Big Stories

YS Family War in Kadapa: కుటుంబం.. అన్నగారి కుటుంబం!

YS Family War in Kadapa Latest News: వైఎస్ షర్మిలా.. అన్నపైనే బాణం ఎక్కుపెట్టింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డిని తన విమర్శలతో ఒక ఆట ఆడుటుకుంటోంది. అటు ఆగ్రహం ప్రదర్శిస్తూనే.. మరోవైపు కొంగుచాపి ఓట్లు అడుగుతూ సెంటిమెంట్‌ను తట్టిలేపుతున్నారు. మరి సొంతగడ్డపై షర్మిల పడుతున్న పాట్లు పనికివస్తాయా? ఆమె గెలుపు అవకాశాలేంటి? నిజంగానే అవినాష్‌ రెడ్డిని మార్చేస్తారా?

- Advertisement -

సీఎం జగన్ భయపడ్డాడు. తనను ఎదుర్కోలేక ఏకంగా కడప ఎంపీ అభ్యర్థినే మార్చేస్తున్నాడు. అవినాష్‌ రెడ్డే కాదు.. అభ్యర్థి ఎవరైనా గెలుపు నాదే. ఇది వైఎస్‌ షర్మిల చెబుతున్న మాట. మరి ఇది నిజంగా నిజమేనా? నిజం చెప్పాలంటే కడప ఎంపీ అభ్యర్థి మార్పుపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని తప్పించి.. వైఎస్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు వైసీపీ అధిష్టానం దీనిపై స్పందించలేదు. అవినాష్‌ రెడ్డి మాత్రం ప్రచారంలో దూసుకుపోతూనే ఉన్నారు.

- Advertisement -

కడప ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్‌ రెడ్డిని మార్చే అవకాశముంది. అయితే షర్మిలకు భయపడి అయితే కాదు. దానికి వేరే రీజన్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కూడా ఓ ప్రచారమే.. ఈ ప్రచార సారాంశం ఏంటంటే.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌ ముందుస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నారు. అయితే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా.. రీసెంట్‌గా దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే రెండు కోర్టుల్లోనూ విచారణ జరిగింది.

Also Read: సీఎం జగన్ పై దాడి ఘటన.. ఈసీ సీరియస్

ఈ రెండు పిటిషన్లకు సీబీఐ మద్ధతు కూడా తెలుపుతోంది. అవినాష్‌ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని చెబుతోంది సీబీఐ.. అవినాష్‌ కేసులోని సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటోంది సీబీఐ తనతో పాటు.. తన కుటుంబ సభ్యులను కూడా ప్రలోభ పెట్టడానికి చూస్తున్నారని దస్తగిరి అంటున్నాడు. తెలంగాణ హైకోర్టులో ఈ నెల 14న విచారణ జరగనుంది. కోర్టు తీర్పు అవినాష్‌కు అనుకూలంగా రాకపోతే? ఈ క్వశ్చనే అభ్యర్థి మార్పు ప్రచారానికి బలం చేకూరుస్తోంది. దీనిని తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు షర్మిల.

అంతేకాదు కడప ప్రజల మనసులు దోచుకునేందుకు వైఎస్‌ఆర్ పేరును పదే పదే వాడుతున్నారు షర్మిల.. మాటకు ముందోసారి వైఎస్‌ఆర్ బిడ్డను అని చెబుతున్నారు. అంతేకాదు కొంగుచాపి అడుగుతున్నాను. దయచేసి ఓట్లు వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు షర్మిల.. అయితే కడప ఎంపీ ఎన్నిక ప్రచారం మొత్తం వైఎస్ కుటుంబం చుట్టే తిప్పుతున్నారు షర్మిల ముఖ్యం వివేకా హత్య కేసును హైలెట్ చేస్తున్నారు. హత్య చేసిన వారు, దానికి మద్ధతిచ్చినవారు అంటూ పదే పదే చెబుతున్నారు షర్మిల. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా.. వైఎస్ కుటుంబం నుంచే షర్మిలకు షాకిచ్చేందుకు రంగంలోకి దిగారు ఆమె మేనత్త.. అంటే వివేకా చెల్లెలు విమలా రెడ్డి.. ఆమె ఎలాంటి కామెంట్స్ చేశారో చూడండి.

Also Read: మా మేనత్త అందుకే జగన్‌కు సపోర్ట్ చేస్తోంది : వైఎస్ షర్మిల

కుటుంబ విషయాలపైనే ఫోకస్ చేస్తున్న షర్మిలకు.. అదే కుటుంబ సభ్యులతోనే కౌంటర్లు ఇప్పిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంటి పరువును షర్మిల బజారుకీడుస్తున్నారని బహిరంగంగానే విమర్శిసస్తున్నారు. మరోవైపు విజయమ్మ ఇప్పటికే అమెరికాకు వెళ్లిపోయారు. ఇటు కొడుకు, అటు కూతురు.. ఇద్ధరి మధ్య నలిగిపోవడం కంటే.. అదే బెటరన్న ఆలోచన కావచ్చు ఆమెది. ఏదేమైనా ప్రస్తుతం షర్మిల ప్రచారం మొత్తం కుటుంబం చుట్టూనే తిరుగుతోంది.

షర్మిలకు భిన్నంగా వైసీపీ ప్రచారం చేస్తుంది. సంక్షేమ మంత్రాన్ని పఠిస్తోంది. ఇటీవల షర్మిల ప్రచారం నిర్వహిస్తుండగా.. ఓ యువకుడు ఏకంగా జగన్‌కు ఎందుకు ఓటు వేయాలో ఆమె ముందే చెప్పాడు.. కానీ ఆ తర్వాత కూడా షర్మిల మాటలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు.. ఏదేమైనా కడప ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. సంక్షేమ నామాన్ని జపిస్తున్న వైసీపీకి ప్రజలు ఓటేస్తారా? లేక సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వారు. ప్రజలకు ఏం చేయగలరు? అన్న షర్మిల ప్రశ్నకు ప్రజలు కనెక్ట్ అవుతారా? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News