వచ్చిపడింది. ప్రజా సమస్యలపై అందోళనలకు దిగాలంటే గతంలో ఇదే సమస్యపై మీరేం చేసారనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయంట. జిల్లాలో టమోట ధరల పతనంతో పాటు మామిడి ధరల పతనంతో రైతులు ఇబ్బంది పడుతునా వాటి గురించి ఏమాత్రం ప్రశ్నించలేని పరిస్థితిలో జిల్లా వైసీపీ అగ్ర నేతలు ఉన్నారంట. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలపై నోరెత్తని సదరు నేతలు ప్రతిపక్ష నాయకులుగా దానిపై నోరెత్తలేక పోతున్నారంట.. దాని గురించి ఆందోళనలకు దిగితే ఎక్కడ రైతుల ప్రతిఘటనలు ఎదురవుతాయోనని సంశయిస్తున్నారంట.
తిరుమలలో అరాచకం జరిగిపోతుందని విమర్శలు
మరో వైపు తిరుమలలో అరాచకం జరిగిపోతుందని, రోజుకొక తప్పు జరిగిపోతుందని విమర్శలు గుప్పిస్తున్న తిరుపతి వైసీపీ నేతలకు మరింత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవ్వుతున్నాయంట .. గతంలో జరిగిన నమాజ్ ఇష్యూ , గోశాల ఇష్యూ, ఎపీఎస్‌పీ పోలీసుల మద్యం వ్యవహారాలన్నీ మరుగున పడేలా తాజా పరిణామాలతో అందరూ వైసీపీని తప్పుపట్టేలా తయారైందంట పరిస్థితి.. ముఖ్యంగా క్యూలైన్ లో వైసిపి నాయకుడు టీటీడీ వ్యతిరేక నినాదాలు చేయడం, వాటిని టీటీడీ ఉద్యోగి ఓకరు సెల్‌ఫోనులో చిత్రీకరించి వాటిని వైసీపీ సోషియల్ మీడియాకు అందించారు.
బహిరంగ క్షమాపణలు చెప్పుకున్న వైపీపీ నేత
అయితే కాసేపటికే క్యూలైన్లో హడావుడి చేసిన వైసీపీ నేత శ్రీవారి దర్శనం తర్వాత.. మీడియా ముందుకొచ్చి తాను పొరపాటు చేశాను అంటూ.. తనకు జ్వరం వచ్చినందున.. ఏదో ఫ్రస్టేషన్లో మాట్లాడానని .. అనవసరంగా ఎంతో పెద్ద మనిషి అయినా టీడీపీ చైర్మన్‌పై అనవసరంగా నోరు జారానని క్షమాపణలు చెప్పుకున్నారు. టీటీడీ సౌకర్యాలు అన్ని బాగున్నాయని, స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయిందని, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
క్యూలైన్ ఇష్యూపై మాట్లాడలేక పోతున్న వైసీపీ నేతలు
క్యూలైన్లో జరిగిన హడావుడిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయాలని చూసిన వైసీపీకి తమ పార్టీ నేత అలా సరెండర్ అవ్వడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంలో తిరుమల కొండపై చోటు చేసుకున్న ఘటనలు కూడా వైసీపీ ప్రమేయంతో జరిగినేనని కూటమి ప్రభుత్వం ఎండగట్టడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో క్యూలైన్ లో జరిగిన ఇష్యూ కు సమాధానం చెప్పలేక తిరుపతి వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడాల్సి వస్తోందంట. ఇక మాజీ మంత్రి రోజా నెలకు రెండు సార్లు తనకు ప్రోటోకాల్ ఉందంటూ దర్శనానికి రావడం, వచ్చినప్పుడల్లా ఎవరెవరితోనో వస్తుండటంతో అది కూడా వివాదంగా మారుతోంది.
తుమ్మలగుంట మైదానంపై చెవిరెడ్డి హడావుడి
తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరెడ్డి తుమ్మలగుంట చెరువును తుడా నిధులతో పూడ్చి అందులో వాకింగ్ ట్రాక్ తో పాటు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసారు. దీనికోసం తుడా నిధులు 60కోట్లు మేర ఖర్చు పెట్టారు. ప్రస్తుతం తుడా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్దం అయ్యింది. అయితే ఇక్కడ తుమ్మల గుంట మైదానాన్ని స్వాధీనం చేసుకోకూడదని తన గ్రామం పరిధిలో ఉంది కాబట్టి దీనిని పంచాయితీ నడపాలని తన గ్రామస్తులందరిని సమావేశపర్చి హడావుడి చేశారు.
