OTT Movie : రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక తమిళ్ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ మూవీ అదరగొడుతోంది. ఫ్యామిలీ కష్టాలతో, కామెడీని జత చేసి ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. పెద్దలను ఎదిరించి, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట, తర్వాత పడే ఫ్యామిలీ కష్టాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జీ 5 (Zee 5) లో
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘కుటుంబస్థాన్’ (Kudumbasthan). 2025లో విడుదలైన ఈ తమిళ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీకి రాజేశ్వర్ కాళీసామి దర్శకత్వం వహించారు. దీనిని సినిమాకరణ్ కింద S. వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో కె. మణికందన్, సాన్వే మేఘన ప్రధాన పాత్రలు పోషించగా, ఆర్. సుందర్‌రాజన్, గురు సోమసుందరం, కుదస్సనాద్ కనకం, నివేదిత రాజప్పన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంగీతం: వైసాగర్, సినిమాటోగ్రఫీ: సుజిత్ ఎన్. సుబ్రమణ్యం, ఎడిటింగ్: కన్నన్ బాలు అందించారు. ‘కుటుంబస్థాన్’ 24 జనవరి 2025న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా రికార్డ్ కి ఎక్కింది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
నవీన్, వెన్నెల ప్రేమించుకొని, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ పెళ్లి పెద్దలకు ఏ మాత్రం ఇష్టం లేకపోవడంతో, సపరేట్ గా ఉంటూనే లైఫ్ స్టార్ట్ చేస్తారు ఈ జంట. నవీన్ ఒక కంపెనీలో మార్కెటింగ్ జాబ్ చేస్తాడు. మరోవైపు వెన్నెల ఇంట్లోనే ఉంటూ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అయితే కొద్ది రోజులకే నవీన్ పేరెంట్స్ వీరి పెళ్ళికి రాజీ పడతారు. అలా నవీన్ తన భార్యను ఇంటికి తెస్తాడు. కొద్దిరోజుల్లోనే తన చెల్లికి కూడా పెళ్లి జరిగిపోతుంది. ఈమె భర్త రాజేందర్ కి డబ్బు బాగా ఉండటంతో నవీన్ ను ఎగతాళి చేస్తుంటాడు. ఆ తరువాత నవీన్ కి జాబ్ కూడా పోతుంది. భార్య ప్రెగ్నెంట్ కూడా కావడంతో కష్టాలు మొదలవుతాయి. సంపాదన లేక ఇంటిలో ఖర్చులు పెరిగిపోవడంతో అప్పులు కూడా చెయ్యాల్సి వస్తుంది. తాను ఎంతగానో ఇష్ట పడే కారును కూడా అమ్మి, అతి కష్టం మీద అప్పులను తీరుస్తూ వస్తాడు. ఉద్యోగం పోయిందన్న విషయం ఇంట్లోకి చెప్తే బాధపడతారని చెప్పడు. కొద్దిరోజులకి ఈ విషయం కూడా ఇంట్లో వాళ్లకి తెలిసి నవీన్ ని మందలిస్తారు. ఆ తర్వాత నవీన్ ఒక బేకరీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అందులో కూడా ఇతనికి నష్టాలు వస్తాయి. మరోవైపు ఇతని చెల్లెలు భర్త ప్రవర్తనతో విసిగిపోయి, విడాకులు ఇవ్వాలని అనుకుంటుంది. ఇంటి దగ్గరే ఉంటూ నవీన్ కి మరింత భారం పెంచుతుంది. చివరికి నవీన్ కష్టాలు తీరుతాయా? నవీన్, వెన్నెల సంతోషానికి అద్భుతాలు ఏమైనా జరుగుతాయా ? చెల్లి భర్తలో మార్పు వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘కుటుంబస్థాన్’ (Kudumbasthan) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.