Big TV Exclusive : ‘బిగ్ బాస్ సీజన్ 8’ (Bigg Boss 8 Telugu) తెలుగులో అన్లిమిటెడ్ ట్విస్ట్ లు , టర్న్స్ ఉంటాయని నాగార్జున ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో ఇన్ఫినిటీకి తగ్గట్టుగానే ఏకంగా ఎనిమిది మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్లను హౌస్ లోకి దింపారు. అయితే అంతకంటే ముందు హౌస్ నుంచి పలువురు కంటెస్టెంట్లను ఎప్పటిలాగే ఎలిమినేషన్ పేరుతో బయట పంపించారు. అందులో కొంతమంది ఎలిమినేషన్ మాత్రం అన్ ఫెయిర్ అన్న టాక్ వినిపించింది. అంతేకాకుండా పలువురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు గుప్పమంటున్నాయ్. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్లో జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎవిక్ట్ అయిన ఆదిత్య ఓం (Aditya Om) రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఆదిత్య ఓం రీఎంట్రీ…
‘బిగ్ బాస్ సీజన్ 8’ (Bigg Boss 8 Telugu) తెలుగు కొంచెం కొత్తగా మరింత మిస్టీరియస్ గా సాగుతోంది. నిజానికి కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, వీకెండ్ లో నాగార్జున వేసే మొట్టికాయలు తప్ప ఆట అంత రసవత్తరంగా లేదు అనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఇక వీటన్నింటినీ పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 8 ఐదవ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి, ఆదిత్య ఓంకి షాక్ ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఊహించనీ విధంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి డైరెక్టర్, నిర్మాత కం హీరో అయిన ఆదిత్య ఓం ను బయటకు పంపేశారు.
అయితే తాజాగా అందుతున్న బిగ్ టీవి (Big TV) ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఆయన మళ్లీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. హౌస్ లో ఉన్నంతకాలం ఆదిత్య ఓం వయసులో పెద్దవాడు అయినప్పటికీ ఎక్కడా హద్దుమీరి ప్రవర్తించలేదు. హౌస్ మేట్స్ అందరితోనూ కలిసిపోయే ప్రయత్నం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అన్నట్టుగా ఆయన కూల్ గా గేమ్ ఆడేవారు. కానీ ఆయన ఎలిమినేట్ అవ్వడం అన్నది ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. ఇక ఇప్పుడు ఆదిత్య ఓం మరోసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నాడు అన్న వార్త ఆయన అభిమానులను ఖుషి చేస్తోంది. మరి ఆయన బిగ్ బాస్ 8లో గేమ్ ఛేంజింగ్ పాయింట్ అవుతారా ? అన్నది చూడాలి.
ఆదిత్య ఓం ఎవరంటే?
‘లాహిరి లాహిరి లాహిరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఆదిత్య. 2000లలో హీరోగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ముంబైలో స్థిరపడి, దర్శక నిర్మాతగా మారారు. ఇక ఈ హీరో ధనలక్ష్మి ఐ లవ్ యూ, మా అన్నయ్య బంగారంతో సహా పలు తెలుగు, హిందీ సినిమాలలో నటించారు. 2013లో ‘బంధూక్’ అనే సినిమాలో తానే హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించాడు. అయితే ఆ తర్వాత అవకాశం తగ్గడంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నటుడిగా ‘బంధీ’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss 8 Telugu)లో కంటెస్టెంట్ గా తెరపైకి వచ్చాడు.