సొంత జాగీరులా రచ్చ చేస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి
వాస్తవానికి చెవిరెడ్డి తన సొంత నిధులతో కాకుండా తుడా నిధులతో నిర్మించమే కాకుండా నిర్వహాణ సైతం తుడా నిధులతో జరుగుతున్నప్పుడు హాక్కులు సైతం తుడాకే వస్తాయి. కాని తన సొంత జాగీరు లాగా తన హక్కులు తనకే ఉండాలని అయన చేస్తున్న రచ్చతో ఆయన అభాసుపాలవుతున్నారు. ఈ వ్యవహారంలో త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్ ఎంటర్ అవుతుందని, చెరువును పూడ్చి ఏర్పాటు చేసిన మైదానాన్ని పూర్తిగా తీసివేసి యథావిధిగా చెరువును ఏర్పాటు చేసిన పక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. తుడా నిధులను ఇష్టానుసారం వాడుకున్న చెవిరెడ్డిపై చర్యలకు కూటమి సర్కారు పట్టుదలతో ఉందంటున్నారు.
పూర్తిగా డిఫెన్స్ లో పడిన పెద్దిరెడ్డి కుటుంబం
సీనియర్ నాయకుడు, జిల్లా వైసిపికి పెద్ద తలకాయ అయిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్యామీలీ కూడా పూర్తిగా డిఫెన్స్‌లో పడింది .. బుగ్గ మఠం భూములతో పాటు మదనపల్లి, మంగళంపేట భూముల ఆక్రమణ వ్యవహారంతో పెద్దిరెడ్డికి తలబొప్పి కడుతోందంట. దానికితోడు త్వరలో రాగానపల్లిలో 990 ఏకరాల భూముల ఆక్రమణపై చర్యలు మొదలవుతాయని అంటున్నారు. అసలు తనను ఏమి చేయలేరంటు పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి మీడియా ఎదుట బీరాలుపోవడంతో కూటమి నేతలు సీరియస్ అయినట్లు సమాచారం.
బెయిల్ కోసం కోర్టుకు వెళ్లి భంగపడిన మిథున్
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అటవీభూముల ఆక్రమణలపై సీరియస్ అయి కేసు నమోదు చేయించారు. తిరుపతిలోని బుగ్గమఠం భూముల ఇష్యూలో కూడా త్వరలో కేసు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. ఇక రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్‌స్కామ్ లో నాలుగో నిందితుడు కాగా బుక్ అయి బెయిల్ ప్రయత్నాల్లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి భంగపడ్డారు. ఎన్నికల సమయంలో కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని బీరాలు పలికిన పెద్దిరెడ్డి.. తాజా పరిణామాలతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారంట.
రోజాపై ఆడుదాం ఆంధ్ర, ఏపీఐఐసీ భూముల అవకతవకల ఆరోపణలు
మాజీ మంత్రి రోజాకు అడుదాం అంధ్రతో పాటు ఏపీఐఐసీ భూముల అవకతవకలు తలకు చుట్టుకుంటాయని భావించారు.. వాటిపై విచారణలు ప్రారంభమవుతాయన్న ప్రచారంతో ఆమె గత కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. మొదట్లో హాడావుడి చేసిన అమె ప్రస్తుతం కూటమి లోని కొంతమంది సహాకారంతో కేసు నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దానికి తోడు అమెను నగరి ఇన్చార్జి పదవి నుంచి తప్పించి మరొకరికి కట్టబెట్టడానికి పార్టీ అధిష్టానం సిద్దంగా ఉందంటున్నారు. అయితే తానే కాకుండా ఆడదాం అంధ్రాలో చాలామంది ప్రమేయం ఉందని, భవిష్యత్తులో వారు కూడా చిక్కుల్లో ఇరుక్కుంటామన్న భయంతోనే సైలెంట్ అయ్యారని ఆమె సన్నిహితుల వద్ద చెబుతున్నారంట.. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ కీలక నేతల పరిస్థితి అలా తయారైందిప్పుడు.
-Story By Apparao, Bigtv Live