BigTV English

YSRCP On Allu Arjun Arrest: దొరికిందే ఛాన్స్ అనుకుంటున్న వైసీపీ.. అల్లు అర్జున్‌ని అస్త్రంలా వాడుకుంటున్నారా?

YSRCP On Allu Arjun Arrest: దొరికిందే ఛాన్స్ అనుకుంటున్న వైసీపీ.. అల్లు అర్జున్‌ని అస్త్రంలా వాడుకుంటున్నారా?

YSRCP On Allu Arjun Arrest: దొరికిందే ఛాన్స్ అంటున్నారు వైసీపీ నేతలు. నాడు అధికారంలో ఉన్నప్పడు సినిమా టికెట్ రేట్ల వ్యవహారం, సినీ పెద్దలతో మీటింగ్ విషయాల్లో విమర్శలను ఎదుర్కొంది వైసీపీ. ఆ ఎఫెక్ట్ తోనే జగన్ సర్కారుకి, టాలీవుడ్‌కి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని ఓపెన్ కామెంట్స్ వచ్చాయి. వైసీపీ లోని పలువురు ప్రముఖులు సైతం నాటి ప్రతిపక్ష పార్టీలపై చెలరేగి మాట్లాడడం కూడా కూడా మరి కొంత గ్యాప్ క్రియేట్ చేసింది. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో మాత్రం దొరికిన ఛాన్స్ వాడుకోవాలని చూస్తున్నారు వైసీపీ నేతలు.. ఆ మ్యాటర్ ఏంటో.. వాచ్ థిస్ స్టోరీ


దొరికిందే ఛాన్స్ అనుకుంటున్న వైసీపీ

దక్కిందే దక్కుదల.. దొరికిందే ఛాన్స్ ఇప్పుడు ఇవే డైలాగ్ లు వైసీపీకి బాగా సెట్ అవుతాయని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాభవం. ఓ వైపు నేతల రాజీనామాలు, వలసల పర్వం. మరోవైపు నాయకులకు కేసుల టెన్షన్. ఇవే కాకుండా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పట్టించుకోని నాయకులు.. ఉన్న నాయకుల్లో నడిపించే వారు లేక దిక్కుతోచని స్థితిలో ఫ్యాన్ పార్టీ క్యాడర్. ఇంతా జరుగుతున్నా ఏ మాత్రం తీరు మార్చుకొని అధినేత వైఎస్ జగన్. ఈ గడ్డు కాలంలో దొరికిందే ఛాన్స్ అనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇంతకీ ఆ ఛాన్స్ ఏంటో కాదు. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్.


సినిమా టికెట్ రేట్లు, సినీ పెద్దలతో మీటింగ్..

అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్ల వ్యవహారం, సినీ పెద్దలతో మీటింగ్ విషయాల్లో విమర్శలను ఎదుర్కొంది వైసీపీ. ఆ ఎఫెక్ట్ తోనే జగన్ సర్కారుకి, టాలీవుడ్ కి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని ఓపెన్ కామెంట్స్ వచ్చాయి. వైసీపీ లోని పలువురు ప్రముఖులు సైతం నాటి ప్రతిపక్ష పార్టీలపై చెలరేగి మాట్లాడడం కూడా కూడా మరి కొంత గ్యాప్ క్రియేట్ చేసింది. కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ నుంచి లోకల్ లీడర్ల వరకూ ఓన్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.

దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా అల్లు అర్జున్ అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ మ్యాటర్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారంలోనే వైసీపీ నేతలంతా ఆయన అరెస్టును ముక్త కంఠంతో ఖండించారు. మాజీ సీఎం జగన్ నుంచి లోకల్ లీడర్లు, కార్యకర్తలు సైతం ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు. చంద్రబాబు, పవన్‌ను ట్రోల్ చేశారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా టీడీపీ, జనసేన వైపు ఉందన్న టాక్‌ నడుస్తోంది. అందుకే అల్లు అర్జున్‌ను పావుగా వైసీపీ వాడుకోవాలనుకుంటోందా.. అని ఇప్పుడు చర్చ నడుస్తోంది.

Also Read: క్రెడిట్ ఫైట్..! అల్లు అర్జున్‌కు బెయిల్ రావడంపై రెండు వర్గాల కొట్లాట

పుష్ప 2 రిలీజ్ సమయంలో జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలు

నంద్యాల వైసీపీ అభ్యర్ధి శిల్పా రవికి మద్ధతుగా అల్లు అర్జున్ వెళ్లడం నుంచి మొదలైంది.. వైసీపీతో ఆయన అనుబంధం. అప్పటి నుంచి మొదలైన.. ఫ్యాన్ పార్టీతో పుష్పా రాజ్ రిలేషన్.. ఆ తర్వాత స్పీడు పెంచుతూ వెళ్లింది. మరీ ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ సమయంలో.. జగన్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలియటంతో ఫ్యాన్ పుష్పా రిలేషన్ పీక్ స్టేజ్ కి చేరింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సీన్ కూడా సేమ్ టు సేమ్ కావడంతో ఇదంతా అభిమానుల పనయ్యుంటుందిలే అనుకున్నారు. కానీ ఈ వ్యవహారంలో మాత్రం డెప్త్ వేరేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ పై నిత్యం కామెంట్స్ చేసిన మాజీ సీఎం

తమది పెత్తందార్ల ప్రభుత్వం కాదు పేదల ప్రభుత్వమంటూ తన పాలనాకాలమంతా ప్రచారం చేశారు జగన్. కానీ ఇప్పుడు అనూహ్యంగా బాధితురాలి కుటుంబం వైపు నిలబడకుండా.. ఘటనకు కారణమైన అల్లు అర్జున్ వైపు జగన్ స్టాండ్ తీస్కోవడంతో అంతా షాక్ అవుతున్నారు. నాడు మెగాస్టార్ చిరంజీవితో దండాలు పెట్టించుకొని.. పవన్ పై నిత్యం కామెంట్స్ చేసే జగన్.. అల్లు అర్జున్ కి మాత్రం సపోర్ట్ ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారట.

అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అంటూ అంబటి ట్వీట్

అంతకన్నా ముందు.. మాజీ మంత్రి అంబటి సైతం అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అంటూ X లో పోస్టు పెట్టి.. పుష్పరాజ్ తో తమ పార్టీకున్న అనుబంధాన్ని బయట పెట్టేశారు. రిలీజ్ తర్వాత కూడా అర్జునుడు విడుదల అంటూ పోస్ట్ పెట్టారు. మాజీ ఎంపీ భరత్ అయితే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం ప్రమాదం మాత్రమేనంటూ సర్టిఫికేట్ ఇచ్చి.. అల్లు అర్జున్ కి మద్ధతు పలికేశారు. అంతే కాకుండా అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించిన లాయర్ నిరంజన్ రెడ్డి అయితే ఏకంగా వైసీపీ ఎంపీ కావడంతో.. తమ వల్లే అల్లు అర్జున్ బయటికి వచ్చారంటూ డప్పు కొడుతున్నారట.

వైసీపీ అల్లు అర్జున్ ని అస్త్రంలా వాడుకుంటుంటుందని..

కాలం కలిసి రాక అన్ని విషయాలు రివర్స్ అవుతున్న తరుణంలో.. మాజీ సీఎం జగన్ , వైసీపీ అల్లు అర్జున్ ని అస్త్రంలా వాడుకుంటుంటుందని.. కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రానున్న రోజుల్లో సైతం ఇదే కంటిన్యూ అవుతుందా.. అని సినీ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×