Big Stories

Male Menopause: మగాళ్లకు మెనోపాజ్.. ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా..?

Menopause For Men! Do you know The Symptoms: మోనోపాజ్.. మహిళల్లో సర్టెన్ ఏజ్ వచ్చాక హార్మోన్స్‌లో వచ్చే Imbalance కు పేరు. లైక్ ఈస్ర్టోజెన్,ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్స్‌ ఉత్పత్తి తగ్గడంతో మహిళలు మోనోపాజ్‌ స్టేజ్‌కు ఎదుర్కోవాల్సి వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే వారికి పిరియడ్స్ రావడం ఆగిపోతాయి. దీంతో వారి బాడీస్‌లో చాలా చేంజెస్‌ వస్తాయి. సాధారణంగా ఇది 45 నుంచి 50 దాటిన మహిళల్లో కనిపిస్తుంది. బట్ మగవాళ్లలో కూడా మోనోపాజ్ స్టేజ్ ఉంటుందని తెలుసా? వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మీకు తెలుసా?  మగవాళ్లకు కూడా మోనోపాజ్ స్టేజ్ ఉంటుందని ఇప్పుడు గుర్తించారు డాక్టర్స్.. ఆ డీటెయిల్స్‌ ఏంటో చూద్దాం.

- Advertisement -

టెస్టోస్టెరాన్ .. మగవారిలో ఈ హార్మోన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. లైక్.. లిబిడో, Mussle వెయిట్‌తో పాటు.. స్పెర్మ్‌ కౌంట్‌ను కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్.. అంతేకాదు.. బోన్స్‌ హెల్తీగా ఉండాలన్నా. బ్లడ్ సర్క్యూలేషన్ సరిగా జరగాలన్న టెస్టోస్టెరాన్ చాలా అవసరం. సో మగవారిలో వయసు పెరుగుతున్న కొద్ది టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గిపోతుంది అనేది ఇప్పుడు డాక్టర్స్‌ కనుగొన్నారు. ఈ స్టేజ్‌కు ఆండ్రోపాజ్ అని నామకరణం చేశారు. మరి ఇది మగవారిలో ఎప్పుడు స్టార్టవుతుంది.? మినిమం 40 ఇయర్స్‌.. మాగ్జిమమ్ 70 ఇయర్స్.. ఇది స్టార్టయ్యే మగవారిలో స్టార్టయ్యే స్టేజ్.

- Advertisement -

Also Read: గుండెపోటు వస్తుందనే భయంగా ఉందా.. అయితే జాగ్రత్త!

సహజంగా వయసుతో పాటు వచ్చే స్టేజ్ ఇది. అయితే మహిళల్లో మోనోపాజ్ వచ్చినంత వేగంగా మగవారిలో రావడం లేదు. చాలా స్లోగా ఈ విషయం బయటపడుతుంది. దీనికి అనేక లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఫోకస్ చేయలేకపోవడం.. చిన్న పనికే అలసిపోవడం..
శక్తి, బలం కోల్పోవడం.. మసిల్ వెయిట్ పడిపోవడం, బరువు పెరగడం. యాంక్సైటీ, డిప్రెసన్‌కు గురవ్వడం.. మూడ్ స్వింగ్స్. లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం.. ఇలా కొన్ని సింప్టమ్స్‌ కనిపిస్తాయి. ఇలా కనిపించిన వెంటనే వెంటనే టెస్టోస్టెరాన్‌కు సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోవాలి.. ఒకవేళ ఈ టెస్ట్‌లో హార్మోన్‌ తగ్గిందని తేలితే వెంటనే HRD పద్ధతిలో ట్రీట్‌ చేసే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైమ్.. మన లైఫ్‌ స్టైల్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

అయితే ఈ సింప్టమ్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. వాటి తీవ్రతలోనూ మార్పు ఉంటుంది. మగవారిలో కొంచెం మేల్ ఈగో ఉంటుంది. ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే ఏదో లోపం ఉందని అనుకుంటారని ఫీల్ అవుతారు. అందుకే ఇలాంటి విషయాలను డిస్కస్ చేసేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే ఇన్నాళ్లు ఈ విషయం బయటపడలేదంటున్నారు డాక్ట్రర్స్.. మోనోపాజ్ ఆర్ ఆండ్రోపాజ్ పేరు ఏదైనా.. ఇలాంటి ఒక స్టేజ్ ఉంటుందని కూడా చాలా మంది మగవారికి ఇప్పటికీ కూడా తెలీదు. అయితే దీన్ని గుర్తించడం కూడా కొంచెం కష్టమే.. ఎందుకంటే మహిళల్లో పిరియడ్స్ ఆగిపోవడంతోనే మోనోపాజ్ స్టేజ్‌ను ఐడెంటిఫై చేయవచ్చు. బట్ మగవారిలో అలా కాదు.. చాలా సంవత్సరాలు పడుతుంది. ఇదంతా బయటపడటానికి.. 40 ఏళ్ల నుంచి ప్రతి ఏడాదికి టెస్టోస్టెరాన్ లెవల్స్‌ వన్ పర్సెంట్ పడిపోతాయంట. ఇది 10 నుంచి 25 శాతానికి పడిపోతేనే హార్మోన్ కౌంట్ తక్కువగా ఉందని కన్సిడర్ చేస్తారు. అందుకే దీన్ని గుర్తించడం కష్టమవుతుంది.

Also Read: Undi Constituency: ఉండి.. రాజుల్లారా ఉండండి..

ఈ రోజుల్లో మితిమీరిగా మనం వాడుతున్న ట్యాబ్లెట్స్ కావొచ్చు.. జంక్ ఫుడ్ కావచ్చు.. ఇలా రీజన్ ఏదైనా.. మేల్ మోనోపాజ్ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. సో ఇది మన లైఫ్‌ స్టైల్ వచ్చిన ప్రాబ్లమా లేదా..హార్మోన్‌ కౌంట్ తగ్గిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమా అని గుర్తించడం కొంచెం కష్టం..
అందుకే మగవారిలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్‌లు చేయించుకోవడం ఉత్తమం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆడవారందరికి మోనోపాజ్ స్టేజ్ ఉంటుంది. కానీ మగవారి విషయానికి వచ్చే సరికి ఇది ఆప్షనల్.. అందుకే మోనోపాజ్‌ను, ఆండ్రోపాజ్‌ను కంపేర్ చేయడం సరికాదు. మెయిన్‌గా డయాబెటిస్, ఓబెసిటీ మగవారి కొంపముంచుతాయని.. అందుకే బాడీని ఎప్పటికప్పుడు హెల్తీగా, ఫిట్‌గా ఉంచడం అవసరమని సూచిస్తున్నారు డాక్టర్స్.. అయితే షాకింగ్ విషయమేమిటంటే.. ఈ మధ్య మధ్య వయసు వారిలో కూడా ఈ లక్షణాలు కనిపించడం.. కాస్త కలవరపెట్టే విషయం.

మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకోవాలి.. పండ్లు, కూరగాయలకు ప్రియారిటీ ఇవ్వాలి. ప్రతిరోజూ నడక, స్మాల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. సరిగ్గా నిద్రపోవాలి.. స్ట్రెస్‌కు దూరంగా ఉండాలి. ఇవన్నీ ఇప్పటికే ఆండ్రోపాజ్‌కు చేరిన వారికి హెల్ప్ చేస్తాయి..
యంగ్ ఏజ్‌లో ఉన్నవారికి రాకుండా చేస్తాయి. సో మగవారు.. వింటున్నారా.. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే.. తర్వాత బాధపడటం తప్ప చేసేదేం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News