Big Stories

Dangerous ‘Zombie Drug: డేంజరస్ జాంబీ డ్రగ్! మన వరకు వస్తుందా?

Dangerous ‘Zombie Drug: జూబ్లీహిల్స్‌లో ఒక గ్రామ్ కొకైన్ దొరికింది. రాచకొండలో రెండు గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం.. సైబరాబాద్ పరిధిలో ఐదు గ్రాముల డ్రగ్స్ రికవరీ.. ఇలా రోజూ న్యూస్‌లో చూస్తునే ఉన్నాం.. వింటూనే ఉన్నాం. ఒకప్పుడు డ్రగ్స్‌ పట్టివేత అంటే ఓ సెన్సేషన్. కానీ మనం రోజు వినీ.. వినీ ఇప్పుడు కామన్‌ అయిపోయింది. కానీ ఈ డ్రగ్స్‌ ఎంత డేంజరసో తెలుసా? ఈ ఒక్కొక్క గ్రాము దేశాన్ని ఎలా కొంపముంచుతుందో తెలుసా? తెలియకపోతే ఆఫ్రికా సియెర్రా లియోన్‌ గురించి తెలుసుకోవాలి. అమెరికాలో ఎందుకు ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోవాలి. లెటెస్ట్‌గా బ్రిటన్‌లో మనుషుల ప్రాణాలు ఎందుకు పోతున్నాయో గమనించాలి.

- Advertisement -

డ్రగ్స్‌.. మొదట్లో ఆనందాన్ని.. ఎక్కడ లేని ఉత్తేజాన్ని ఇచ్చి.. మెల్లిమెల్లిగా మనిషిని దానికి బానిసగా చేసి.. కుంగి, కృశించి మనుషుల ప్రాణాలు తీసి కాని వదిలని పదార్థం. ఈ మధ్య కాలంలోనే అటు ఆరోగ్యంగా.. ఇటు సమాజంలో, కుటుంబంలో పోవాల్సిన పరవుకూడా పోతుంది. కానీ అదేదీ తలకెక్కదుగా.. ఎందుకంటే డ్రగ్స్‌ అప్పటికే మనషుల మెదళ్లతో తైతక్కలాడుతోంది. మొదట ఇలా ఒక గ్రామ్‌, రెండు గ్రామ్‌లు దొరికినప్పుడు పట్టించుకోకపోవడంతోనే.. సియెర్రా లియోన్ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సిక్స్‌ ఇయర్స్ బ్యాక్.. ఈ ఆఫ్రికన్ కంట్రీలో కనిపించింది జాంబీ డ్రగ్.. కానీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు.. ఫలితం డ్రగ్ వాడకం పెరిగింది. ఒక్కసారి ఈ డ్రగ్‌కు అడిక్ట్ అయితే ఇక అంతే సంగతులు.. చివరికి దేశంలో ఆ డ్రగ్ దొరకడం లేదు.

- Advertisement -

మరేం చేయాలి? అప్పుడే తెలిసింది ఈ డ్రగ్స్‌ వాడకం వల్ల చనిపోయిన వారి బోన్స్‌లో ఈ డ్రగ్ దొరకుతుందని. ఇంకేముంది అలా చనిపోయిన వారికోసం స్మశానాలను జల్లెడ పట్టారు.ఒక్కో శవాన్ని తవ్వితీసి ఆ బోన్స్‌తో మళ్లీ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిని వాడుతున్నారు.. ఇప్పుడు ఆ కంట్రీలో పరిస్థితి ఎంత దిగజారిందంటే.. డ్రగ్స్‌పై దేశం యుద్ధం చేయాల్సి వస్తోంది.. ఏకంగా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా.. ఈ డ్రగ్‌ను డెత్‌ ట్రాప్‌ అని క్లెయిమ్ చేశారు. ప్రస్తుతం డ్రగ్స్‌ బాధితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు..
కానీ ఫలితం మాత్రం ఆశించినంత ఉండటం లేదు. ప్రస్తుతం ఈ లియోన్ దేశ యువత డ్రగ్స్‌ మత్తులో జోగుతోంది. స్మశానంలో మృతదేహాలను తవ్వితీస్తున్నారంటై వారిలో మినిమం స్పందించే గుణాన్ని కూడా డ్రగ్స్‌ ఎలా ఆక్యుపై చేసిందో అర్థం చేసుకోవచ్చు.. అందుకే DRUGS ARE NOT ONLY INJURIOUS TO HEATLH, AND ALSO FOR SOCIETY AND COUNTRY..

