BigTV English

CM Jagan plan: పండితుల వద్దకు అభ్యర్థులు, చెల్లెళ్లకు ధీటుగా రంగంలోకి ఆమె..!

CM Jagan plan: పండితుల వద్దకు అభ్యర్థులు, చెల్లెళ్లకు ధీటుగా రంగంలోకి ఆమె..!

CM Jagan plan(AP Political news): ఎన్నికల నోటిఫికేషన్ సమయం కేవలం ఆరు రోజుల మాత్రమే ఉంది. ఇప్పటికే వైపీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అయితే ఏ రోజు నామినేషన్ వేస్తే తమకు బాగుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులు అప్పుడే వేద పండితులను సంప్రదించడం మొదలుపెట్టారు. చాలా మంది 20 తర్వాతే మంచిదని చెప్పడంతో డేట్, సమయం ఫిక్స్ చేసుకున్నారు.


ఈ విషయంలో అందరికంటే ముందున్నారు సీఎం జగన్. ఈనెల 22న ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకు న్నారు. కరెక్టుగా ఉదయం పదిన్నర గంటలకు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పేపర్లను రెడీ చేస్తున్నారు. నామినేషన్ తర్వాత జగన్ ప్రచారంలో నిమగ్నం కానున్నారు. జగన్.. తన నీడను నమ్మడని విపక్షంతోపాటు సొంత పార్టీ నేతలు సందర్భం వచ్చినప్పుడు చెబుతారు.

ముఖ్యంగా కడప, పులివెందులలో చాలామంది వైసీపీ నేతలు ఉన్నప్పటికీ జగన్ మాత్రం తన నియోజక వర్గం బాధ్యతలు భారతికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఎన్నికల అయ్యేవరకు పులివెందులలోనే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటికే కడప జిల్లాలో చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. హత్య కేసు నిందితులను సీఎం కాపాడుతున్నా రంటూ ధ్వజమెత్తారు.


ALSO READ: కోడ్ కూత నుంచి.. ఏపీలో బంగారమే బంగారం..!

రేపు మాపో తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో ప్రచారానికి భారతి బెటరనే భావనకు వచ్చారట ఫ్యాన్ పార్టీ అధినేత జగన్. తమను ఏకాకి చేసి అందరూ ఒకటయ్యారని చెప్పి ప్రచారం చేయాలని ప్లాన్ చేసినట్టు పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. జగన్ ఆలోచనను దగ్గరుండి గమనించినవాళ్లు, ఈయన మామూలు మనిషి కాదని అంటున్నారు. చెల్లెళ్లను ఎదుర్కోవడానికి వైఫ్ రంగంలోకి దించుతున్నారట వైసీపీ అధినేత జగన్. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఏమోగానీ ఈసారి కడపలోనూ ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని నేతలే బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×