Big Stories

Sharmila Comments on Vimala : మా మేనత్త అందుకే జగన్‌కు సపోర్ట్ చేస్తోంది : వైఎస్ షర్మిల

Sharmila Comments on Vimala Reddy(Andhra politics news): ఏపీ పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డి కడప జిల్లాలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం ప్రచారంలో.. ఆమె మేనత్త విమలారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విమలమ్మ కుటుంబం ఆర్థిక బలపడటానికి జగన్ సహాయం చేశారని, సీఎం జగన్ ఆమె కుమారుడికి ఇచ్చిన పనులతో ఆర్థికంగా బలపడ్డారన్నారు. అందుకే ఆమె జగన్ కు సపోర్ట్ చేస్తుందన్నారు.

- Advertisement -

సొంత అన్నయ్య హత్యకు గురైతే.. న్యాయం కోసం పోరాడకుండా.. ఇలా మద్దతు ఇవ్వడాన్ని షర్మిల తప్పుబట్టారు. హత్యకు గురైంది రక్తం పంచుకున్న సోదరుడని గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. బహుశా వయసు మీద పడటంతో ఆమె ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని షర్మిల అన్నారు. తన చిన్నాన్న వివేకానందదరెడ్డి.. విమలమ్మకు చేసిన మేలు ఆమె మరచిపోయారని వాపోయారు.

- Advertisement -

Also Read : వైసీపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

అనంతరం సున్నపురాళ్లపల్లిలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. వివేకానంద రెడ్డి హత్య విషయంలో తాము ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. హత్యకు సంబంధించిన ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టే అంత గట్టిగా చెబుతున్నామన్నారు. తమ కుటుంబంతో పాటు.. రాష్ట్రప్రజలకు మరోసారి అన్యాయం జరగకూడదని, హత్యారాజకీయాలు ఆగాలనే అక్కాచెల్లెళ్లిద్దరం పోరాడుతున్నామన్నారు.

తనకు భయపడే కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ ను మారుస్తున్నారని షర్మిల అన్నారు. జగన్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నారని, అందుకు కారణం వివేకా హత్యకేసులో అవినాష్ పై చేసిన ఆరోపణలేనని కూడా చెప్పుకొచ్చారామె. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ ను మారిస్తే.. వివేకాను హత్యచేసింది అవినాషే అని జగన్ ఒప్పుకున్నట్లేనా ? అని ప్రశ్నించారు.

కాగా.. షర్మిల, సునీతలపై మేనత్త విమలమ్మ విరుచుకుపడ్డారు. కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. తాను కూడా వైఎస్ కుటుంబ ఆడపడుచునేనన్న ఆమె.. అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డిని చంపుతుంటే వాళ్లిద్దరూ చూశారా ? అని ప్రశ్నించారు. నిజానికి వివేకాను చంపిన నిందితులు బయట తిరుగుతున్నారని.. జగన్ కు దీంతో సంబంధం లేకపోయినా ఇందులోకి తీసుకురావడం బాధగా ఉందన్నారు. వ్యక్తిగత కక్షతోనే వాళ్లిద్దరూ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. ఇకనైనా అక్కచెల్లెళ్లిద్దరూ నోరుమూసుకుంటే మంచిదని సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News