OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు చూడటానికి కొంతమంది ప్రేక్షకులు భయపడతారు. వాళ్లు చేసే హింస దయ్యాలు కూడా చేయవు. అంతలా ఈ సైకోల హింస ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో, ఒక సైకో అమ్మాయిని బంధించి తనకు నచ్చిన రీతిలో ఎంజాయ్ చేస్తాడు. ఆ అమ్మాయి తప్పించుకోవడానికి అతనితో ప్రేమలో పడ్డట్టు నటిస్తుంది. చివరి వరకు ఎంగేజింగ్ గా ఉండే ఈ మూవీని, నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బిలీవ్ మి: ది అబ్డక్షన్ ఆఫ్ లిసా మెక్‌వే’ (Believe Me : The Abduction of Lisa Mc Vey). ఈ మూవీకి జిమ్ డోనోవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబర్ 30, 2018న థియేటర్లలో విడుదలైంది. జూన్ 4, 2021న, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో కేటీ డగ్లస్, రోసిఫ్ సదర్లాండ్, డేవిడ్ జేమ్స్ ఇలియట్ నటించారు. ఈ మూవీ 1984లో సీరియల్ కిల్లర్ బాబీ జో లాంగ్ చేత అపహరించి, 26 గంటల పాటు అత్యాచారం చేసిన లిసా మెక్‌వే నిజమైన స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ 1984లో బాబీ జో లాంగ్‌ను అరెస్టు చేసిన అదే థియేటర్‌లో థియేట్రికల్ స్క్రీనింగ్‌ను కూడా పొందింది. ఈ సినిమా ప్రదర్శనకు నిజమైన లిసా మెక్‌వే కూడా హాజరయ్యారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
లిసా ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆమెని ఎవరో కారులో ఫాలో చేస్తూ ఉంటారు. అయితే ఆరోజు ఆమె తప్పించుకుని ఇంటికి వెళ్తుంది. ఇంట్లో బామ్మ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు లిసా పై కన్ను వేయడంతో డబ్బు కోసం ఆమెను వాడికి గదిలోకి పంపుతుంది బామ్మ. నిజానికి ఈ పని ఇష్టం లేకపోయినా లిసా అతనితో పడుకుంటుంది. మరుసటి రోజు కూడా డ్యూటి ముగించుకొని వస్తుంటే, అదే కారులో ఒక వ్యక్తి ఫాలో అవుతూ ఉంటాడు. ఈసారి వాడు ఆమెను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఒక గదిలో బంధించి తనకు నచ్చిన విధంగా ఆమెతో ఎంజాయ్ చేస్తుంటాడు. వాడు ఒక సైకో అని గ్రహించి వాడు చెప్పినట్లే నడుచుకుంటూ ఉంటుంది లీసా. కళ్లకు గంతలు కట్టడంతో వాడు ఎలా ఉంటాడో కూడా ఆమెకు తెలియకుండా పోతుంది. అతని రూపాన్ని తాకుతూ ఇమేజిన్ చేసుకుంటుంది లిసా .
తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో అతన్ని ప్రేమించినట్టు నటిస్తుంది. రొమాన్స్ కూడా అతనికి నచ్చినట్టే చేస్తుంది. సైకో మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆమెను చంపాలనుకుంటాడు. చివరికి లిసా మాటలకి లొంగిపోయి, ఆమెను చంపకుండా వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు సమాచారం ఇస్తుంది. అయితే పోలీసులు ఆమె చెప్పేదంతా కట్టు కధ అని కొట్టిపారేస్తుంటారు. ఎందుకంటే ఆమెపై అఘాయిత్యం చేస్తే గాయం ఒక్కటి కూడా ఉండదు. అందుకు ఆమె తుపాకీ తో బెదిరించడం వల్లే ఆ పని చేశానని అంటుంది. తను సైకో ఎలా ఉంటాడో ఊహించుకున్న రూపాన్ని కూడా గీస్తుంది. చివరికి పోలీసులు ఆ సైకోని పట్టుకుంటారా? బామ్మ మనవరాలితో మళ్లీ అటువంటి పనులు చేపిస్తుందా? ఈ విషయాలకు తెలుసుకోవాలనుకుంటే, ‘బిలీవ్ మి: ది అబ్డక్షన్ ఆఫ్ లిసా మెక్‌వే’ (Believe Me : The Abduction of Lisa Mc Vey) అనే ఈ మూవీని చూడాల్సిందే.