BigTV English

Star Heroine: పిచ్చి పీక్స్ భయ్యా.. హీరోయిన్స్‌కి గుళ్లే కాదు.. ఊరు పేర్లు కూడా పెడుతున్నారు!

Star Heroine: పిచ్చి పీక్స్ భయ్యా.. హీరోయిన్స్‌కి గుళ్లే కాదు.. ఊరు పేర్లు కూడా పెడుతున్నారు!

Star Heroine: సాధారణంగా సినీ సెలబ్రిటీలకు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు తమ అభిమాన నటీనటులపై తమకున్న ప్రేమను చూపించుకోవడానికి ఏదేదో చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొంతమంది తమ అభిమాన నటీనటులకు గుడి కట్టి దేవుళ్ళుగా ఆరాధిస్తే.. ఇంకొంతమంది ఏకంగా వారి పేర్ల పైన ఊరినే సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ పేరు పైన కూడా ఊరు ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆ స్టార్ హీరోయిన్ గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతూ.. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల పక్కన బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది. ఒక సినిమా తర్వాత మరొక సినిమాలో అవకాశాన్ని అందుకుంది . యంగ్ హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. మరి ఆమె ఎవరు? ఆమె పేరు పైన ఉన్న ఊరు ఎక్కడ ఉంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..


త్రిష పేరు పైన ఊరు..

ఆమె ఎవరో కాదు ప్రముఖ సీరియల్ అందాల తార త్రిష. ఈమె పేరు పైనే ఇప్పుడు ఊరు కూడా ఉంది.. అది ఎక్కడో కాదు మన దేశంలోనే.. ఏంటీ హీరోయిన్ త్రిష పేరుతో ఓ ఊరు ఉందా? అది కూడా మనదేశంలోనా? ఇన్ని రోజులు తెలియలేదే అనుకుంటున్నారా?.. అవును అండీ.. మేము చెప్పింది.. మీరు చదివింది.. రెండూ నిజమే.. త్రిష పేరుపైన ఊరు ఉంది.. అది కూడా మనదేశంలోనే.. ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులే కాదు తన పేరు మీద ఊరు ఉంది అనే విషయం తెలిసి త్రిష కూడా ఆశ్చర్యపోయినట్లు సమాచారం. మరి ఇంతకీ త్రిష పేరు మీద ఉన్న ఆ ఊరు ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..


ఎక్కడ ఉందంటే?

త్రిష పేరుతో Vijayak Trisha అనే ఊరు ఉందట.ఇది కూడా మనదేశంలోనే ఉంది. ఎక్కడ అంటే..లడఖ్ లోని నుబ్రా లోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అయినటువంటి సియాచిన్ బేస్ క్యాంపు కి వెళ్లే మార్గమధ్యంలో Vijayak Trisha అనే ఊరు ఉంది.
అయితే ఈ విలేజ్ ని త్రిష అభిమాని అటుగా వెళుతున్న సమయంలో ఆ ఊరి బోర్డు ముందు నిల్చొని ఓ వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక ఈ వీడియో త్రిష దాకా చేరడంతో త్రిష కూడా ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఆశ్చర్యపోయింది.నా పేరు మీద కూడా ఓ ఊరు ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అయితే ప్రస్తుతం త్రిష పెట్టిన ఈ పోస్ట్ సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారడంతో త్రిష పేరు మీదే కాదు మీరు నిశితంగా గమనిస్తే త్రిష ఊరు పేరులో విజయ్.. అంటే త్రిష రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ పేరు కూడా ఉంది అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

త్రిష కెరియర్..

42 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తోంది త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది. ఓవైపు చిరంజీవి(Chiranjeevi) తో ‘విశ్వంభర’ మూవీలో నటిస్తూనే.. మరోవైపు తమిళ హీరో సూర్య(Suriya )సరసన ఒక కొత్త సినిమాలో నటిస్తోంది. ఇంకోవైపు మలయాళ నటుడు మోహన్ లాల్(Mohan Lal)తో కూడా చేస్తోంది. అలా ఒకేసారి మూడు సినిమాల్లో చేస్తూ యంగ్ హీరోయిన్ల కంటే ఎక్కువ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్ గా తమిళంలో అజిత్ (Ajith) తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మూవీతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా జూన్ 5న విడుదల కాబోతోంది. ఇలాంటి సమయంలో త్రిష పేరుతో ఒక ఊరు.. అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

also read:Kamal Haasan : ఈగో మ్యాటర్స్.. సారీ చెప్పకుండా హై కోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×