టైమ్ ఎప్పుడు ఏ గేమ్ ఆడుతుందో చెప్పడం కష్టం. బాధల్లో ఉన్నవారిని సంతోషంలోకి తీసుకెళ్తుంది. సంతోషంలో ఉన్నవారిని కష్టాల్లోకి నెట్టేస్తుంది. తాజాగా కర్నాటకలో జరిగిన ఇన్సిడెంట్ ను చూస్తే మీరు నిజమే అంటారు. తాజాగా సన్ రూఫ్ కారులో బయటకు వచ్చిన ఓ కుర్రాడు. గాల్లో తేలినట్లు ఫీలవుతున్నాడు. ఇంతలోనే ఆ చిన్నోడికి ఊహించని ప్రమాదం ఎదురయ్యింది. ట్రాఫిక్ బారియర్ బలంగా తగలడంతో కారులో కుప్పకూలిపోయాడు. ఆ అబ్బాయికి ఎలా ఉంది? అనేది తెలియకపోయినా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ రెడ్ టీషర్ట్ వేసుకున్న కుర్రా మహీంద్రా సన్ రూఫ్ కారులో లేచి నిల్చోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. గాల్లో తేలిపోతున్నట్లు ఫీలవుతున్నాడు. పిల్లాడు సన్ రూఫ్ నుంచి చిన్నోడో తల బయటకు పెట్టాడు అనే విషయాన్ని గమనించకుండా కారు నడిపే వ్యక్తి వేగంగా ముందుకు పోనిచ్చాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారియర్ ఎదురుగా వచ్చింది. ఒక్కసారిగా అబ్బాయి తలకు బలంగా తగిలింది. పిల్లాడి తల వెనక్కి వంగిపోయిట్లు అయ్యింది. అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న కుర్రాడు కారులోకి పడిపోయాడు. వెంటనే కారు ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన బెంగళూరులోని విద్యారణ్యపురలో జరిగినట్లు నెటిజన్లు చెప్తున్నారు.
Next time when you leave your kids popping their heads out, think once again! pic.twitter.com/aiuHQ62XN1
— ThirdEye (@3rdEyeDude) September 7, 2025
Read Also: కదులుతున్న రైల్లో కత్తితో పొడిచి, వామ్మో.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు కారు నడుపుతున్న వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అంత బిజీగా ఉన్నా, ఎదరుగా ట్రాఫిక్ బారియర్ ఉన్నా పట్టించుకోకుండా అంత వేగంగా వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పిల్లల పట్ల ఏమాత్రం జాగ్రత్త లేకుండా అలా ఎలా వెళ్తారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వీడియోను ‘థర్డ్ ఐ’ అనే ఎక్స్ అకౌంట్ లో కీలక విషయాలు వెల్లడించాడు. “మీ కారుకు సన్ రూఫ్ ఉండటం మంచిదే. అయితే.. పిల్లలు మరీ ఎక్కువ ఎత్తులో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ఎత్తుగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు సన్ రూఫ్ ద్వారా బయటకు తలపెట్టి ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. కానీ, థ్రిల్ కోసం వారి ప్రాణాలను బలిపెట్టకూడదు. పిల్లలను బాధ్యతగా చూసుకోవాలి. పిల్లాడు సగానికి పైగా కారు బయటే ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా దాన్ని నడిపే వ్యక్తి వేగంగా నడపడం వల్ల బాబు తల బారియర్ కు తగిలింది. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో అని చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంఫుల్” అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.
Read Also: బర్త్ డే చేస్తామని పిలిచి.. డోర్ లాక్ చేసి.. కోల్ కతాలో యువతిపై..