BigTV English

Kodela Siva Prasad Incident: రసకందరాయంలో రంజి మ్యాచ్.. కోడెలపై కుట్ర ఇవిగో నిజాలు!

Kodela Siva Prasad Incident: రసకందరాయంలో రంజి మ్యాచ్.. కోడెలపై కుట్ర ఇవిగో నిజాలు!

Kodela Siva Prasad Incident: కర్మ ఎవరినీ వదిలి పెట్టదు. కాకుంటే కాస్త టైం తీస్కోవచ్చు. మిగిలినదేదీ మిల్లీ మీటర్ కూడా తేడా ఉండదు అనడానికో మంచి ఉదాహరణ. అప్పట్లో తప్పుడు కేసులు. ఇప్పుడు తూచ్ అంటూ ప్లేటు ఫిరాయింపులు. దీంతో ఓ కీలక నేత బలవన్మరణానికి పాల్పడ్డ వైనం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇదే చర్చనీయాంశం. ఇంతకీ ఏంటా తప్పుడు కేసు.. ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది? ఆ వివరాలేంటో తెలియాలంటే.. మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..


2019లో కోడెల, ఆయన కుమారుడిపై మాజీ రంజీ క్రికెటర్ కేసు

ఈ రంజీ మ్యాచ్ మరింత రంజుగా మారడం ఖాయమన్న గుసగుసమాజీ స్పీకర్ కోడెల శివప్రాదరావు.. పల్నాటి పులిగా పేరు. కానీ తనపై పెట్టిన కేసుల ఒత్తిడి తాళలేక.. బలవన్మరణం పాలైన ఘటన అందరికీ తెలిసిందే. అవి 2019 లో టీడీపీ ఓడిన కాలం నాటి రోజులు. రైల్వేలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని.. కోడెల, ఆయన కుమారుడు శివరామ్ తన నుంచి 15 లక్షల రూపాయల లంచం తీస్కున్నారని ఫిర్యాదు చేశాడు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు. నరసరావు పేట టూ టౌన్ పోలీసులు ఈ దిశగా కేసు నమోదు చేశారు. గత కొంత కాలంగా ఈ కేసు విషయమై దర్యాప్తు జరుగుతోంది కూడా.


తాజాగా లోక్ అదాలత్ ని ఆశ్రయించిన మాజీ క్రికెటర్ నాగరాజు

అయితే ఇదే కేసు విషయంలో.. తాజాగా నరసరావు పేట కోర్టుకు హాజరైన నాగరాజు.. లోక్ అదాలత్ ని ఆశ్రయించారు. కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు శివరాంపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుంటున్నానని బాంబు పేల్చాడు. ఆనాడు తానీ కేసు పెట్టడం వెనక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని.. అనడంతో.. ఈ బాంబు ఎక్కడ పేలాలో అక్కడ పేలినట్టు చెప్పుకుంటున్నారు నరసనావు పేట వాసులు. ఆంధ్రా క్రికెట్ జట్టులో ఆడనివ్వరేమో అన్న భయంతోనే తాను కోడెల, ఆయన కుమారుడిపై కేసు పెట్టాననీ.. నాగరాజు అనడంతో.. ఇపుడీ వ్యవహారం అటు దిరిగి ఇటు దిరిగి.. గోపి రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

క్రికెటర్ నాగరాజు వేసిన గుగ్లీకి.. గోపిరెడ్డి అడ్డంగా బుక్?

అదెలా సాధ్యమని చూస్తే.. విజయసాయిరెడ్డి.. ఎలాగూ రాజకీయాల నుంచి తప్పుకున్నారు కాబట్టి.. ఆయనకంటూ రాజకీయంగా వచ్చే ఇబ్బంది లేదు. దానికి తోడు ఆయన ఈ ప్రాంతానికి నాన్ లోకల్. అదే గోపిరెడ్డి అలాక్కాదు. ఇంకా ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన వాడు. దీంతో మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు వేసిన గుగ్లీకి.. గోపిరెడ్డి అడ్డంగా బుక్ అయిపోయాడని మాట్లాడుకుంటున్నారు స్థానికులు.

తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీస్కోవాలి- లోకల్ టీడీపీ

ఇదే అదనుగా భావించిన.. స్థానిక టీడీపీ వర్గాలు.. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీస్కోవాలని.. పోలీసులను ఆశ్రయించారట. దీంతో.. లోకల్ వైసీపీ లీడర్ల గుండెల్లో గుబులు చెలరేగుతోందట. కర్మ ఎవరినీ వదిలి పెట్టదన్న సిద్ధాంతాన్ని బట్టీ చూస్తే.. పెద్దాయన్ని వీరిలా చిత్ర వధ చేయబట్టే.. ఆనాడాయన ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఆ పాపం నేడిలా వెంటాడుతోందని అంటున్నారట తెలుగు తమ్ముళ్లు.

తమ అధినేత క్రేజ్ ఇంకా తగ్గలేదనుకుంటే.. ఇదెక్కడి రివర్స్ కేస్- వైసీపీ ఫీలింగ్

ఇటీవల నరసరావు పేట ఒక డిగ్రీ కాలేజీ ఫంక్షన్లో తమ అధినేత పేరెత్తగానే స్టూడెంట్స్ నుంచి వచ్చిన అనూహ్య స్పందనకు తబ్బి ఉబ్బి అవుతున్న స్థానిక వైసీపీ నేతలకు.. ఈ తరహా రివర్స్ స్వింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో.. మైండ్ బ్లాక్ అవుతోందట. తమ అధినేత క్రేజ్ ఇంకా తగ్గలేదని చెప్పుకోడానికి.. తమ ప్రాంతం వేదికైందని సంతోషించేలోపు.. ఈ కేసు ఇలా రివర్స్ కావడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదట.. నరసరావుపేట వైసీపీ నాయకులకు.

నరసరావుపేట వైసీపీకిది గట్టి దెబ్బ?

విజయసాయి రెడ్డి ఎలాగూ రాజకీయాల నుంచి పర్మినెంట్ రిటర్మైంట్ ప్రకటించేశారు. అదే గోపిరెడ్డి పరిస్థితి అలాక్కాదు. ఇవాళ ఓడినా- రేపు తన రాజకీయ భవిష్యత్తు గ్యారంటీ అనుకున్న ఈ వైసీపీ నేత.. టోటల్ గా బుక్ అయిపోయినట్టు భావిస్తున్నారు. ఉన్నట్టుండి నాగరాజు కోర్టుకు వచ్చి అప్పట్లో తాము కోడెలపై పెట్టిన కేసు తప్పుడుదని. దీని వెనక వైసీపీ నాయకులున్నారని తేల్చడంతో.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందట గోపిరెడ్డికి. కోడెల శివప్రసాద్ అంటే ఈ ప్రాంత వాసుల మనోభావం. అలాంటి నేతపై వీరు ఆనాడు అక్రమ కేసులు బనాయించారని తెలిస్తే.. పుట్టగతులుండవని,. ఇప్పుడేం చేయాల్రా భగవంతుడా అంటూ.. గజగజటాడుతున్నారట గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఇప్పటికే పల్నాడులో పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. దీనికి తోడు.. ఈ పాత గాయం కూడా తిరగతోడటంతో.. ముచ్చెమటలు పడుతున్నాయట గోపిరెడ్డికి.

ఈ రంజీ మ్యాచ్ మరింత రంజుగా మారడం ఖాయమన్న గుసగుస

ప్రస్తుతం మలుపు తిరిగిన ఈ పరిణామంతో.. నరసరావు పేట రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయట. మాజీ స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు శివరామ్ లపై నమోదైన కేసులో ఈ కొత్త ట్విస్ట్ వెలుగు చూడ్డంతో.. ఇక్కడి రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారనున్నాయట. టోటల్ గా నరసరావు పేట వైసీపీకిది గట్టి దెబ్బగానే ఫీలవుతున్నారట. ఈ కేసు విషయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. మరెంతగా ఇరకాటంలో పడతారో వెయిట్ అండ్ సీ అంటున్నారు స్థానికులు. ఇప్పుడే టాస్ పడింది. ఇక రంజీ మ్యాచ్ మరింత రంజుగా మారే అవకాశాలు లేక పోలేదని గుసగుసలాడుతున్నారట.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×