ఆఫ్రికన్‌ కంట్రీస్‌లోనే కాదు.. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ డ్రగ్ చాయలు కనిపించాయి. కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ జాంబీ డ్రగ్‌గానే క్లాసిఫై చేసిన ఈ డ్రగ్‌ సైంటిఫిక్‌ ఫార్ములాను కూడా కనిపెట్టారు USలో గ్జైలాజైన్.. ఈ జాంబీ డ్రగ్ సైంటిఫిక్ నేమ్. నేరుగా తీసుకుంటే అప్పుడే పైకి వెళ్లిపోతారు. అందుకే ఇతర డ్రగ్స్‌తో కలిపి తీసుకొని అదో రకమైన అలౌకిక స్థితిలోకి వెళుతుంది అమెరికన్ యువత.. బాడీలో ఇంటర్నల్‌గా గాయాలవుతాయి.. తీసుకున్న వారు స్పృహలో ఉండటం లేదు. ఓ రకంగా చర్మాన్ని తినేస్తుంది ఈ డ్రగ్.. అందుకే శరీరంపై గాయాలవుతున్నాయి.

Also Read: మంగళగిరి ఛాలెంజ్ లో గెలుపెవరిది..

స్లోగా సిట్యూవేషన్‌ ప్రమాదకరంగా.. ఆ తర్వాత ప్రాణాంతకంగా మారుతుంది. వాంతులు చేసుకోవడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. హార్ట్ బీట్ స్లోగా అవ్వడం.. ఇవన్నీ దీని లక్షణాలు.. అన్ని బాగానే ఉన్నాయి కానీ.. అరికట్టడమే కష్టంగా మారింది.. చూస్తుండగానే ఈ డ్రగ్ అమెరికా నుంచి బ్రిటన్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే 11 మంది చనిపోయారు కూడా.. ఓ చనిపోయిన వ్యక్తి పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో మొదట ఈ విషయం బయటికి వచ్చింది. అంటే అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్‌ కూడా ఈ డ్రగ్‌ ఎంట్రీని కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు అరికట్టడానికి ఆపసోపాలు పడుతోంది.

ఇప్పటి వరకు సియెర్రా లియోన్, యూఎస్, బ్రిటన్ గురించి విన్నాం. ఇప్పుడు మన కంట్రీ విషయానికి వద్దాం.. ప్రస్తుతం ఇండియాలో డ్రగ్స్‌ వాడటం పెరుగుతోంది. ఒకప్పుడు హైక్లాస్‌ పీపుల్ చేతుల్లో మాత్రమే కనిపించే డ్రగ్స్.. ఇప్పుడు కాలేజీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఎప్పటికప్పుడు అక్కడో ఇక్కడో డ్రగ్స్ దొరకుతూనే ఉన్నాయి. చిన్న చిన్న అమౌంట్స్‌లో దొరకుతుండటంతో పట్టించుకోవడం లేదు కానీ.. చాప కింద నీరులా విస్తరిస్తోందనే విషయం మాత్రం అర్థమవుతోంది. ఒక్కసారి కరోనాలా ఈ జాంబీ డ్రగ్ విస్తరిస్తే పరిస్థితేంటి?
అక్కడెక్కడో ఆఫ్రికాలో మొదలై.. US, UKలోకి వచ్చిన డ్రగ్.. ఇండియాలోకి రాదన్న గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు మడి కట్టుకొని కూర్చుంటే.. నాశనమయ్యేది ఓ జనరేషన్.. ఒక్కసారి ఈ జాంబీ డ్రగ్‌కు అడిక్ట్ అయినవారిని చూస్తే తెలుస్తుంది. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో.

అందుకే డ్రగ్స్‌ను కూకటి వెళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మరింత పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పాత్రధారులతో పాటు.. సూత్రధారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తేనే.. డ్రగ్స్‌ను అరికట్టగలం.. మీ చుట్టుపక్కల ఎవరు డ్రగ్స్‌ వాడుతున్నా అడ్డుకోండి.. వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి. ఇలా చేస్తే మీరు కాపాడేది వారిని మాత్రమే కాదు.. ఓ జనరేషన్‌ని అనే విషయాన్ని మర్చిపోవద్దు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News