Malaika Arora: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మలైకా పేరు మారు మ్రోగిపోతూ ఉంటుంది. ఇక అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడిపిన ఈ భామ.. గత కొంతకాలంగా ఒంటరిగానే జీవిస్తుంది. తెలుగులో ఈ చిన్నది పవన్ కళ్యాణ్ తో కెవ్వు కేక అంటూ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఒకపక్క సోషల్ మీడియాతో ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది.
తాజాగా మలైకా ఖరీదైన కారు కొనడానికి ఇల్లు అమ్మినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని అంధేరి వెస్ట్ లో ఉన్న తన ఫ్లాట్ ను దాదాపు రూ. 5. 30 కోట్లకు విక్రయించింది మలైకా. గత నెలలోనే ఈ ఇల్లును విక్రయించింది. ఇల్లు అమ్మిన డబ్బుతో అమ్మడు రేంజ్ రోవర్ SUV ఐకానిక్ మోడల్ కారును కొనుకోలు చేసింది. దీని విలువ సుమారు రూ. 3 కోట్లు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ముంబైలో ఇప్పుడు అమ్మిన ఇల్లు మలైకా 2018 లో కేవలం రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు అదే ఇంటిని ఆమె 5 కోట్లకు విక్రయించి రెండు కోట్ల లాభంఅందుకుంది. అదే లాభంతో అమ్మడు ఖరీదైన కారును కొనుగోలు చేసి శభాష్ అనిపించుకుంది. ఇక మలైకా చేసిన పనికి కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్స్ లో డబ్బులు పెట్టి.. ఇల్లు, భూములు అమ్మడం, కొనడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మలైకా కూడా అదే చేసింది. తక్కువ ధరకు కొని.. ఎక్కువ ధరకు అమ్మి లాభాలను పొందింది. అలా చేయడం వలనే చాలామంది స్టార్లు కోట్లు గడిస్తున్నారు. మలైకా చేసినదాంట్లో తప్పేమి లేదని చాలామంది సమర్థిస్తున్నారు.
ప్రస్తుతం మలైకా.. తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో ఉంది.దానికోసమే అమ్మడు తన రేంజ్ ను కొద్దికొద్దిగా పెంచుకుంటూ వస్తుంది. ఎంత సల్మాన్ ఖాన్ కుటుంబానికి మాజీ కోడలు అయినా కూడా ఒంటరి మహిళగా ఆమె తన కొడుకు జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించాలని చూస్తుంది. దానికోసమే డైరెక్టర్స్ ను కూడా కలుస్తుందని సమాచారం. అన్ని కుదిరితే మలైకా కుమారుడు అర్హన్ ఖాన్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి ఖాన్స్ వారసుడు ఎలా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడో చూడాలి.