Bigg Boss Telugu season 9: బిగ్ బాస్ రియాల్టీ షో కి విపరీతమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ తెలుగులో మొదలైనప్పుడు మొదట ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. మొదటి సీజన్ లో చాలామంది తెలిసిన గెస్టులు దీనికి ఎంట్రీ ఇచ్చారు. అయితే సీజన్లు మారుతున్న కొద్దీ తెలిసిన వాళ్ళకంటే కూడా తెలుసుకోవలసిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు అనేది వాస్తవం.
బేసిగ్గా ఎన్టీఆర్, నాని హోస్ట్ గా చేసినప్పుడు చాలామంది తెలిసినవాళ్లు కంటెస్టెంట్ గా వచ్చేవాళ్ళు. కింగ్ నాగార్జున ఇప్పుడైతే హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారో,అప్పుడు కొత్త కొత్త కంటెస్టెంట్లు రావడం మొదలుపెట్టారు. ఏదేమైనా కూడా ఆ షో మాత్రం చాలా మందికి ఆసక్తిని రేకెత్తించింది అనేది వాస్తవం. మొత్తానికి 8 సీజన్లు ఈ రియాలిటీ షో పూర్తి చేసుకుంది అంటే ఎంత మేరకు ఒక సక్సెస్ అయింది అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.
ఈ షో కి చాలామంది తెలిసిన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ తరుణంలో ఒక ప్రముఖ హీరోయిన్ అక్క ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ మరి ఎవరో కాదు సంజన. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష కు చెల్లిగా నటించింది ఈవిడ. అంతేకాకుండా హీరో ఆది పినిశెట్టి వైఫ్ కి సంజన అక్క అవుతుంది.
గతంలో సంజనా మీద ఒక డ్రగ్ రాకెట్ కేసు కూడా ఉంది అని వార్తలు వచ్చాయి. అప్పట్లో శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) తరపున వాదిస్తున్న ప్రాసిక్యూషన్, నటి అర్చన మనోహర్ గల్రానీ అలియాస్ సంజన గల్రానీకి బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఆమె డ్రగ్స్ సిండికేట్‌లో యాక్టివ్ గా ఉంది అని, అలానే చాలా డబ్బులు సంపాదించి లగ్జరీ లైఫ్ డీల్ చేస్తుంది అని వాదించారు.
సంజన అసలు పేరు అర్చన మనోహర్ గల్రాని, 2005 లో విడుదలైన తెలుగు సోగ్గాడు సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కన్నడ సినిమా గండ హెండతి తో మంచి గుర్తింపు సాధించుకుంది. 2008 లో ప్రభాస్ నటించిన తెలుగు చిత్రం బుజ్జిగాడు లో త్రిష చెల్లి పాత్రలో కనిపించి మంచి పేరు సాధించింది. ఈవిడ ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చింది.