Bigg Boss8 Telugu: తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులకు మనసు దోచుకుంది.. ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదోవ సీజన్ కు కూడా ఎండ్ కార్డు పడబోతుంది. నేడు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ జరగనుంది. గత కొద్దిరోజులుగా విన్నర్ ఎవరా అని ఆలోచిస్తున్న జనాల ఎదురుచూపులకు సమాధానం దొరుకుతుంది. ఈ ఎపిసోడ్ ను అన్నపూర్ణ స్టూడియోలోనే చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.. గత సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ బయటకు రాగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈసారి అలాంటి అవకాశాలు లేకుండా భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చెయ్యడంతో పాటుగా 50 కి పైగా బిగ్ బాస్ ఏరియా చుట్టూ కెమెరాలను కూడా పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఏర్పాట్లు అన్ని గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా వస్తున్న సెలెబ్రేటీ కోసమని ఓ వార్త వినిపిస్తుంది.. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు..? ప్రైజ్ మనీ అమౌంట్ ఎంత అనేది తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు, మలుపులతో ఈ సీజన్ రసవత్తరంగా సాగింది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ గా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. దీంతో ఈ షో టాప్ టిఆర్పి దూసుకెళ్లోంది. సక్సెస్ పుల్ గా సాగుతున్న ఈ రియాల్టీ షో చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఈ సీజన్ క్లోజ్ అవుతుంది. ఇక అందరి మనసులో ఒకటే ఆలోచన విన్నర్ ఎవరో? రన్నర్ ఎవరో? అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ షోలో తొలుత 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. ఆ తర్వాత ఎనిమిది మంది కంటెస్టెంట్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లి ఉన్న ప్రతి ఒక్కరు బాగానే ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబిల్, అవినాష్ లు నిలిచారు. ఇందులోని ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడానికి, టైటిల్ ను కైవసం చేసుకోవడానికి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విన్నర్ గా నిలువాలని భావిస్తున్నారు.. ఇక అల్లు అర్జున్ చేతుల మీదగా బిగ్ బాస్ తెలగు సీజన్ 8 విన్నర్ కు ట్రోఫీ అందించనున్నట్టు సమాచారం. ఇక సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి, రిలీజ్ అయ్యాడు. అల్లు అర్జున్ గతంలో బిగ్ బాస్ ఫైనల్స్ కు వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కాని.. ఇప్పుడు మారిన పరిణామల నేపథ్యంలో బన్నీ వచ్చే అవకాశాలు లేవనే తెలుస్తోంది. రామ్ చరణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ వార్తలు మాత్రం నెట్టింట వినిపిస్తున్నాయి. ఎవరు వచ్చిన అక్కడ తొక్కిసలాట జరగకుండా ముందుస్తూ జాగ్రత్తలను పోలీసు తీసుకున్నారు. బిగ్ బాస్ ఫినాలే కు గెస్ట్ ఎవరన్న విషయం మరి కాసేపట్లో తెలియనుంది..